ఎక్సర్ సైజ్ చేయకుండా బరువు తగ్గడం ఎలా?
బరువు తగ్గాలంటే ఖచ్చితంగా జిమ్ కు వెళ్లాల్సిందే. వ్యాయామం చేయాల్సిందేనంటారు చాలా మంది. కానీ వ్యాయామం చేయకున్నా సులువుగా బరువు తగ్గొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
బరువు తగ్గడం అంత సులువైన పని కాదనుకుంటారు చాలా మంది. వ్యాయామం చేస్తేనే బరువు తగ్గుతారని భావిస్తారు. నిజానికి వ్యాయామం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అందులో బరువు తగ్గడం కూడా ఉంది. కానీ చాలా మందికి ఎక్సర్ సైజ్ చేసేంత టైం ఉండదు. పొద్దున్నే లేచి ఇంట్లో పనులను చేసుకుని స్నానం చేసి, ఇంత తిని, ఆఫీసుకు వెళ్లి మళ్లీ ఆఫీసు పనులను ముగించుకుని తిరి గి ఇంటికి వచ్చే సరికి ఏడో ఏనిమిదో అవుతుంది. ఈ పనుల వల్ల బాగా అలసిపోతారు. ఇంకేముందు మళ్లీ ఇంత తిని హాయిగా పడుకుంటారు. కానీ ఈ అలవాట్ల వల్ల మీరు బాగా బరువు పెరిగిపోతారు. వ్యాయామం చేసే టైం లేనివారు కూడా చాలా సులువుగా బరువు తగ్గొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
హెల్తీ ఫుడ్స్
ఆరోగ్యాన్ని పాడు చేసే ఆహారాలను తినడం వల్లే బరువు పెరగడంతో పాటుగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. అందుకే మీరు బరువు తగ్గాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా హెల్తీ ఫుడ్స్ నే తినండి. ప్రతిరోజూ పండ్లు, కూరగాయలు, పండ్లు, ప్రోటీన్లు, తృణధాన్యాలు వంటి పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాలను తినండి. బరువు తగ్గాలనుకునేవారు జంక్ ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారాలు, తీపి ఆహారాలను అస్సలే తనకూడదు.
weight loss
హైడ్రేటెడ్
హైడ్రేషన్ కూడా బరువు తగ్గడానికి సహాయపడుతుంది. శరీరంలో నీళ్లు పుష్కలంగా ఉంటే అనవసరమైన కొవ్వులు పేరుకుపోవు. అందుకే ప్రతిరోజూ మూడు లీటర్ల నీటిని తాగండి. నీళ్లతో శరీరం హైడ్రేట్ గా ఉంటుంది. అలాగే ఆకలి కూడా చాలా వరకు తగ్గుతుంది. చాలా మంది దాహాన్ని కూడా ఆకలిగా భావించి ఏదో ఒకటి తింటంటారు. అందుకే నీళ్లను పుష్కలంగా తాగండి. ఇది మీరు బరువు తగ్గడానికి ఎంతగానో సహాయపడుతుంది.
తక్కువ కేలరీల ఆహారం
కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను తింటే విపరీతంగా బరువు పెరిగిపోతారు. అందుకే బరువు తగ్గాలంటే మాత్రం కేలరీలు తక్కువగా ఉండే ఆహారాలనే తినండి. కానీ పోషకాలను మాత్రం పుష్కలంగా తీసుకోవాలి. మీ ప్లేట్ లో అన్నం ఒక కప్పు ఉంటే రెండు కప్పుల కూరలు ఉండేట్టు చూసుకోండి. ఎక్సర్ సైజ్ చేయకుండా బరువు తగ్గడానికి ఇది చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. సాధారణంగా ఒక వ్యక్తికి రోజుకు 2,000 కేలరీలు అవసరం. బరువు తగ్గాలనుకునేవారు 1800 కేలరీలను తీసుకోవచ్చు.
తినడం మానేయొద్దు
చాలా మంది బరువు తగ్గాలని తినడం మానేస్తుంటారు. బరువు తగ్గాలనుకుంటే మాత్రం మీరు రోజుకు ఒకటి లేదా రెండే సార్లు తినడం అస్సలు చేయకండి. ఎందుకంటే ఇది మీ ఒంట్లో శక్తి లేకుండా చేస్తుంది. అలాగే మానసిక ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. బరువు తగ్గాలనుకునేవారైనా రోజుకు మూడు పూటలా భోజనం చేయాలి. అలాగే రోజుకు మూడు పూటలా ఒకసారి ఎక్కువగా ఒకసారి తక్కువగా తినడం కూడా మానుకోండి.
పార్ట్ టైమ్ భోజనం
బరువు తగ్గాలనుకునేవారు వీలైనంత వరకు ఆకలి అయినప్పుడు మాత్రమే తినండి. అయితే మనలో చాలా మంది కూరలు కాస్త టేస్టీగా అయితే అన్నం కాస్త ఎక్కువగానే తింటుంటారు. కానీ దీనివల్ల బరువు బాగా పెరిగిపోతారు.
ఒత్తిడి నిర్వహణ
బిజీ లైఫ్ వల్ల చాలా మంది బాగా ఒత్తిడికి లోనవుతుంటారు. కానీ ఒత్తిడికి గురైతే బరువు తగ్గడం చాలా కష్టం. ఎందుకంటే ఒత్తిడిలో ఇంకా ఎక్కువగా తింటారు. అందుకే ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలను చేయండి. ఇవి మీకు రిఫ్రెష్ అనుభూతిని ఇస్తాయి. అలసటను దూరం చేస్తాయి.
weight loss
ఎనిమిది గంటల నిద్ర..
బరువు తగ్గాలనుకుంటే మీరు కంటి నిండా నిద్రపోవాలి. అంటే మీరు రోజుకు ఎనిమిది నుంచి తొమ్మిది గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. సరిగ్గా నిద్రపోకపోతే ఆకలి హార్మోన్లకు అంతరాయం కలుగుతుంది. దీనివల్ల మీకు రాత్రిపూట కూడా బాగా ఆకలి అయ్యి ఏదో ఒకటి తింటారు. ఇది మీరు బరువు పెరిగేలా చేస్తుంది.