పిల్లలకు పొదుపు పాఠాలు.. ఇలా నేర్పి చూడండి..
పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం ప్రేమ అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. అందుకే వారు అడగ్గానే కొండమీది కోతినైనా తెచ్చివ్వడానికి సిద్దంగా ఉంటారు. అయితే ఇది అంత సరికాదు అంటున్నారు నిపుణులు. ముందుగా వారికి డబ్బులు పొదుపు చేసుకోవడం.. బడ్జెట్ అలాట్ మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పాలి. అంతేకాదు అవసరం, కోరికల మధ్య తేడాను అర్థమయ్యేలా చెప్పాలి.
పొదుపు.. జీవితానికి అతి ముఖ్యమైన పాఠం. కష్టపడి సంపాదించడమే కాదు. సంపాదించిన దాన్ని పొదుపుగా వాడుకోవడం, రేపటి రోజుకోసం పొదుపు చేయడం కూడా తెలిసి ఉండాలి. డబ్బులన్ని ఎలా పొదుపు చేయాలో పిల్లలకు చిన్నతనం నుంచే తల్లిదండ్రులు నేర్పించాలి. అప్పుడే వారు పెద్దయ్యాక కూడా డబ్బు విలువ తెలుసుకుని మసులుకుంటారు. బంగారు భవిష్యత్తుకు దారులు వేసుకుంటారు.
అలాగని పిల్లలకు నేరుగా డబ్బులు పొదుపు అంటే మాట వినరు. తల్లిదండ్రులు పిసినారుల్లా ప్రవర్తిస్తున్నారన్న భావన వస్తుంది. దాంతో పాటు తాము ఖర్చుపెట్టేది కొంచెమే కదా అని కూడా అనుకుంటారు. దీనికోసం చిన్నారుల మనసులో చెడు ప్రభావం పడకుండా పొదుపు గురించి నేర్పించడం ఎలా? అంటే దీనికి కొన్ని టిప్స్ ఉన్నాయి.
పిల్లలు ఏది అడిగితే అది కొనివ్వడం ప్రేమ అనుకుంటారు చాలామంది తల్లిదండ్రులు. అందుకే వారు అడగ్గానే కొండమీది కోతినైనా తెచ్చివ్వడానికి సిద్దంగా ఉంటారు. అయితే ఇది అంత సరికాదు అంటున్నారు నిపుణులు. ముందుగా వారికి డబ్బులు పొదుపు చేసుకోవడం.. బడ్జెట్ అలాట్ మెంట్ ఎలా చేసుకోవాలో చెప్పాలి. అంతేకాదు అవసరం, కోరికల మధ్య తేడాను అర్థమయ్యేలా చెప్పాలి.
దీనికోసం చిన్నతనం నుంచే అంటే ఐదేళ్ల వయసు నుంచే వారికి పాకెట్ మనీ ఇవ్వాలి. వారి నెలవారి ఖర్చులు, అవసరాలు అన్నింటికీ దాంట్లో నుంచే ఖర్చు పెట్టుకునేలా వారిని ప్రిపేర్ చేయలి. అలాగని డబ్బులు ఇచ్చి ఊరుకోవడం కాకుండా.. దాన్ని ఎలా ఖర్చు పెట్టాలి. ఏది ముఖ్యం, ఏది కాదు. ఏది అవసరం, ఏది కాదు.. అనే విషయాల్లో సలహాలిస్తూ సాయం చేయాలి.
గల్లాలు, పిగ్గీ బ్యాంకులు మరో పొదుపు ఆప్షన్ లు. వారికి గల్లానో, పిగ్గీ బ్యాంకో తెచ్చివ్వండి. తమ దగ్గరున్న డబ్బులు అందులో వేసుకునేలా ప్రోత్సహించండి. అది కూడా వారికి మీరు ఇచ్చిన పాకెట్ మనీలో మిగిలిన దాన్ని పొదుపు చేసుకోమనండి.
మనీ గేమ్స్ ఆడించడం ద్వారా వారికి మనీని ఖర్చుపెట్టడం, పొదుపు చేయడం రెండూ అర్థమవుతాయి. అందుకే వారి తీరిక వేళల్లో.. మోనోపలీలాంటి మనీ గేమ్స్ ఆడడం వల్ల బడ్జెట్ విషయంలో స్మార్ట్ గా తయారవుతారు.
kids
పిల్లలకు పని చెప్పడం కష్టపెట్టడం కాదు. వారికి జీవితం మీద అవగాహన కల్పించడమే. అందుకే పిల్లల్ని కిరాణా కొట్టుకో, కూరగాయల షాపుకో వెళ్లి ఏదైనా కొనుక్కురమ్మని అప్పుడప్పుడూ చెబుతుండాలి. వారికి కొంత డబ్బులు ఇచ్చి చిన్నచిన్న వస్తువులు కొనుక్కురమ్మంటే వారికి డబ్బులు ఎంత ఖర్చవుతున్నాయి. ఎలా లెక్క చూసుకోవాలి.. అర్థమవుతుంది.
పిల్లలెప్పుడూ తల్లిదండ్రులను చూసే నేర్చుకుంటారు. కాబట్టి పిల్లలకు పొదుపు, ఖర్చు విషయాలు నేర్పేముందు మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు. ఎంత పొదుపు చేస్తున్నారు. అనవసరమైన విషయాలకు ఖర్చుపెడుతున్నారా? అలా అయితే దాన్ని తగ్గించడం చేయాలి.
డబ్బులు సంపాదించడం నేర్పండి. ఇంటిపనులు, వంటపనుల్లో సాయం చేస్తే వారికి కాస్త డబ్బులు ఇవ్వండి. అలాగని పూర్తిగా మనీ మైండెడ్ కాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్త తీసుకోండి. శ్రమకు తగ్గ ఫలితం విలువ తెలపాలి.