హెన్నాతో హెయిర్ కలర్ ను ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసా?
తెల్ల జుట్టు ఉన్నవాళ్లు ఖచ్చితంగా హెయిర్ కలర్ ను వేసుకుంటుంటారు. అయితే ఇంట్లోనే చాలా ఈజీగా కొన్ని గోరింటాకు ఆకులు, ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలతో చాలా సులువుగా హెయిర్ డైని తయారుచేయొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఈ రోజుల్లో చాలా మందికి చిన్న వయసులోనే తెల్ల జుట్టు వస్తోంది. ఇంకేముంది తెల్ల వెంట్రుకలను దాయడానికి మార్కెట్ లో దొరికే కలర్లను వాడుతుంటారు. కానీ కెమికల్ కలర్స్ జుట్టును మాత్రమే కాదు మన ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తాయి. నిజానికి హెయిర్ కలర్ ను మీరే స్వంతంగా ఇంట్లో తయారుచేసుకోవచ్చు. దీనికోసం మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు.
గోరింటాకుతో మంచి హెయిర్ డైని ఈజీగా తయారుచేసి వాడొచ్చు. ఇందుకోసం మీరు మార్కెట్ లో దొరికే కెమికల్స్ ను వాడాల్సిన అవసరం కూడా ఉండదు. ఈ హెయిర్ డైని వాడితే మీ వెంట్రుకలు అస్సలు దెబ్బతినవు. అలాగే మీ జుట్టు బలంగా పెరుగుతుంది. మరి గోరింటాకుతో హెయిర్ కలర్ ను ఎలా తయారుచేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఇంట్లో గోరింటాకు డైని తయారుచేయడానికి కావాల్సిన పదార్థాలు:
గోరింటాకు ఆకులు లేదా పొడి, కొన్ని వాటర్
తయారుచేసే విధానం:
ఈ హెయిర్ డైని చాలా ఈజీగా తయారుచేయొచ్చు. ఇందుకోసం గోరింటాకు పొడిలో నీళ్లు పోసి పేస్ట్ లా చేయండి. ఇది చిక్కగా కావాలంటే దీన్ని రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే బ్రష్ తో తెల్ల జుట్టుకు వేయండి. దీన్ని సుమారుగా 2 నుంచి 3 గంటలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత సల్ఫేట్ లేని కండీషనర్ తో జుట్టును వాష్ చేయండి. దీనివల్ల మీ జుట్టు షైనీగా మంచి కలర్ వస్తుంది. ఇది తెల్ల వెంట్రుకలు కనిపించకుండా చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అలాగే జుట్టును నల్లగా చేస్తుంది.
నల్లని వెంట్రుకల కోసం హెయిర్ డై
బ్లాక్ హెన్నా పౌడర్, బ్రూడ్ కాఫీ
తయారుచేసేవిధానం:
ముందుగా గోరింటాకు పొడిని తీసుకుని అందులో కాఫీ పొడిని వేసి కలపండి. దీన్ని లోహేతర పాత్రలో వేసి పల్చని పేస్ట్ చేయండి. దీన్ని రాత్రంతా అలాగే ఉండనీయండి. ఆ తర్వాత ఉదయాన్నే దీన్ని జుట్టుకు అప్లై చేయండి. ఇది ప్రతి వెంట్రుకకు బాగా పట్టేలా చూడాలి. 2 నుంచి 3 గంటలు అలాగే ఉంటే మీ జుట్టుకు మంచి రంగు పడుతుంది. ఆ తర్వాత మీరు సల్ఫేట్ లేని కండీషనర్ తో జుట్టును వాష్ చేయండి.
షైనీ జుట్టుకోసం
గోరింటాకు పౌడర్, వాటర్, నిమ్మరసం
తయారుచేసే విధానం
ఇందుకోసం గోరింటాకు పొడిని ఒక గిన్నెలో వేసి అందులో కొన్ని నీళ్లు పోసి కలపండి. దీంట్లోనే 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని వేడి బాగా కలగలపండి. అయితే దీన్ని వెంటనే జుట్టుకు పెట్టుకోకుండా 2-3 గంటలు లేదా రాత్రంతా అలాగే ఉంచండి. ఉదయాన్నే దీన్ని జుట్టుకు పెట్టుకుని పూర్తిగా ఆరిన తర్వాత సల్ఫేట్ లేని కండీషనర్ తో తలస్నానం చేయండి.