MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఏం చేస్తే మడమల పగుళ్లు తగ్గుతాయో తెలుసా?

ఏం చేస్తే మడమల పగుళ్లు తగ్గుతాయో తెలుసా?

ఆడవాళ్లు, మగవారికి మడమలు పగళడం చాలా కామన్. కానీ దీనివల్ల మడమలు విపరీతంగా నొప్పి పెడతాయి. అంతేకాకుండా ఈ పగుళ్లు ఎక్కువగా ఉంటే అందులో నుంచి రక్తం కూడా వస్తుంటుంది. మరి దీన్ని ఎలా తగ్గించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

2 Min read
Author : Shivaleela Rajamoni
Published : Aug 19 2025, 02:24 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
 Cracked heels
Image Credit : Getty

Cracked heels

మడమల పగుళ్లు చాలా మందికి ఉండే ఒక కామన్ ప్రాబ్లం. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. ముఖ్యంగా మడమలను సరిగ్గా క్లీన్ చేయకపోవడం, ఎక్కువ సేపు నిలబడటం, సరిపోని షూస్ ను వేసుకోవడంం, ఊబకాయం, డ్రై స్కిన్, పరిశుభ్రత లేకపోవడం, సరైన చర్మ సంరక్షణ లేకపోవడం వల్ల మడమలు పగుళుతుంటాయి. 

ఇది చిన్న సమస్యే అయినా దీనివల్ల చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. అందుకే పాదాలపై కాస్త శ్రద్ధ పెట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. కొన్ని చిట్కాలను పాటిస్తే పగుళ్లు తగ్గిపోయి చాలా స్మూత్ గా మీ పాదాలు అవుతాయి. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.

26
మడమల పగుళ్లను తగ్గించే చిట్కాలు
Image Credit : Getty

మడమల పగుళ్లను తగ్గించే చిట్కాలు

1. పాదాలను కాసేపు నీటిలో నానబెట్టాలి

మడమల పగుళ్లు తగ్గాలంటే ముందుగా మీ పాదాలను నీట్ గా కడిగి 15 నుంచి 20 నిమిషాల పాటు గోరువెచ్చని నీళ్లలో నానబెట్టాలి. దీనివల్ల మీ పాదాల చర్మం మృదువుగా అవుతుంది. దీనివల్ల ఎక్స్ఫోలియేట్ చేయడం ఈజీ అవుతుంది. అయితే ఈ గోరువెచ్చని నీళ్లలో కొంచెం ఎప్సమ్ ఉప్పును కూడా వేయండి. దీనివల్ల డ్రై స్కిన్ నుంచి మీ పాదాలకు కాస్త ఉపశమనం కలుగుతుంది. ఎప్సమ్ ఉప్పు ఎన్నో సమస్యలను తగ్గిస్తుంది.

36
2) ఎక్స్ఫోలియేట్
Image Credit : others

2) ఎక్స్ఫోలియేట్

కొద్దిసేపు పాదాలను నీళ్లలో నానబెట్టడం వల్ల మీ పాదాల చర్మం స్మూత్ గా అవుతుంది. దీంతో ఏ రకమైన చర్మాన్నైనా ఎక్స్ఫోలియేట్ చేయడం ఈజీ అవుతుంది. ఇప్పుడు ప్యూమిస్ స్టోన్ లేదా స్క్రబ్ తో రుద్దండి. దీంతో పాదాలకు ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతుంది. తర్వాత హోం మేడ్ స్క్రబ్ ను యూజ్ చేయండి. కొబ్బరినూనె, పంచదార, తేనె, నిమ్మరసాన్ని మిక్స్ చేసి పగిలిన మడమలపై అప్లై చేయండి. దీన్ని బాగా స్క్రబ్ చేసి శుభ్రమైన నీళ్లతో కడిగేయండి.

46
3) మాయిశ్చరైజ్ చేయండి
Image Credit : our own

3) మాయిశ్చరైజ్ చేయండి

పాదాలను స్క్రబ్ చేసిన తర్వాత మర్చిపోకుండా మాయిశ్చరైజ్ చేయాలి. ఇందుకోసం మీరు మీకు నచ్చిన మాయిశ్చరైజర్ ను ఉపయోగించొచ్చు. లేదా పెట్రోలియం జెల్లీని కూడా మడమలపై రాయొచ్చు. దీనివల్ల తేమ ఎక్కువ సేపు ఉంటుంది.

56
మడమల పగుళ్లను తగ్గించే ఇంటి చిట్కాలు
Image Credit : Getty

మడమల పగుళ్లను తగ్గించే ఇంటి చిట్కాలు

1. స్కిన్ హైడ్రేట్ గా ఉంటే పాదాలు పగలవు. ఇందుకోసం మీకు అరటిపండు బాగా ఉపయోగపడుతుంది. ఈ పండులో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే పోషకాలు పుష్కలంగా ఉంటాయి. 

అరటిపండు పాదాలను తేమగా ఉంచే మంచి మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. ఇందుకోసం బాగా పండిన అరటిపండును మెత్తని పేస్ట్ చేసి పాదాలకు, గోర్లకు బాగా అప్లై చేయండి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత నీళ్లతో కడిగేసుకుంటే సరిపోతుంది.

66
పగిలిన మడమలు
Image Credit : our own

పగిలిన మడమలు

2) నిమ్మకాయతో కూడా పాదాల మడమలను తగ్గించుకోవచ్చు. ఇందుకోసం నిమ్మకాయ, వాసెలిన్ ను కలపాలి. ఈ నిమ్మకాయలోని ఆమ్ల లక్షణాలు, వాసెలిన్ లోని మాయిశ్చరైజింగ్ లక్షణాలు కలిగి డ్రై స్కిన్ తగ్గిస్తాయి.

 అలాగే పగిళిన మడమలు శుభ్రం అవుతాయి. ఇందుకోసం ఒక టీ స్పూన్ వాసెలిన్ లో కొన్ని చుక్కల నిమ్మరసాన్ని వేసి బాగా కలపండి. దీన్ని పాదాలు, మడమలతో పాటుగా ఇతర భాగాలకు బాగా పట్టించండి.

 తర్వాత సాక్సులు వేసుకుని 6 నుంచి 7 గంటల తర్వాత కడిగేస్తే సరిపోతుంది. దీన్ని రాత్రిపూట ప్రయత్నించండి.

About the Author

SR
Shivaleela Rajamoni
శివలీలకు ప్రింట్, డిజిటల్ జర్నలిజం రంగాల్లో 8 సంవత్సరాల అనుభవం ఉంది. నవతెలంగాణ తెలుగు న్యూస్ పేపర్ తో తన కెరీర్ ను ప్రారంభించారు. పలు సంస్థల్లో పని చేసిన విశిష్ట అనుభవంతో పాటు మంచిపేరు సంపాదించారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ ను, నవతెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి డిప్లొమాను పొందారు. 2021వ సంవత్సరం నుంచి ఏషియానెట్ న్యూస్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. లైఫ్ స్టైల్ కేటగిరీ లో భక్తి, ఆరోగ్యం, ఉమెన్, ఫుడ్, పేరెంటింగ్ మొదలైన వాటిపై కథనాలు రాస్తుంటారు.
జీవనశైలి
మహిళలు
Latest Videos
Recommended Stories
Recommended image1
Manthena Hair Care Tip: ఈ సీక్రెట్‍తో వద్దన్నా కూడా జుట్టు పెరిగిపోతుంది
Recommended image2
Crispy Dosa: హోటల్ స్టైల్ లో దోశలు క్రిస్పీగా రావాలా? పిండిలో ఇదొక్కటి కలిపితే చాలు
Recommended image3
Curry Leaves: కరివేపాకు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved