MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Summer Hacks: ఇంట్లో ఏసీ, కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా మార్చుకోవచ్చు, ఎలానో తెలుసా?

Summer Hacks: ఇంట్లో ఏసీ, కూలర్ లేకపోయినా రూమ్ చల్లగా మార్చుకోవచ్చు, ఎలానో తెలుసా?

తక్కువ ఖర్చుతో గదిని చల్లగా ఉంచే కొన్ని సులభమైన హ్యాక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనదిగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి గదిలో చల్లదనాన్ని తీసుకురావడమే.వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం..

2 Min read
Author : ramya Sridhar
Published : May 05 2025, 01:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Air coolers

Air coolers

మే నెల వచ్చింది అంటే చాలు బయట ఎండలు మండిపోతూ ఉంటాయి. ఇలాంటి ఎండల్లో ఇంట్లో ఉన్నా కూడా  వేడి తట్టుకోవడం కష్టమే. ఆ వేడి తట్టుకోవడానికి  ఏసీ, కూలర్ లాంటివి వాడేస్తాం. కానీ, ఏసీ, కూలర్ లేకపోయినా ఇంటిని మొత్తం చల్లగా చేసుకోవచ్చు.  ఏసీ ఉన్నవారు అయినా కూడా 24 గంటలు ఏసీ వాడలేం కదా.. కరెంట్ బిల్లు వాచిపోతుంది. అలా కాకుండా.. రూపాయి ఖర్చు లేకుండా ఎలా కూల్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

తక్కువ ఖర్చుతో గదిని చల్లగా ఉంచే కొన్ని సులభమైన హ్యాక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అందులో ముఖ్యమైనదిగా ప్లాస్టిక్ బాటిళ్లను ఉపయోగించి గదిలో చల్లదనాన్ని తీసుకురావడమే.వాటిని ఎలా వాడాలో తెలుసుకుందాం..

35

ఐస్ క్యూబ్స్,వాటర్ బాటిల్ హ్యాక్..

3 నుంచి 4 ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకొని వాటిలో నీళ్లు నింపాలి. తర్వాత వాటిని రాత్రంతా ఫ్రీజర్‌లో ఉంచాలి. ఈ నీరు పూర్తిగా ఐస్‌గా మారిన తర్వాత వాటిని ఒక ట్రే మీద ఉంచి, దానిపై ఒక క్లాత్ కప్పి ఉంచాలి.  వాటిని ఫ్యాన్ లేదా కూలర్ ముందు ఉంచాలి. ఫ్యాన్ నుండి వచ్చే గాలి ఈ బాటిళ్లను తాకి చల్లగా మారుతుంది. దీనివల్ల గది మొత్తం చల్లగా మారుతుంది.

45

కోల్డ్ ఎయిర్ ట్రిక్:
ఇంకో హ్యాక్‌లో టేబుల్ ఫ్యాన్,  3 లేదా 4 ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు అవసరం. మొదట ఈ బాటిళ్లను మధ్యలో కట్ చేసి, వాటిని ఒక పేపర్‌పై అతికించాలి. ఇప్పుడు ఈ పేపర్‌ను ఫ్యాన్ ముందు భాగానికి అతికించాలి. ఇప్పుడు ఫ్యాన్ వెనుక భాగంలో ఐస్‌తో నిండిన పాత్రను ఉంచాలి. ఈ విధంగా తయారైన ఫ్రెండ్లీ కూలర్ గదిని చాలా తక్కువ సమయంలోనే రూమ్ మొత్తం చల్లబరుస్తుంది.

55

కొబ్బరి చిప్పల హ్యాక్...
మీ ఇంట్లో కొబ్బరి తీసేసిన కొబ్బరి చిప్పలు ఉన్నా వాటితో కూడా మీరు మీ ఇంటిని చల్లగా మార్చుకోవచ్చు. మీరు ఒక ప్లాస్టిక్ డబ్బాలో ఈ కొబ్బరి చిప్పలను ఉంచి.. నీరు పోసి ఐస్ గడ్డ కట్టే వరకు ఉంచాలి. మొత్తం గడ్డ కట్టిన తర్వాత.. ఈ కొబ్బరి చిప్పలను టేబుల్ ఫ్యాన్ ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా రూమ్ మొత్తం చల్లగా మారుతుంది. 


ఇతర సహాయక పద్ధతులు:

కాటన్ షీట్లు: నేల మీద కాటన్ షీట్స్ వేసి ఉంచాలి. ఇలా చేయడం వల్ల  గదిలో వేడి తగ్గించడంలో సహాయపడుతుంది.

మట్టి కుండలో నీరు: గదిలో మట్టి కుండలో నీరు ఉంచడం వలన గది తేమగా ఉండి చల్లదనాన్ని కలుగజేస్తుంది.

ఖస్ షీట్లు, తెరలు: మార్కెట్లో ఖస్ షీట్లు ఈజీగా లభిస్తాయి. వీటిని మీరు  కిటికీలకు, తలుపులకు ఖస్ షీట్లు, తెరలు వేయడం వలన బయట నుండీ వచ్చే వేడిని తగ్గించవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
ఇదెక్కడి వింత ఆచారం! పెళ్లి తర్వాత వధూవరులు టాయిలెట్‌కు వెళ్లకూడదా!!
Recommended image2
Cloves: దిండు కింద లవంగాలు పెట్టుకొని పడుకుంటే ఏమౌతుంది?
Recommended image3
Apple: కట్ చేసిన యాపిల్ రంగు మారకుండా ఉండాలంటే ఈ చిన్న పని చేస్తే చాలు!
Related Stories
Recommended image1
పచ్చిమామిడితో హెల్తీ డ్రింక్ - ఒక్క గ్లాసు తాగితే ఫుల్ రిలీఫ్
Recommended image2
Sabja Seeds: సమ్మర్ లో సబ్జా గింజలను తీసుకుంటే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved