మీకున్నది టైప్ 1 లేకా టైప్ 2 డయాబెటీసా.. గుర్తించండిలా..!
డయాబెటిస్ లో రెండు రకాలు ఉంటాయి. టైప్-1 డయాబెటిస్ మరియు టైప్-2 డయాబెటిస్. వాస్తవం ఏమిటంటే చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు.

ఈ రోజుల్లో మధుమేహం సాధారణంగా సోకే వ్యాధుల జాబితాలో చేరిపోయింది. కానీ ఈ వ్యాధి కొన్ని కొన్ని సార్లు ప్రాణాల మీదికి వస్తుంది. దీనిని వీలైనంత తొందరగా తగ్గించుకోవడమే మంచిది.
మధుమేహం రెండు రకాలు. టైప్ 1, టైప్ 2. కానీ చాలా మందికి ఈ రెండింటి మధ్య తేడా తెలియదు. ఇంతకు ఈ రెండు డయాబెటీస్ మధ్య ఎలాంటి తేడా ఉంటుందో తెలుసుకుందాం పదండి.
టైప్ 1 డయాబెటిస్ మరియు టైప్ 2 డయాబెటిస్ మధ్య వ్యత్యాసం.. సాధారణంగా ఈ రెండు డయాబెటీస్ లు ఒకేలా ఉంటాయి. ఇకపోతే డయాబెటీస్ ఉన్నవారిలో ఏ సందర్భంలో నైనా శరీరం గ్లూకోజ్ ను సరిగ్గా నిల్వ చేయలేకపోవడంతో పాటుగా.. దాన్నిఉపయోగించుకోలేకపోతుంది. మనం శక్తిని పొందడానికి గ్లూకోజ్ నిల్వ చాలా అవసరం. అలాగే దాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలి కూడా. కానీ డయాబెటిస్ పేషెంట్లలో ఇది జరగదు. అలాగే అవసరమైన సమయంలో గ్లూకోజ్ కణాలకు చేరదు. బదులుగా ఈ గ్లూకోజ్ రక్తాన్ని చేరుతుంది. ఈ విధంగా డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి పెరుగుతుంది.
టైప్ 1 డయాబెటీస్.. గ్లూకోజ్ కణాలను చేరాలంటే ఇన్సులిన్ చాలా అవసరం. కానీ టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ల శరీరంలో అసలు ఇన్సులినే ఉత్పత్తి కాదు. ఈ టైప్ 1 డయాబెటీస్ ఆటో ఇమ్యూన్, జన్యుపరంగా, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వస్తుంది. కాగా ఇది వస్తే చిన్న వయసులోనే బీటా కణాలు నశిస్తాయి. ఈ డయాబెటీస్ ముఖ్యంగా 12 నుంచి 25 ఏండ్లున్న వారికే ఎక్కువగా వస్తుంది. అలాగే ఇది వృద్ధులను కూడా ప్రభావితం చేస్తుంది.
టైప్ 2 డయాబెటీస్.. ఇకపోతే టైప్ 2 డయాబెటీస్ పేషెంట్లలో ఇన్సులిన్ ఉపయోగించలేని పరిస్థితి కలుగుతుంది. అంటే వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయన్న మాట. దీనిని కంట్రోల్ లో ఉంచడం కష్టమైన పని. ఈ రకమైన డయాబెటీస్ పేషెంట్లలో తరచుగా ఆకలి, మూత్రవిసర్జన, దాహం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ రకమైన డయాబెటీస్ ఎక్కువగా పిల్లల్లోనే కనిపిస్తుంది. అంటే 15 ఏండ్ల కంటే తక్కువగా ఉండే పిల్లలకే ఇది వస్తుంది. మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ఇది అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే ఎక్కువగా కనిపిస్తుంది.
టైప్ 1 డయాబెటీస్ లక్షణాలు.. టైప్ 1 డయాబెటీస్ పేషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ బాగా పెరగడంతో.. వీరు తరచుగా మూత్ర విసర్జన చేస్తుంటారు. తరచుగా మూత్రవిసర్జన, అధిక దాహం, అధిక ఆకలి, భరించలేని అలసట, దృష్టి మసకబారడం, మరియు గాయాలు లేదా గాయాలు సంభవించినప్పుడు తేలికగా నయం కాకపోవడం అనేవి రెండు రకాల మధుమేహంలో సమానంగా కనిపించే లక్షణాలు. అసౌకర్యం, మూడ్ స్వింగ్స్, బరువు తగ్గడం, తిమ్మిరి మరియు అవయవాలలో వణుకు వంటి లక్షణాలు కూడా ఉండవచ్చు.
టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు.. టైప్ 2 డయాబెటీస్ లక్షణాలు అంత తొందరగా బయటపడవు. ఇకపోతే వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ పెరిగి.. బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తారు. అంతేకాదు కంటి చూపు కూడా తగ్గుతుంది. అంతా మసక మసకగా కనిపిస్తుంది. తీవ్రమైన తలనొప్పి వంటి సమస్యలు కూడా కలుగుతాయి. అంతేకాదు వీరు కూడా తరచుగా మూత్రవిసర్జన చేయడం వల్ల దాహం ఎక్కువగా అవుతుంది. అలాగే ఈ పేంషెంట్ల రక్తంలో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల కంటిచూపు మందగించే అవకాశం కూడా ఉంటుంది. అయితే ఈ లక్షణాలు కూడా ఈ రోగం ముదిరి అనారోగ్యం పాలైనప్పుడు మాత్రమే కనిపిస్తాయి.