లెమన్ వాటర్ ఎప్పుడు తాగాలో తెలుసా?
లెమన్ మన ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు. దీనిలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఈ నిమ్మకాయ నీళ్లను తాగడం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరగడంతో పాటుగా బరువు కూడా తగ్గుతారు. ముఖ్యంగా బరువు తగ్గడానికి లెమన్ వాటర్ చాలా మంది తాగుతారు. కానీ దీన్ని ఎప్పుడు తాగాలో తెలుసా?
lemon water
నిమ్మకాయలో విటమిన్ సి తో పాటుగా రకరకాల విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. నిమ్మకాయతో మన రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది. దీంతో మనకు దగ్గు, జలుబు, జ్వరంతో పాటుగా అంటువ్యాధులు, ఇతర రోగాలు వచ్చే అవకాశం చాలా వరకు తగ్గుతుంది. అంతేకాదు చాలా మంది బరువు తగ్గడానికి లెమన్ వాటర్ ను కూడా తాగుతుంటారు. నిజానికి లెమన్ వాటర్ కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. బరువు తగ్గడానికి లెమన్ వాటర్ తాగాలన్న ముచ్చట అందరికీ తెలుసు. కానీ దీన్ని తాగడానికి కరెక్ట్ టైం గురించి మాత్రం చాలా మందికి తెలియదు. లెమన్ వాటర్ ప్రయోజనాలను పొందడానికి దీన్ని ఎలా తాగాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
ఖాళీ కడుపుతో..
నిమ్మకాయ నీళ్లను మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. కానీ ఉదయాన్నే పరిగడుపున తాగితే మాత్రం దీని నుంచి మీరు వీలైనన్ని ఎక్కువ ప్రయోజనాలను పొందుతారు. పరిగడుపున లెమన్ వాటర్ ను తాగితే మీ జీవక్రియ పెరుగుతుంది. దీంతో మీరు చాలా తొందరగా బరువు తగ్గుతారు.
టీ, కాఫీలు తాగొద్దు
మీకు ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నట్టైతే మాత్రం.. ఇకనుంచి ఈ అలవాటును వెంటనే మానుకోండి. టీ, కాఫీలకు బదులుగా పరిగడుపున నిమ్మరసంతో మీ రోజును స్టార్ట్ చేయండి. ఎందుకంటే ఇది మీ శరీరంలోని మురికిని తొలగించి పొట్టను క్లియర్ చేస్తుంది.
ఇలా తాగండి...
బరువు తగ్గడానికి మీరు లెమన్ వాటర్ తాగాలనుకుంటే.. ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లను తీసుకోండి. అందులో సగం నిమ్మకాయ రసం పిండి ఉదయాన్నే పరిగడుపున తాగండి. దీనికి ఒక టీ స్పూన్ తేనెను కలపండి.
జీర్ణశక్తిని పెంచుతుంది
మీరు ప్రతిరోజూ నిమ్మరసాన్ని తాగడం వల్ల జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు తగ్గిపోతాయి. అలాగే మీ శరీరంలోని టాక్సిన్స్ అన్నీ బయటకు వెళ్లిపోతాయి. ఇది మీ జీర్ణశక్తిని పెంచుతుంది.
చర్మంపై మెరుపు..
రోజూ నిమ్మరసాన్ని తాగడం వల్ల మీ చర్మం కాంతివంతంగా తయారవుతుంది. నిజానికి గోరువెచ్చని నీటితో నిమ్మరసాన్ని కలిపి తాగడం వల్ల మీ రక్తం శుభ్రపడుతుంది. దీని వల్ల చర్మంపై దద్దుర్లు, మొటిమలు వంటి సమస్యలు తగ్గిపోతాయి.
శరీరం హైడ్రేట్
మీరు రోజులో ఎప్పుడైనా నిమ్మరసం తాగొచ్చు. ముఖ్యంగా వేసవిలో దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగొచ్చు. నిమ్మకాయ నీళ్లు మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి బాగా సహాయపడతాయి. మీరు కావాలనుకుంటే వేసవిలో సాధారణ నీటిలో కూడా నిమ్మరసాన్ని కలిపి తాగొచ్చు. ఎండాకాలంలో నిమ్మరసం తాగడం వల్ల తరచుగా దాహం అయ్యే అవకాశం ఉండదు.