MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chapati Dough: చేతితో కలపకుండా కేవలం నిమిషంలో చపాతీ పిండి కలిపే బెస్ట్ ట్రిక్ ఇది..!

Chapati Dough: చేతితో కలపకుండా కేవలం నిమిషంలో చపాతీ పిండి కలిపే బెస్ట్ ట్రిక్ ఇది..!

Chapati Dough: చపాతీ తినడం ఇష్టమే కానీ, పిండి కలపడమే చాలా కస్టంగా ఉంటుంది. కానీ, చేతులతో కలపకుండా.. కేవలం నిమిషంలో చపాతీ పిండి కలుపుకోవచ్చు. ఇలా కలిపిన పిండితో చపాతీలు మెత్తగా రావడం పక్కా

2 Min read
Author : ramya Sridhar
Published : Oct 09 2026, 01:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
నిమిషంలో చపాతీ పిండి కలిపేదెలా?
Image Credit : AI Image

నిమిషంలో చపాతీ పిండి కలిపేదెలా?

ప్రతిరోజూ రెగ్యులర్ గా రోటీ, చపాతీ, పూరీ తినడం అందరికీ ఇష్టమే. కానీ, ఉదయాన్నే పిండి కలుపుకోవడమే చాలా కష్టంగా ఉంటుంది. పిండి కలుపుతుంటే.. చేతులకు అంటుకుపోవడమే కాకుండా, చాలా మందికి పిండి కలుపుతుంటే చేతులు నొప్పి పెడతాయి. అంత కష్టపడి పిండి కలిపినా కూడా... ఒక్కోసారి పిండి గట్టిగా రావడం, ఒక్కోసారి పలచగా మారడం జరుగుతుంది. అలా అవ్వకుండా కేవలం నిమిషంలో పిండి మెత్తగా పర్ఫెక్ట్ గా ఎలా కలుపుకోవచ్చు.

చేతితో పిండి కలపడం కష్టంగా ఉంటే.. మీ ఇంట్లో ఉన్న మిక్సీ జార్ వాడి.. పిండిని మెత్తగా కలుపుకోవచ్చు. దాని కోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం....

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
మిక్సీజార్ లో పిండి కలపడానికి కావాల్సిన పదార్థాలు, కొలతలు..
Image Credit : AI Image

మిక్సీజార్ లో పిండి కలపడానికి కావాల్సిన పదార్థాలు, కొలతలు..

గోధుమ పిండి – 1 కప్పు

నీరు – అర కప్పు

ఉప్పు – తగినంత

వంట నూనె – 1 టేబుల్ స్పూన్

తయారీ విధానం.. జస్ట్ ఒక్క నిమిషం చాలు..

పిండి, నీరు కలపడం: ముందుగా ఒక పెద్ద మిక్సర్ జార్‌లో 1 కప్పు గోధుమ పిండి, అర కప్పు నీరు, తగినంత ఉప్పు వేయాలి.

మొదటి దశ (15 సెకన్లు): మిక్సర్ మూత పెట్టి కేవలం 15 సెకన్ల పాటు రన్ చేయాలి. ఆ తర్వాత మూత తీసి, పిండిని ఒక చెంచాతో ఒకసారి కలపాలి.

రెండవ దశ (15-20 సెకన్లు): మళ్లీ మిక్సర్‌ను 15 నుంచి 20 సెకన్లు ఆన్ చేయాలి. ఈపాటికి పిండి పూర్తిగా కలిసి ఉండలుగా ఏర్పడుతుంది.

మిక్సర్ జార్‌కు పిండి అంటుకోకుండా ఉండటానికి, చివరగా 1 టేబుల్ స్పూన్ వంట నూనె వేసి మిక్సర్‌ను రెండు సెకన్ల పాటు ఆన్ చేసి ఆఫ్ చేయాలి. దీనివల్ల పిండి జార్‌కు అంటుకోకుండా శుభ్రంగా రావడంతో పాటు మృదువుగా మారుతుంది.

33
పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు:
Image Credit : AI Image

పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు:

సరైన జార్ ఎంపిక: చిన్న చట్నీ జార్‌ను అస్సలు ఉపయోగించవద్దు. పిండి కదలడానికి వీలుగా ఎల్లప్పుడూ పెద్ద జార్ అంటే జ్యూసర్ లేదా పొడి గ్రైండింగ్ జార్ మాత్రమే వాడాలి.

పల్స్ మోడ్: మిక్సర్‌ను స్పీడ్ 1 లేదా 2 లో నిరంతరం నడపవద్దు. దీనివల్ల మోటారు, పిండి వేడెక్కుతాయి. కాబట్టి 'పల్స్/విప్' మోడ్‌లో ఆపి ఆన్ చేయడం ఉత్తమం.

నీటి మోతాదు: నీటిని ఒకేసారి పోయకుండా, ముందుగా ముప్పావు వంతు పోసి అవసరమైతేనే మిగతాది కలపాలి.

క్లీనింగ్ హ్యాక్: పిండి తీసుకున్న తర్వాత జార్ బ్లేడ్ చుట్టూ ఉన్న పిండిని చేతులతో గీకాల్సిన పనిలేదు. జార్‌లో కొద్దిగా గోరువెచ్చని నీరు, ఒక చుక్క డిష్‌వాషింగ్ లిక్విడ్ వేసి 5 సెకన్లు మిక్సర్‌లో తిప్పితే జార్ దానంతట అదే సులభంగా శుభ్రపడుతుంది.

మృదువైన చపాతీల కోసం: మిక్సర్ నుండి తీసిన వెంటనే పిండిని కలపకుండా, దానిపై తడి క్లాత్ కప్పి 10-15 నిమిషాలు పక్కన పెట్టాలి. దీనివల్ల గ్లూటెన్ విడుదలై చపాతీలు చక్కగా పొంగుతాయి.

న్యూట్రిషనల్ ట్విస్ట్: నీళ్లకు బదులుగా గోరువెచ్చని పాలు వాడితే చపాతీలు రోజంతా దూదిలా మెత్తగా ఉంటాయి. పిల్లల కోసం అయితే పిండిలో వాము, కసూరి మెంతి లేదా పాలకూర ప్యూరిని కలిపి రుచికరమైన పరాఠా పిండిని తయారు చేసుకోవచ్చు.

నిల్వ చేసే విధానం: మిగిలిపోయిన పిండి గోధుమ రంగులోకి మారకుండా, పైభాగం ఎండిపోకుండా ఉండటానికి దానిపై కొద్దిగా నూనె రాసి గాలిచొరబడని డబ్బాలో భద్రపరచాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 
3rd TEST • SA vs AUS
Stumps
SASA
(47.0 ov) 329 & 140/4
AUSAUS
429
Day 3
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Coconut water: 2 వారాలపాటూ రోజూ కొబ్బరినీళ్లు తాగితే జరిగే అద్భుతం ఇదే
Recommended image2
ప్రతిరోజూ అవిసె గింజల నీళ్లు తాగారంటే రెండు నెలల్లోనే సన్నగా మెరుపుతీగలా మారతారు
Recommended image3
Chanakya Niti: ఈ మూడు డైమండ్ కంటే విలువైనవి...కోటి రూపాయలు ఇచ్చినా కొనలేరు..!
Related Stories
Recommended image1
Cooking Tips: ఇదొక్కటి రెండు చుక్కలు వేస్తే.. బెండకాయ జిగురు లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది..!
Recommended image2
Chana Dal: శనగపప్పు తొందరగా ఉడకడం లేదా? ఈ ఒక్క ట్రిక్ పాటిస్తే 10 నిమిషాల్లో మెత్తగా ఉడికిపోతుంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved