Health Tips: పిసీఓడీ సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. ఈ ఆహారంతో చెక్ పెట్టండి!
Health Tips: నేటి తరంలో 40 శాతం మంది మహిళలు పీసీఓడీ, పీసిఓఎస్ సమస్యలతో బాధపడుతున్నారు. చక్కని ఆహారంతో ఆ సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు అది ఎలాగో చూద్దాం రండి.

నేటి తరం మహిళలను ఎక్కువగా వేధించే సమస్య పీసీఓడీ, పీసీ ఓఎస్. అసలు ఈ పీసీఓడీ పీసీఓఎస్ అనేది వినటమే కానీ అది ఎలాంటి పరిస్థితి అనేది చాలామందికి అర్థం కాదు. పరిష్కారం వెతికే ముందు అసలు సమస్య ఏమిటో చూద్దాం రండి. పీసీఓడీ లేదా పి సి ఓ ఎస్ అనేది ఒక వైద్య పరిస్థితి.
దీనిలో స్త్రీ అండాశయాలు పెద్ద సంఖ్యలో అండాశయాలు లేదా పాక్షికంగా పరిపక్వ గుడ్లను ఉత్పత్తి చేస్తాయి. కాలక్రమమైన ఇవి అండాశయాలలో అతిథులుగా మారుతాయి. మరియు పెద్ద మొత్తంలో మగ హార్మోన్ లు స్రవిస్తాయి.
తద్వారా క్రమరహిత ఋతుచక్రం జుత్తు రాలడం మరియు అసాధారణ బరువు పెరగటం జరుగుతుంది.ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవటం స్త్రీలకి కష్టతరమే కానీ మంచి ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యని అదుపులో ఉంచుకోవచ్చు ఇందులో ముఖ్యమైనది బాదం.
బాదం లో ఉండే మెనోసాచ్యురేటెడ్ ఫ్యాట్ స్త్రీలలో హార్మోన్ల అసమతుల్యతను పూర్తిగా తొలగించడంలో సహాయపడుతుంది. అలాగే వాల్నట్ కూడా మంచి ఆహారం ఎందుకంటే ఇది మహిళల్లో పురుష హార్మోన్ అయినా టెస్టు స్టెరాన్ స్థాయిని నియంత్రించడంలోనూ మరియు తగ్గించడంలోనూ సహాయపడుతుంది.
వాల్నట్ ను నేరుగా తినకుండా రాత్రంతా నానబెట్టి ప్రొద్దున తినటం మంచిది. ఇలా చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా ఉండటంతో పాటు రుతుక్రమ సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. ఇంకా గుమ్మడి విత్తనాలు కూడా మంచి బలవర్ధకమైన ఆహారం.గుమ్మడి విత్తనాల్లో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ టెస్టోస్టెరాన్ అనే పురుష హార్మోన్ ను డిహెచ్డీగా మార్చడాన్ని అడ్డుకుంటుంది.
అలాగే అవిసె గింజలను కూడా మనం నిత్యం ఆహారంలో వాడటం వల్ల పీసీఓడీ లక్షణాలను తగ్గించి టెస్టోస్టెరాన్ హార్మోన్ స్థాయిలని తగ్గిస్తుంది. అలాగే తులసి కర్పూరం కలిపిన టీ రోజుకి రెండు కప్పులు తాగితే పీరియడ్ సమస్యలను నివారిస్తుంది. కాబట్టి మంచి ఆహారం ద్వారా ఈ సమస్యని అదుపులో ఉంచుకొని ఆరోగ్యంగా ఉండండి.