MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gold: బంగారం కొనలేకపోతున్నామని ఫీలౌతున్నారా? ఇవి కొనండి..ధర తక్కువ,ప్రాఫిట్ ఎక్కువ..!

Gold: బంగారం కొనలేకపోతున్నామని ఫీలౌతున్నారా? ఇవి కొనండి..ధర తక్కువ,ప్రాఫిట్ ఎక్కువ..!

 Gold: బంగారం ధర భారీగా పెరిగిపోయింది.ఇక.. బంగారం కొనడం అనేది కలగానే మిగిలిపోతుంది అనుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే.. తక్కువ ధరలో కూడా జ్యూవెలరీ కొనుక్కోవచ్చు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Jan 29 2026, 01:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gold
Image Credit : gemini

Gold

బంగారం ధర ఆకాశాన్ని తాకుతోంది.గత మూడేళ్లలో మరీ దారుణంగా పెరిగిపోయింది. బంగారం ధర తగ్గితే కొందాంలే అని ఎదురు చూసి.. చూసీ..అలసిపోయారు.ఈ లోగా తగ్గుతుంది అనుకున్న బంగారం కాస్త.. మరింత పెరిగిపోయింది. పది గ్రాముల బంగారం లక్షన్నర దాటేసింది. తులం లేకుండా.. చిన్న చైన్ కూడా రాదు. ఇక నక్లెస్, హారాలు కొనాలంటే అయ్యే పనే కాదు. మీరు కూడా ఇలానే ఫీలౌతున్నారా? అయితే.. బంగారం ధర పెరుగుతుందనే భయం లేకుండా తక్కువ ధరకే మీరు మీకు నచ్చిన జ్యూవెలరీ కొనుక్కోవచ్చు. అది ఎలాగో తెలుసుకుందాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
18 క్యారెట్, 14 క్యారెట్ బంగారం..
Image Credit : gemini

18 క్యారెట్, 14 క్యారెట్ బంగారం..

బంగారాన్ని క్యారెట్లలో కొలుస్తారనే విషయం అందరికీ తెలిసిందే. దాదాపు అందరూ 22 క్యారెట్ గోల్డ్ తో జ్యూవెలరీ చేయించుకుంటారు. కానీ, ఇప్పుడు ఉన్న ధరకు బంగారం కొనలేం కాబట్టి.. 18 క్యారెట్, 14 క్యారెట్ కొనుగోలు చేయడం మంచిది. 22 క్యారెట్ తో పోలిస్తే.. ఇవి మనకు తక్కువ ధరకే వస్తాయి. గట్టిగా కూడా ఉంటాయి. ఈ మధ్యకాలంలో వీటిలో మోడల్స్ కూడా చాలా ఎక్కువగా వస్తున్నాయి. మనకు నచ్చిన జ్యూవెలరీ చేయించుకోవచ్చు. అంతేకాదు.. వీటికి రీ సేల్ వాల్యూ కూడా ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్తులో బంగారం ధర ఇంకా ఎక్కువ పెరిగితే, మీ జ్యూవెలరీ విలువ కూడా పెరుగుతుంది.

34
సిల్వర్ జ్యూవెలరీ..
Image Credit : gemini

సిల్వర్ జ్యూవెలరీ..

బంగారం కొనలేని వారు ఇప్పుడు హాల్ మార్క్ సిల్వర్ జ్యూవెలరీ ఎంచుకోవచ్చు. వెండి ధర కూడా పెరిగిపోయింది కదా అని మీరు అనుకోవచ్చు. కానీ, బంగారం అంత అయితే కాదు కదా.. కాబట్టి.. బంగారంతో పోలిస్తే.. తక్కువ ధరకే వస్తుంది. వెండి నగలకు 22 క్యారెట్ బంగారుపూత పూసి అమ్ముతారు. చూడటానికి అచ్చం బంగారు నగల్లానే ఉంటాయి. వీటిని కొనడం వల్ల కూడా ఎలాంటి నష్టం ఉండదు. లోపల ఉన్నది వెండి కాబట్టి.. దానికి రీసేల్ వాల్యూ ఉంటుంది.

3. లైట్ వెయిట్ / హాలో జ్యూవెలరీ (Hollow Jewelry)

ప్రస్తుతం జ్యూవెలరీ షాపుల్లో CNC టెక్నాలజీతో చేసిన నగలు వస్తున్నాయి. ఇవి చూడటానికి చాలా పెద్దవిగా, బరువుగా కనిపిస్తాయి (ఉదాహరణకు 5 తులాల హారంలా ఉంటుంది), కానీ లోపల గుల్లగా ఉండటం వల్ల కేవలం 1 లేదా 2 తులాల బరువులోనే వస్తాయి.తక్కువ పెట్టుబడితో గ్రాండ్ లుక్ వస్తుంది.

44
"స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్" స్ట్రాటజీ (బంగారం బిస్కెట్లు + ఇమిటేషన్)
Image Credit : Asianet News

"స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్" స్ట్రాటజీ (బంగారం బిస్కెట్లు + ఇమిటేషన్)

ఇది ప్రస్తుతం చాలా మంది పాలో అవుతున్న బెస్ట్ ఐడియా. మీరు నగలు చేయించుకుంటే మేకింగ్ ఛార్జీలు (తరుగు, మజూరీ) రూపంలో 15-20% డబ్బు పోతుంది.మీకు ఉన్న బడ్జెట్‌తో 24K గోల్డ్ కాయిన్స్ లేదా బిస్కెట్లు కొని దాచుకోండి (వీటికి తరుగు ఉండదు, లాభం ఎక్కువ). ఫంక్షన్లకు వెళ్లినప్పుడు హై-క్వాలిటీ 1-గ్రామ్ గోల్డ్ లేదా వెండి పూత నగలు ధరించండి. మీ పెట్టుబడి బంగారం బిస్కెట్ల రూపంలో భద్రంగా పెరుగుతూ ఉంటుంది, బయటకు వెళ్లినప్పుడు నగలు లేవనే లోటు ఉండదు.

5. డిజిటల్ గోల్డ్ లేదా గోల్డ్ బాండ్స్ (SGB)

మీరు నగలు ఇప్పుడే ధరించాల్సిన అవసరం లేదు, కేవలం పెట్టుబడి మాత్రమే ముఖ్యం అనుకుంటే Sovereign Gold Bonds (SGB) ది బెస్ట్. దీనికి మేకింగ్ ఛార్జీలు ఉండవు, పైగా ప్రభుత్వం ఏటా 2.5% వడ్డీ కూడా ఇస్తుంది. ఎనిమిదేళ్ల తర్వాత అప్పటి బంగారం రేటు ఎంత ఉంటే అంత డబ్బు మీకు వస్తుంది. ఆ డబ్బుతో అప్పుడు మీకు నచ్చిన నగలు కొనుక్కోవచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
బంగారం
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rani Haram: ఒక్క రాణి హారం చాలు.. ఎవరైనా మహారాణిలా మెరిసిపోతారు
Recommended image2
Cumin: ఇంట్లో కుండీలోనే జీలకర్ర ఎలా పెంచాలో తెలుసా?
Recommended image3
Flax Seeds: ప్రతిరోజూ ఒక స్పూన్ అవిసెగింజలు తింటే ఏమౌతుంది?
Related Stories
Recommended image1
Gold Price: భవిష్యత్తులో బంగారం కొనగలమా? బాబా వంగా ఏం చెప్పారో తెలుసా?
Recommended image2
Gold: అస‌లు బంగారం ఎలా పుట్టింది.? ఎందుకంతా విలువైందిగా మారింది.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved