చూయింగ్ గమ్ ను నమిలే అలవాటుందా.. అయితే ఈ విషయాలను తెలుసుకోవాల్సిందే..!
మనం తినేది ఏదైనా సరే.. దాని వల్ల లాభాలుంటాయి.. నష్టాలుంటాయి. దేనినైనా సరే అతిగా తినడం సేఫ్ కాదు. అయితే కొంతమంది ఎప్పుడు చూసినా చూయింగ్ గమ్ ను లను నములుతూ ఉంటాయి. ఎప్పుడూ కాకుండా.. కొన్ని సమయాల్లో దీన్ని నమిలితే కొన్ని లాభాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

యువతే చూయింగ్ గమ్ లను ఎక్కువగా నములుతుంటారు. అయితే ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదని చాలా మంది చెప్తుంటారు. అయితే దీన్ని పూర్తిగా ఆరోగ్యానికి మంచిది కాదని చెప్పలేం. ఎందుకంటే దీన్ని వల్ల కూడా కొన్ని ప్రయోజనాలున్నాయి కాబట్టి. చూయింగ్ గమ్స్ లో స్వీటెనర్లు, ప్రిజర్వేటివ్ లు, చిగుళ్లకు, మీ ఆరోగ్యానికి హాని కలిగించే ఎన్నో పదార్థాలుంటాయి. అందుకే వీటిని తినకూడదని చెప్తుంటారు. అయితే ఈ చూయింగ్ గమ్ కూడా కొన్ని సానుకూల ప్రభావాలను కలిగి ఉంటుంది. దీన్ని నమలడం వల్ల ఒత్తిడి, ఆందోళన,చెడు శ్వాస వంటి ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది. చూయింగ్ గమ్ వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం పదండి..
ఒత్తిడి, ఆందోళన నుంచి ఉపశమనం: ఆందోళన, ఒత్తిడి, డిప్రెషన్ లేని వాళ్లు ఈ కాలంలో ఎక్కడ వెతికినా కనిపించరేమో.. అయితే కొంతమంది ఒత్తిడి , ఆందోళనను తగ్గించుకోవడానికి గోర్లను కొరుకుతారు. ఇంకొంతమంది శ్వాసను లోతుగా తీసుకుంటారు. అయితే చూయింగ్ గమ్ నమిలితే కూడా ఒత్తిడిని కలిగించే హార్మోన్ తగ్గిపోతుంది.
చూయింగ్ గమ్ యాసిడ్ రిఫ్లక్స్ కు సహాయపడుతుంది: ఎక్కువసేపు ఏమీ తిననప్పుడు మీ కడుపు ఆమ్లాలను విడుదల చేస్తుంది. ఇది మండుతున్న అనుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి సమయంలో మీరు చూయింగ్ గమ్ ను నమిలితే.. లాలాజలం ఎక్కువ విడుదల అవుతుంది. ఇది ఆమ్లాన్ని తగ్గిస్తుంది. మంటను కూడా తగ్గిస్తుంది.
చెడు శ్వాస నుంచి ఉపశమనం: చెడు శ్వాసతో ఇబ్బంది పడేవారికి చూయింగ్ గమ్ బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే చూయింగ్ గమ్ లో ఎన్నో రకాల రుచులు ఉంటాయి. ఇవి చెడు శ్వాసను తగ్గించడానికి సహాయపడతాయి.
ఏకాగ్రతతో ఉండటానికి సహాయపడుతుంది: చూయింగ్ గమ్ కూడా మీ ఏకాగ్రతను పెంచుతుంది. చూయింగ్ గమ్ ను నమిలితే మీరు చేసే పనిపై మరింత మెరుగ్గా దృష్టి సారిస్తారు. గందరగోళం అసలే ఉండదు.
చూయింగ్ గమ్ దుష్ప్రభావాలు
కొంతమంది మూడ్ స్వింగ్ లేదా ఒత్తిడిని తగ్గించుకోవడానికి చూయింగ్ గమ్ ను అదేపనిగా నములుతుంటారు. అయితే దీనివల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒక పరిశోధన ప్రకారం.. చూయింగ్ గమ్ తినడం వల్ల చెడు వాసనను తగ్గడానికి బదులుగా క్రమంగా పెరుగుతుందట. దీన్ని నములున్నప్పుడు చెడు వాసన తగ్గినట్టు కనిపించినప్పటికీ.. నోట్లోని బ్యాక్టీరియా పెరిగి దంతాలపై ప్రభావం పడుతుంది. దీంతో దంతాలు చెడిపోయే అవకాశం ఉంది.
ముఖ కండరాలకు చూయింగ్ గమ్ మంచి వ్యాయామం అని కొంతమంది నమ్ముతారు. కానీ ఏది అతిగా తిన్నా.. చివరికి విషంలా మారుతుంది. అలాగే దీన్ని అతిగా నమిలితే దవడ నొప్పి వస్తుంది. దీనిలో ఉపయోగించే కృత్రిమ స్వీటెనర్లు మెదడు కణితులు, క్యాన్సర్ కు కూడా కారణమవుతాయి. దీని నములుతుంటే వచ్చే రసం కడుపులోకి వెళ్లి అజీర్థిని కలిగిస్తుంది. ఇది మీ శరీర బరువును కూడా పెంచుతుంది. అంతేకాదు ఇది మీ పొట్టను బిగుతుగా చేస్తుంది. దీంతో మలబద్దకం సమస్య వస్తుంది. అందుకే చూయింగ్ గమ్ లను ఎక్కువగా నమలకండి.