చాలామంది అన్ని పండ్లను తొక్క తీశాకే తినేందుకు ఇష్టపడతారు. కానీ కొన్ని పండ్ల తొక్కలు తీయడం వల్ల వాటిలోని కొన్ని ముఖ్యమైన పోషకాలు పోతాయి.
Image credits: Freepik
Telugu
తొక్క తీయకుండా తినాల్సినవి
కొన్ని పండ్లను తొక్క తీయకుండా తినడం వల్ల శరీరానికి పూర్తి ప్రయోజనాలు అందుతాయి. ఆ పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకోండి.
Image credits: Freepik
Telugu
యాపిల్
యాపిల్ తొక్కలలో ఫైబర్, క్వెర్సెటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండె, మెదడు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తాయి.
Image credits: pexels
Telugu
పియర్
పియర్ పండు తొక్కలో ఫైబర్ అధిక మోతాదులో ఉంటుంది. తొక్కతో పాటు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, అలాగే ఆకలి కూడా తగ్గుతుంది.
Image credits: Getty
Telugu
జామకాయ
జామకాయ తొక్కలో విటమిన్ సి, విటమిన్ ఎ, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, థయామిన్ వంటి అనేక సహజ పోషకాలు ఉంటాయి. ఇవి క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
ప్లమ్
ప్లమ్ పండ్ల తొక్కలు మన శరీరానికి ఫైబర్, యాంటీఆక్సిడెంట్లను అందిస్తాయి. ఇవి జీర్ణవ్యవస్థకు సహాయపడటంతో పాటు శరీరంలో వాపును కూడా తగ్గిస్తాయి.
Image credits: Getty
Telugu
కివీ
కివీ పండ్లను అందరూ తొక్కతేసీ తింటారు. కానీ ఆ తొక్కలోనే ఎన్నో పోషకాలు ఉంటాయి. దీన్ని తొక్క మందంగా ఉంటుంది. అందుకే తినేందుకు ఇష్టపడరు.