ప్రెగ్నెన్సీ టైంలో ఒత్తిడి, డిప్రెషన్.. పుట్టబోయే పిల్లలకెంత డేంజరో తెలుసా?
ప్రెగ్నెన్సీ సమయంలో ఆడవాళ్లు ఎంత ప్రశాంతంగా ఉంటే అంత మంచిది. లేదంటే పుట్టబోయే బిడ్డపై చెడు ప్రభావం పడుతుంది. పెరిగిన ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ కారణంగా పిల్లలు ముందుగానే పుట్టే అవకాశం ఉంది. అలాగే..
మన మెదడును ప్రభావితం చేసే పరిస్థితే డిప్రెషన్. ఈ రోజుల్లో డిప్రెషన్, ఒత్తిడి, ఆందోళనలు చాలా మందిని ఇబ్బందిపెడుతున్నాయి. ఇవి ఒక వ్యక్తిని మానసికంగానే కాదు.. శరీరకంగా కూడా క్రుంగదీస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి ఆహారం, నిద్ర, వ్యక్తిత్వం, లైంగిక జీవితాన్ని ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. దీంతో డిప్రెషన్ ఒక వ్యాధిగా మారుతుంది. లవ్ ఫెయిల్యూర్, అనారోగ్యం, ఉద్యోగం పోవడం, ఆర్థిక ఇబ్బందులు వంటివి ఒత్తిడికి, డిప్రెషన్ కు కారణాలు.
డిప్రెషన్ మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. 6 శాతం కంటే ఎక్కువ మంది మహిళలు తమ జీవితంలో ఒక్కసారైనా డిప్రెషన్ బారిన పడుతున్నారట. ప్రతి 10 మంది గర్భిణీ స్త్రీలలో ఒకరు డిప్రెషన్ తో బాధపడుతున్నారు. గర్భధారణ సమయంలో హార్మోన్లలో హెచ్చుతగ్గులు ఉంటాయి. ఈ మార్పు మెదడులోని రసాయనాలలో మార్పులకు కారణమవుతుంది. దీనివల్ల గర్భిణీ స్త్రీలు నిరాశకు గురయ్యే ప్రమాదం ఉంది. కాగా చాలా మహిళలకు వాళ్లు నిరాశకు గురవుతున్నారో? లేదో? కూడా తెలియదు. వీటిని గర్భధారణతో వచ్చేవిగా భావిస్తారు. డిప్రెషన్ లో లక్షణాలు ఒక్కొక్కరికీ ఒక్కోవిధంగా ఉండొచ్చు.
pregnancy
డిప్రెషన్ అత్యంత సాధారణ లక్షణాలు
ఆకలి: మొదటి ముఖ్యమైన లక్షణమేంటంటే.. మీరు ఎక్కువగా లేదా చాలా తక్కువగా తింటారు.
నిద్రలేమి: సాధారణంగా డిప్రెషన్ తో బాధపడేవారు నిద్రలేమి సమస్యతో బాధపడుతుంటారు. వీళ్లకు నిద్రరాకపోవడమో.. లేకపోతే ఎక్కువగా నిద్రపోవడమో చేస్తుంటారు.
శక్తి లేకపోవడం: మీలో మానసిక, శారీరక శక్తి లేనట్టుగా భావిస్తారు. దీనివల్ల చిన్న చిన్న పనుల తర్వాత తరచుగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది.
ఆసక్తి లేకపోవడం: ఏ పనులను చేయాలన్నా ఇంట్రెస్ట్ ఉండదు.
డిప్రెషన్, ఒత్తిడి పుట్టబోయే బిడ్డపై ఏవిధంగా ప్రభావం చూపుతాయి?
1. డెలివరీ సమయం కంటే ముందే పిల్లలు పుట్టే అవకాశం ఉంది.
2. మీ బిడ్డ బరువు తగ్గుతుంది
3. ప్రెగ్నెన్సీ సమయంలో డిప్రెషన్ కు గురైతే మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది.
4. ఇది మీ బిడ్డ ఎదుగుదల సరిగ్గా ఉండదు.
5. గర్భస్రావానికి కారణమవుతుంది.
గర్భధారణ సమయంలో తల్లి యాంటిడిప్రెసెంట్స్ తీసుకున్నట్టైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వణుకు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఏదేమైనా ఈ లక్షణాలు కొన్ని వారాల్లోనే తగ్గిపోతాయి. కానీ కొన్ని సందర్భాల్లో గుండె సమస్యలు, తీవ్రమైన శ్వాస సమస్యలు వంటి తీవ్రమైన రోగాలకు దారితీస్తుంది.