ఒంట్లో వేడి తగ్గాలంటే ఇలా చేయండి..
Reduce Body Heat: ఎండాకాలం రాకతో చాలా మంది ఒంట్లో వేడి విపరీతంగా పెరిగిపోతూ ఉంటుంది. శరీరంలో వేడి ఎక్కువైతే.. కడుపునొప్పి, తలనొప్పి వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

ఆధునిక జీవన శైలి, చెడు ఆహారపు అలవాట్లు వంటి కారణాల వల్ల ఎన్నో జబ్బులు సోకే ప్రమాదం ఉంది. చిన్న సమస్యైనా తెగ చికాకు పుట్టిస్తుంటాయి. ఇలాంటి విషయాలను ఎప్పుడూ నెగ్లెట్ చేయకూడదు. ముఖ్యంగా ఈ ఎండాకాలంలో కొందరి శరీరంలో విపరీతంగా వేడి పెరిగిపోతుంది. దాన్ని వీలైనంత తొందరగా తగ్గించుకోకపోతే ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శరీరంలోని అధిక వేడిని మెదడులోని హైపోథాలమస్ తగ్గిస్తుంది. కాగా మన ఒంట్లో వేడిని తగ్గించుకోవడానికి మన ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మన బాడీలో వేడి తీవ్రస్థాయికి చేరితే మాత్రం మలబద్దకం, తీవ్రమైన తలనొప్పి, వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వేడి తగ్గేందుకు ఈ చిట్కాలు పాటించండి.. మనం కూర్చున ప్లేస్ లో తగినంత ఆక్సిజన్ లేకపోతే కూడా బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. కాబట్టి గాలి బాగొచ్చే ప్లేస్ లోనే కూర్చునే విధంగా ఏర్పాట్లు చేసుకోవాలి. వర్క్ మధ్య మధ్యలో లేచి కూలర్, ఫ్యాన్ కింద నిలబడితే.. వేడి నుంచి ఉపశమనం పొందవచ్చు.
గంటలకు గంటలకు ఒకే దగ్గర కూర్చుంటే కూడా ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. ఇలా కూర్చుంటే పైల్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి పని మధ్య మధ్యలో లేచి అటు ఇటు నడవండి.
వేడి ఎక్కువైనప్పుడు ఛాతి, మనికట్టు భాగంలో ఐస్ క్యూబ్స్ లేదా చల్లని నీళ్లతో తడపాలి. ఇలా చేస్తే వేడి నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చు.
ఎవరి శరీరంలో అయితే థైరాయిడ్ యాక్టీవ్ గా ఉంటుందో వారి ఒంట్లో వేడి విపరీతంగా పెరుగుతుంది. దీంతో వారి హార్ట్ బీట్ రేట్ కూడా పెరుగుతుంది. దీంతో వారికి చెమట విపరీతంగా పడుతుంది. జాండీస్ కూడా వీరికి రావొచ్చు. ఇలాంటి వారు ఖచ్చితంగా వైద్యుల సలహాలను సూచనలను పాటించాలి.
ఈ ఎండాకాలం మన ఒంట్లో ఉన్న నీరంతా చెమటరూపంలో బయటకు పోతూ ఉంటుంది. దాంతో బాడీ డీహైడ్రేషన్ బారిన పడుతూ ఉంటుంది. ఇలాంటప్పుడు కూడా శరీరంలో వేడి పెరుగుతుంటుంది. కాబట్టి ఈ కాలం నీళ్లను ఎక్కువగా తాగుతూ ఉండాలి. అప్పుడే శరీరంలో వేడి పుట్టదు.
ఒంట్లో వేడి ఎక్కువైనప్పుడు.. టీ స్పూన్ మెంతుల్ని పొడిగా చేసుకుని నీళ్లలో వేసుకుని తాగినా..లేదా మెంతుల్ని అలాగే తిన్నా వేడిమి తగ్గుతుంది.
రోజుకు రెండు సార్లు స్నానం చేయడమో.. లేకపోతే ఈతకొట్టడమో చేస్తే.. కూడా ఒంట్లో వేడి తగ్గుతుందని నిపుణులుు చెబుతున్నారు.