Diabetes: రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే.. దంతాలపై ఎఫెక్ట్ పడుతుంది జాగ్రత్త..
Diabetes: ఒక వ్యక్తికి డయాబెటీస్ ఉన్నట్టేతే ఆ వ్యక్తి శరీరంలోని చాలా భాగాలు నెమ్మదిగా దెబ్బతింటూ ఉంటాయి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల దంతాలు కూడా దెబ్బతింటాయన్న సంగతి మీకు తెలుసా?

ఈ రోజుల్లో మధుమేహం (Diabetes) ఒక సాధారణ వ్యాధిగా మారిపోయింది. ముఖ్యంగా భారత దేశంలో చాలా మంది ప్రజలు దీనికి బాధితులుగా మారుతున్నారు. డయాబెటీస్ పేషెంట్లు తమ ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. అప్పుడే వారి ఆరోగ్యం సేఫ్ గా ఉంటుంది.
డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో తరచుగా చక్కెర స్థాయిలు (Sugar levels) పెరుగుతూ ఉంటాయి. ఇది వారి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. దీనివల్ల వారు ఎన్నో అనారోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగితే దంతాలపై (teeth)ఎఫెక్ట్ పడుతుంది.. మధుమేహం ఎన్నో వ్యాధులకు దారితీస్తుందని పలు అధ్యయనాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. గుండె జబ్బులు (Heart disease), మూత్రపిండాల వ్యాధి (Kidney disease)లతో సహా ఇది ఎన్నో ప్రమాదకరమైన వ్యాధులను పుట్టించగలదు. అయితే రక్తంలో షుగర్ లెవెల్స్ పెరగడం వల్ల మీ దంతాలు కూడా పాడవుతాయి. మరి దీనిని ఎలా నివారించాలో తెలుసుకుందాం.
డయాబెటీస్ దంతాలను ఎలా ప్రభావితం చేస్తుంది..
దంతాలు క్షీణించడం (Cavities).. నోటిలోకి బ్యాక్టీరియా ప్రవేశించడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి. కానీ అవి రక్తంతో సంబంధం కలిగి ఉంటే.. అవి దంతాల చుట్టూ ఒక పొరను ఏర్పరుస్తాయి. దీనిని ఫలకం (Panel) అంటారు. ఈ ఫలకంలో ఒక ప్రత్యేక రకమైన ఆమ్లం ఉంటుంది. ఇది మీ దంతాలను కుళ్లిపోయేలా చేస్తుంది. రక్తంలో షుగర్ లెవెల్స్ వేగంగా పెరిగినప్పుడు కావిటీస్ సమస్య ఏర్పడుతుందని నిపుణులు చెబుతున్నారు.
చిగుళ్ల వ్యాధి (Gum disease): డయాబెటీస్ మీ రోగనిరోధక శక్తి (Immunity) ని కూడా ప్రభావితం చేస్తుంది. డయాబెటీస్ వల్ల మీ రోగనిరోధక వ్యవస్థ చాలా బలహీనంగా తయారువుతుంది. దీంతో మీకు ఇతర వ్యాధులు సులువుగా సోకే అవకాశం కూడా ఉంది. బలహీనమైన రోగనిరోధక శక్తి కారణంగా చిగుళ్ల వ్యాధి కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితి చిగుళ్లు కుళ్లిపోవడం ప్రారంభిస్తాయి.
దంత సమస్యలు రాకూడదంటే.. డయాబెటీస్ పేషెంట్లు తమ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండా దానిని తనిఖీ చేయాలి.
ప్రతిరోజూ ఉదయం లేచిన తర్వాత, రాత్రి పడుకునే ముందు ఖచ్చితంగా బ్రష్ చేసుకోవాలి. లేదంటూ పై సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
రెండు దంతాల మధ్య ఏదైనా ఆహారం ఇరుక్కున్నట్టైతే దానిని తొలగించడానికి దంత ఫ్లోస్ (Dental floss)ను మాత్రమే ఉపయోగించండి.
సిగరెట్లు (Cigarettes), మద్యపానం (Alcohol), శీతల పానీయాలు (Soft drinks) వంటివి మీ దంతాలను దెబ్బతీస్తాయి. అందుకే వీటికి వీలైనంత దూరంగా ఉండండి.
రెగ్యులర్ గా దంతవైద్యలను (Dentists) కలవండి. మీ దంతాలను టెస్ట్ చేయించుకోండి. అవసరమైనప్పుడు స్కేలింగ్ (Scaling) కూడా చేయించుకోండి.