Recipes: ఇండో చైనీస్ ఫ్యూజన్ రెసిపీ.. అద్భుతమైన హనీ చిల్లీ పొటాటో!
Recipes: రెస్టారెంట్ లో ఎక్కువగా తినటానికి ఇష్టపడే ఈ ఇండో చైనీస్ రెసిపీ హనీ చిల్లీ పొటాటో. తీయతీయగా కారంకారంగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం.
ఈ రెసిపీని తయారు చేయడానికి కావలసిన పదార్థాలు బంగాళదుంపలు 2, ఉప్పు ఒక స్పూన్, రెండు టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండి, 1/2 టీ స్పూన్ మిరియాలపొడి, నూనె వేయించడానికి సరిపడా, లవంగం1, వెల్లుల్లి 2 రెబ్బలు,
ఒక అంగుళం అల్లం సన్నగా తరిగినది, 2 పచ్చిమిర్చి సన్నగా చీలుకొని పెట్టుకోవాలి. స్ప్రింగ్ ఆనియన్ 4 టేబుల్ స్పూన్లు, ఒక ఉల్లిపాయ సన్నగా తరిగినది, ఒక క్యాప్సికం క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి.ఒక స్పూన్ చిల్లీ సాస్,ఒక టేబుల్ స్పూన్ వెనిగర్ రెండు టేబుల్ స్పూన్లు తేనె.
ఒక టేబుల్ స్పూన్ నువ్వులు. ఇప్పుడు దీనిని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా ఒక పెద్ద కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేడి చేసి లవంగం, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, స్ప్రింగ్ ఆనియన్ వేసి వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ తరుగు క్యాప్సికం క్యూబ్స్ వేసి వేయించాలి, ఆ తర్వాత చిల్లీ సాస్, సోయాసాస్, వెనిగర్ వేసి బాగా కలిపి ఆపై ఉప్పుని జోడించండి. 30 సెకండ్ల పాటు అధికమంట మీద వేయించండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ మొక్కజొన్న పిండిని పావు కప్పు నీటిలో ముద్దలు లేకుండా కలపండి.
మొక్కజొన్న పిండి మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయల మిశ్రమంలో పోయాలి. కొంచెం దగ్గరగా అయిన తరువాత మంటని ఆపివేసి రెండు టేబుల్ స్పూన్ల తేనె వేసి బాగా కలపాలి. ఇంకా అందులో వేయించిన బంగాళదుంప వేసి మెత్తగా కలపాలి.
రెండు టేబుల్ స్పూన్ల స్ప్రింగ్ ఆనియన్ మరియు వేయించిన నువ్వులు కూడా అందులో కలపండి. ఇంకేముంది హనీ చిల్లీ పొటాటో రెడీ. ఇది స్టార్టర్స్ లాగా బాగుంటుంది, ఫ్రైడ్ రైస్ లోకి సైడ్ డిష్ లాగా కూడా చాలా బాగుంటుంది.