MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • గొంతులోంచి శ్లేష్మం బయటకు రావడం లేదా? అయితే ఇలా చేయండి..

గొంతులోంచి శ్లేష్మం బయటకు రావడం లేదా? అయితే ఇలా చేయండి..

గొంతులోని కఫం, శ్లేష్మం ఎన్నో అంతర్లీన సంక్రమణకు సంకేతాలు. అందుకే వీటిని అలాగే వదిలేయకూడదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ సమస్యల నుంచి బయటపడొచ్చు.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 28 2022, 11:47 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17

గొంతులోని కఫం, శ్లేష్మం ఎంతో ఇబ్బంది పెడతాయి. అయితే ఇవి కొన్ని సంక్రమణలకు సంకేతాలు. అందుకే వీటిని లైట్ తీసుకోకూడంటున్నారు నిపుణులు. ఒక వ్యక్తి అనారోగ్యంతో ఉంటే.. అతని శరీరంలో కొన్ని భాగాల్లో శ్లేష్మం ఏర్పడుతుంది. ముఖ్యంగా గొంతులోనే శ్లేష్మం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల శ్వాస తీసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఈ శ్లేష్మం ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. దీన్ని సహజంగా వదిలించుకోవచ్చు. అదెలాగంటే.. 

27

హైడ్రేట్ గా ఉండాలి

ద్రవాలు శ్లేష్మాన్ని పల్చగా చేయడానికి సహాయపడతాయి. శ్మేష్మం మీ గొంతులో పేరుకుపోకుండా ద్రవాలు నిరోధిస్తాయి అందుకే రోజూ నీటిని పుష్కలంగా తాగండి. టీ, ఇతర పానీయాలను కూడా తాగండి. సూప్ లేదా ఎక్కువ వాటర్ కంటెంట్ ఉన్న ఆల్పహారాన్ని తీసుకోండి. మహిళలు రోజుకు 2.7 లీటర్ల నీటిని తాగాలి. పురుషులు రోజుకు సుమారు 3.7 లీటర్ల నీటిని తాగాల్సి ఉంటుంది. కఫం నుంచి ఉపశమనం పొందడానికి గోరువెచ్చని నీళ్లు, టీ లేదా సైడర్ వంటి ద్రవాలు సహాయపడతాయి. వేడి శ్లేష్మాన్ని మృదువుగా, పల్చగా చేస్తుంది. దీంతో ఇది సులువుగా బయటకు పోతుంది. మీ గొంతు క్లియర్ అవుతుంది. 
 

37

ఉప్పు నీటితో గార్గిల్ చేయండి

ఉప్పు నీటితో గార్గ్లింగ్ చేయడం వల్ల శ్లేష్మం పల్చగా అయ్యి గొంతు క్లియర్ అవుతుంది. ఇందుకోసం ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిని తీసుకుని అందులో 2 నుంచి 3 టీ స్పూన్ల ఉప్పు వేయండి. ఈ ఉప్పు నీటిని సిప్ చేసి కొన్ని సెకన్ల పాటు గార్గిల్ చేయండి. అయితే మీ గొంతులో నీటిని ఉంచేటప్పుడు మీ తలను వెనకకు వంచండి. ఆ తర్వాత బయటకు ఉమ్మేయండి. ఇలా ప్రతి రెండు లేదా మూడు గంటలకు చేయండి. ఇది శ్వాసనాళ ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుంది. 

47

పిప్పరమెంట్ టీ

పిప్పరమెంట్ టీలో మెంతోల్ అనే ముఖ్యమైన నూనె ఉంటుంది. ఇది కఫం, దగ్గు, ముక్కు కారడం, ముక్కు దిబ్బడ, తలనొప్పి, ఫ్లూ, జలుబు లక్షణాలను తగ్గిస్తుంది. ఈ టీలో యాంటీ వైరల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరానికి జలుబుతో పోరాడటానికి, వేగంగా కోలుకోవడానికి సహాయపడతాయని డాక్టర్లు చెబుతున్నారు. 
 

57

వేడి ఆవిరిని పీల్చండి

కొద్దిగా ఉప్పు వేసిన నీటిని, యాకలిస్టస్, రోజ్మోరీ వంటి మొక్కల నూనెలతో తయారుచేసిన ఆవిరిని పీల్చడం వల్ల మీ శ్లేష్మ పొరలను తేమగా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే మీ నాసికా మార్గాలను ఇది క్లియర్ చేస్తుంది. ఈ నూనెల కొన్ని చుక్కలను రుమాలకు అంటించి బాగా పీల్చితే కూడా మీ గొంతు క్లియర్ అవుతుంది. 
 

67

పసుపు

పసుపులో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. మంటను తగ్గిస్తుంది. అలాగే రోగనిరోధక శక్తిని పెంచుంతుంది. 

ఒక గ్లాస్ వేడి నాన్ డెయిరీ పాలలో అర టీస్పూన్ నల్ల మిరియాలు, పసుపును, ఒక చిన్న టీ స్పూన్ తేనెను కలపండి. శ్లేష్మం బయటకు పోయేంత వరకు ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని తాగొచ్చని నిపుణులు చెబుతున్నారు. 

అయితే ఈ మిశ్రమానికి ఆవు పాలను ఉపయోగించకూడదు. ఎందుకంటే పాల ఉత్పత్తులు శ్లేష్మాన్ని చిక్కగా చేస్తాయి. పసుపు టీని తాగినా చక్కటి ఫలితం ఉంటుంది. 
 

77
alcohol

alcohol

ఆల్కహాల్, కెఫిన్ కు దూరంగా ఉండాలి

ఆల్కహాల్, కెఫిన్ లను ఎక్కువగా తీసుకంటే మీ బాడీ డీహైడ్రేట్ అవుతుంది. శ్లేష్మం, కఫం సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు వెచ్చని, కెఫిన్ లేని పానీయాలను పుష్కలంగా తాగాలి. ఇవి మీ గొంతును క్లియర్ చేస్తాయి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Akshaya Tritiya 2026: అక్షయ తృతీయ ఎప్పుడు? బంగారం కొనడానికి శుభ ముహూర్తం ఏది?
Recommended image2
Thati Kallu: స‌మ్మ‌ర్‌లో తాటి క‌ల్లు మంచిదా, ఈత‌ది మంచిదా.? ఇంత‌కీ రెండింటికీ మ‌ధ్య తేడా ఏంటి.?
Recommended image3
Muscle Building: కండలు పెంచాలా? ప్రతిరోజూ వీటిని తినండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved