Beauty Tips: చుండ్రుతో బాధపడుతున్నారా.. అయితే గ్లిజరిన్ మంచి ఔషధం, వాడి చూడండి!
Beauty Tips: ఈ రోజులలో కాలుష్యం వల్ల జుట్టు రాలిపోవడం, తలలో చుండ్రు అనేది దాదాపు ప్రతి ఒక్కరూ అనుభవిస్తున్న సమస్య. అయితే దీనికి గ్లిజరిన్ మంచి ఔషధం అంటున్నారు నిపుణులు. అదెలాగో చూద్దాం.
గ్లిజరిన్ అనేది కూరగాయల నూనె లేదా జంతువుల కొవ్వు నుంచి సేకరించిన సహజ ద్రవం. ఇది స్పష్టంగా, వాసన లేనిది మరియు దట్టమైన అనుగుణ్యతను కలిగి ఉంటుంది. ఇది చుండ్రుని వదిలించడానికి సహజమైన ఔషధం లాగా పనిచేస్తుంది. అసలు చుండ్రు ఎందుకు వస్తుందో ఇప్పుడు చూద్దాం.
చుండ్రు మలాసెజియా గ్లోబోసా అనే సహజ సిద్ధమైన ఫంగస్ వల్ల వస్తుంది. ఈ ఫంగస్ వాతావరణ హెచ్చుతగుల వల్ల లేదంటే తలపై నూనె ఎక్కువగా నిల్వ ఉండటం వల్ల వస్తుంది. ఈ చుండ్రు వలన తల విపరీతమైన దురదకి గురి అవుతుంది. అలాగే జుట్టు రాలడానికి కూడా ప్రధాన కారణం చుండ్రు.
అలాంటి చుండ్రుకి గ్లిజరిన్ తో ఎలా చెక్ పెట్టాలో చూద్దాం.చుండ్రు తగ్గటానికి గ్లిజరిన్ మరియు గుడ్డు హెయిర్ మాస్క్ పెట్టడం మంచి రెమెడీ. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఒక టేబుల్ స్పూన్ తేనే మరియు ఒక టేబుల్ స్పూన్ గ్లిజరిన్ అలాగే ఒక గుడ్డు తీసుకొని బాగా కలపండి.
దానిని హెయిర్ బ్రష్ తో సమానంగా జుట్టుపై అప్లై చేయండి. 30 నిమిషాల తర్వాత షాంపూ మరియు కండీషనర్ తో మీ జుత్తుని బాగా కడగండి. అలాగే తేనె మరియు గ్లిజరిన్ సమానంగా తీసుకుని తలకు పట్టించండి. 30 నిమిషాల తర్వాత చల్లని నీటితో స్నానం చేయండి ఇది మీకు మృదువైన జుట్టుని ఇస్తుంది.
అలాగే ఆముదము మరియు గ్లిజరిన్ యొక్క మిశ్రమంతో పెట్టుకునే హెయిర్ మాస్క్ కూడా మీ జుట్టు ని మృదువుగా మరియు తేమగా ఉంచుతుంది. ఇందుకోసం గ్లిజరిన్ అలాగే ఆముదము చెరో ఐదు టేబుల్ స్పూన్లు తీసుకొని బాగా కలపాలి. జుట్టు మొత్తం దీన్ని అప్లై చేయాలి.
20 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో జుట్టుని కడగాలి. ఇలా తరచుగా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గడమే కాదు జుట్టు కూడా పెరగడాన్ని మీరు గమనించవచ్చు. అలాగే గ్లిజరిన్ ఆధారిత స్ప్రే రోజూ ఉపయోగించటం వల్ల జుట్టు చివర్లు చీలిపోవటాన్ని నివారించవచ్చు.