ఈ ఒకటి పెట్టినా.. చుండ్రు ఒక్కసారికే పూర్తిగా పోతుంది
చాలా మందికి చుండ్రు సమస్య ఉంటుంది. కానీ ఈ చుండ్రు వల్ల జుట్టు బాగా ఊడిపోతుంది. అలాగే బాగా దురద పెడుతుంది. అయితే ఒకటి పెడితే చుండ్రు మొత్తమే లేకుండా పోతుంది. అదేంటంటే?
dandruff
చాలా మందికి ఉండే జుట్టు సమస్యల్లో చుండ్రు ఒకటి. ఇది సర్వ సాధారణ సమస్య.ప్రపంచ జనాభాలో సుమారుగా 50% మంది తమ లైఫ్ లో ఏదో ఒక సమయంలో చుండ్రు సమస్యను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు.
అయితే చుండ్రు చిన్న సమస్యే అయినా.. ఇది వెంట్రుకలు బాగా ఊడేలా చేస్తుంది. చుండ్రు సమస్యను తగ్గించడానికి సహాయపడే ఎన్నో ప్రొడక్ట్స్ మార్కెట్ లో ఉంటాయి. కానీ వీటిని వాడినా ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది.
ఎంతో మంది చుండ్రు పోయేందుకు ఎన్నో ప్రొడక్ట్స్ ను వాడుతుంటారు. కానీ చుండ్రు మాత్రం పోదు. కానీ కొన్ని ఇంటిచిట్కాలను పాటిస్తే మాత్రం ఖచ్చితంగా చుండ్రు మొత్తమే లేకుండా పోతుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
టీ ట్రీ ఆయిల్
టీ ట్రీ ఆయిల్ లో ఎన్నో ఔషద లక్షణాలు ఉంటాయి. ముఖ్యంగా ఇది చర్మానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. అంతేకాదు ఇది చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది.
ఈ ఆయిల్ లో యాంటీమైక్రోబయల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చుండ్రును పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. టీ ట్రీ ఆయిల్ ఫంగల్ చర్మ సమస్యలను తగ్గించడంలో మెడిసిన్స్ లా పనిచేస్తుంది.
Dandruff free scalp
కొబ్బరి నూనె
కొబ్బరి నూనె మన జుట్టుకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టును బలంగా, పొడుగ్గా పెరిగేలా చేయడంతో పాటుగా చుండ్రును పోగొట్టడానికి కూడా సహాయపడుతుంది. కొబ్బరి నూనె నెత్తికి ఒక మల్టీ టాస్కింగ్ లా పనిచేస్తుంది. ఇది నెత్తిని హైడ్రేట్ గా ఉంచుతుంది. మంటను తగ్గిస్తుంది. అలాగే నెత్తిమీద మైక్రోబయోమ్ ను మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
కొబ్బరి నూనె అటోపిక్ చర్మశోథ లక్షణాలను 68% తగ్గిస్తుంది. కొబ్బరి నూనెలోని సహజ యాంటీమైక్రోబయల్ లక్షణాలు చుండ్రుకు కారణమయ్యే శిలీంధ్రాలను నివారిస్తాయి. అందుకే తలస్నానం చేయడానికి 2 గంటల ముందు తలకు కొబ్బరి నూనె రాయండి.
కలబంద
కలబంద చుండ్రును పూర్తిగా పోగొట్టడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. ఇది ఎన్నో చర్మ సమస్యలను నయం చేయడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. కలబంద జెల్ లో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఈ కలబంద చుండ్రుకు కారకాలైన శిలీంధ్రాలను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. అలాగే మంటను తగ్గిస్తుంది. మంచి ఫలితాల కోసం స్వచ్ఛమైన కలబంద జెల్ ను నేరుగా నెత్తికి పెట్టండి.
ఒత్తిడి
ఒత్తిడి వల్ల కూడా చుండ్రు సమస్య వస్తుంది. అయితే ఇది పరోక్షంగా వస్తుంది. స్ట్రెస్ లెవెల్స్ పెరగడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుంది. చుండ్రుకు కారణమయ్యే ఫంగల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటాన్ని శరీరానికి కష్టతరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం, లేదా లోతైన శ్వాస వ్యాయామాలు చేయండి. ఇది మీ మానసిక ఆరోగ్యాన్నే కాదు మీ జుట్టును కూడా ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్
ఆపిల్ సైడర్ వెనిగర్ ను చుండ్రును తగ్గించుకోవడానికి కూడా ఉపయోగించొచ్చు. దీనిలో ఉండే ఆమ్లత్వం చనిపోయిన చర్మ కణాలను తొలగించడానికి సహాయపడుతుంది. అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్లను నయం చేస్తుంది.
అలాగే నెత్తిమీద పీహెచ్ ను సమతుల్యం చేయడానికి సహాయపడుతుంది. కొన్ని టేబుల్ స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ ను షాంపూలో మిక్స్ చేసి తలస్నానం చేయండి. అలాగే దీన్ని మీరు వాటర్ లేదా ముఖ్యమైన నూనెలతో పాటు మీ జుట్టుకు షాంపూ చేసి తలకు అప్లై చేయొచ్చు.