ఏం చేస్తే ఇంట్లో నుంచి ఎలుకలు పారిపోతాయి?
వర్షాకాలం మొదలుకాకముందే వర్షాలు అక్కడక్కడ పడుతూనే ఉన్నాయి. వార్షాకాలం ఆహ్లాదకరంగా ఉన్నా.. ఈ సీజన్ లో లేనిపోని రోగాలు వస్తాయి. ఇంట్లో ఉండే ఎలుకల వల్ల కూడా రోగాలు వస్తుంటాయి. అందుకే ఇంట్లో ఒక్క ఎలుక కూడా లేకుండా చేసే చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
దేశమంతటా అక్కడక్కడా వర్షాలు కరుస్తూనే ఉన్నాయి. ఈ సీజన్ లో ఎలుకల జ్వరం సహా అంటువ్యాధులు ఎక్కువగా వస్తుంటాయి. అందుకే ఆరోగ్యం గురించి జాగ్రత్తగా ఉండాలని డాక్టర్లు, ఆరోగ్య నిపుణఉలు చెబుతుంటారు. వర్షాకాలంలో నీరు నిలిచిపోవడం, పరిసరాల్లో పరిశుభ్రత లోపించడం వల్ల ఎలుకల బెడద బాగా పెరుగుతుంది. దీనివల్ల వివిధ రకాల అంటువ్యాధులు సోకుతాయి.
ఇంట్లో ఎలుకలు ఉంటే ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. వీటిలో లెప్టోస్పిరోసిస్ ఒకటి. లెప్టోస్పిరోసిస్ అనేది లెప్టోస్పిరా జాతికి చెందిన స్పిరోకెటా అనే ఎలుక జాతి వల్ల మానవులలో కలిగే జూనోటిక్ వ్యాధి. ఎలుకల మూత్రం ద్వారా సూక్ష్మక్రిములు విడుదలవుతాయి. ఇదే ఈ వ్యాధికి దారితీస్తుంది. ఎలుకలతో పాటు ఉడుతలు, ఆవులు, మేకలు, కుక్కల మూత్రం, మలమూత్రాలు కలిపిన నీటిని తాగేవారికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. ఇది చర్మంపై గాయాల ద్వారా లేదా కళ్లు, ముక్కు, నోటి ద్వారా వ్యాధికారకం మానవ శరీరంలోకి ప్రవేశిస్తుంది.
వ్యాధి లక్షణాలు
ఈ వ్యాధి బారిన పడిన వారికి అకస్మత్తుగా విపరీతమైన జ్వరం వస్తుంది. అలాగే కొన్నిసార్లు జ్వరంతో పాటుగా వణుకు కూడా రావొచ్చు. భరించలేని తలనొప్పి, కండరాల నొప్పి, మోకాలి కింద నొప్పి, వెన్నునొప్పి, కళ్లు ఎర్రబడటం, కామెర్లు, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, మూత్రం పసుపు రంగులోకి మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కామెర్లతో పాటుగా విపరీతమైన జ్వరం వస్తే అది ఎలుకల జ్వరంగా అనుమానించాలి. కామెర్లు, ఆకలి లేకపోవడం, మైకము, వాంతులు కూడా అవుతాయి. కొంతమందికి కడుపు నొప్పి, వాంతులు, మగత, చర్మంపై ఎర్రటి మచ్చలు ఏర్పడతాయి. ఈ వ్యాధి కాలేయం, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, గుండె, మెదడు వంటి శరీరంలోని అంతర్గత అవయవాలను ప్రభావితం చేస్తే ప్రాణాంతకంగా మారుతుంది.
మురుగునీటితో సంబంధం ఉన్నవారు, పారిశుద్ధ్య కార్మికులు, నీటిలోకి దిగే వాలంటీర్లు గ్లౌజులు, మోకాలి పొడవు పాదరక్షలు, మాస్కులు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ఖచ్చితంగా ఉపయోగించాలి. నిలిచిన నీటిలో పిల్లలను ఆడుకోనివ్వకూడదు. నీటిలోకి దిగితే చేతులు, కాళ్లను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవాలి. డాక్సీసైక్లిన్ మాత్రలను కలుషితమైన నీటికి గురైన కాలంలో గరిష్టంగా ఆరు వారాల పాటు వారానికి ఒకసారి 200 మి.గ్రా (100 మి.గ్రా యొక్క రెండు మాత్రలు) తీసుకోవాలి.
rats
ఎలుకలను ఇళ్ల నుంచి తరిమేయాలంటే ఏం చేయాలి...
1. ఇంటి చుట్టూ ఆహార వ్యర్థాలను పడేయకూడదు.
2. ఉల్లిపాయల వాసన ఎలుకలు పారిపోయేలా చేస్తుంది. అందుకే ఇందుకోసం ఉల్లిపాయలను తొక్క తీసి ఇంట్లోని వివిధ ప్రాంతాల్లో ఉంచండి. దీంతో ఎలుకలు ఇంట్లో ఉండవు.
3. వెల్లుల్లి కూడా ఎలుకలను తరిమికొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొద్దిగా నీటిని తీసుకుని వెల్లుల్లి ముక్కలను అందులో వేసి స్ప్రే చేయండి.
4. దాల్చిన చెక్క కూడా ఎలుకలు పారిపోయేలా చేస్తుంది. ఇందుకోసం దీనిని ఒక గుడ్డలో కొద్దిగా దాల్చినచెక్క తీసుకుని మూతపెట్టి ఎలుకలు ఉన్న చోట పెట్టండి.
5. ఎలుకల బెడదను నివారించడానికి కర్పూరం నూనె చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం కొద్దిగా దూది తీసుకుని కర్పూరం నూనెలో ముంచి కిటికీలు, తలుపులపై ఉంచండి.
6. ఎలుకలు ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో రాత్రిపూట బేకింగ్ సోడాను పిచికారీ చేయండి. ఉదయాన్నే దీన్ని క్లీన్ చేయండి.