Gold Price: భవిష్యత్తులో బంగారం కొనగలమా? బాబా వంగా ఏం చెప్పారో తెలుసా?
Gold Price: బంగారం ధర రోజు రోజుకీ ఆకాశాన్ని అంటుతోంది. దీంతో, సామాన్యుడు బంగారం కొనడం చాలా కష్టంగా మారింది. ఈ బంగారం ధర పెరగడంపై బాబా వంగా ఏం చెప్పారు?

baba Vanga
బంగారాన్ని ఇష్టపడని వారు ఎవరైనా ఉంటారా? దాని ధర రోజు రోజుకీ పెరుగుతున్నా కూడా దానిపై మోజు మాత్రం తగ్గడం లేదు. కానీ, సామాన్యులకు మాత్రం బంగారం కొనడం రోజు రోజుకీ కష్టంగా మారుతోంది. ఒక గ్రాము బంగారం ధర 16వేల రూపాయలకు చేరడంతో, శుభకార్యాలకు ఆభరణాలు కొనడం చాలా కష్టంగా మారింది. ఇదిలా ఉండగా, బంగారం గురించి బాబా వంగా చెప్పిన అంచనా నిజమైంది. రాబోయే రోజుల్లో దీని ధర మరింత ప్రియం కానుంది. ఇప్పుడు బంగారం ధర తగ్గుతుందా లేదా అనేది కేంద్ర బడ్జెట్ నిర్ణయిస్తుంది. అయితే, బంగారం భవిష్యత్తు గురించి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేరే కథ చెబుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
బంగారంపై బాబా వంగా భవిష్యవాణి.. 2026లో జరగబోయేది ఇదే..
బల్గేరియాకు చెందిన ప్రవక్త బాబా వంగా దశబ్దాల క్రితమే 2026 గురించి అనేక అంచనాలు ఇప్పుడు ఆర్థిక వేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ‘ 2026లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోతుంది. ఈ సమయంలో ప్రజలు కరెన్సీ కంటే బంగారం పైనే ఎక్కువ నమ్మకం ఉంచుతారు.’ అని ఆమె చెప్పారు. ఆమె చెప్పినట్లుగానే, ఇప్పుడు ప్రపంచ పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల కంటే సురక్షితమైన బంగారం వైపు మళ్లుతున్నారు. అమెరికా పన్ను విధానాల్లో మార్పులు, ప్రపంచ వ్యాప్తంగా రాజకీయ అస్థిరత దీనికి ప్రధాన కారణాలుగా మారుతున్నాయి.
బంగారం vs వెండి .. ప్రత్యామ్నాయం ఉందా?
బంగారం విపరీతంగా పెరిగిపోతుండటంతో.. చాలా మంది వెండి వైపు చూస్తున్నారు. వెండితో ఆభరణాలు కూడా తీసుకువచ్చారు. దీంతో.. వెండి ధర కూడా భయంకరంగా పెరిగిపోయింది. వెండి ధర కూడా బంగారానికి కూడా గట్టి పోటీ ఇస్తోంది. గతంలో సామాన్యుడికి అందుబాటులో ఉండే వెండి, ఇప్పుడు పెట్టుబడిదారుల ఆకర్షణీయమైన వస్తువుగా మారిపోయింది. ఇండస్ట్రీయల్ డిమాండ్ పెరగడం, బంగారం ధరలు అందని స్థాయికి చేరడం వల్ల వెండికి కూడా రెక్కలు వచ్చాయి.
బడ్జెట్ తర్వాత బంగారం ధర తగ్గుతుందా?
రాబోయే కేంద్ర బడ్జెట్ మీద సామాన్యులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ప్రభుత్వం దిగుమతి సుంకం తగ్గిస్తుందని చాలా మంది ఆశపడుతున్నారు. దీని వల్ల ధరలు తగ్గుతాయని ప్రజల ఆశ. కానీ.. ఇది కనుక తగ్గించకపోతే.. తులం బంగారం కొనడం కూడా కష్టమే..

