- Home
- Life
- Kidney stones: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రాళ్లు తొందరగా కరిగిపోతాయి..
Kidney stones: కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారా? ఇలా చేస్తే రాళ్లు తొందరగా కరిగిపోతాయి..
Kidney stones: మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడితే విపరీతమైన నొప్పి పుడుతుంది. ఎన్ని ట్యాబ్లెట్లను వేసుకున్నా.. ఈ రాళ్లు మాత్రం కరిగిపోవు. నొప్పి కూడా పోదు. అయితే కొన్ని ఇంటి చిట్కాలతో ఈ రాళ్లను సులువుగా కరిగించొచ్చు.

శరీరం సక్రమంగా పనిచేయడానికి కావాల్సిన ముఖ్యమైన భాగాల్లో మూత్రపిండాలు (Kidneys)ఒకటి. మూత్రపిండాలు వ్యర్థాలను, కలుషితాలను మన శరీరం నుంచి బయటకు పంపించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి రక్తాన్ని ఫిల్టర్ చేసి వర్థాలుంటే వెంటనే బయటకు పంపిస్తాయి. అలాంటి మూత్రపిండాలు ఎంతో ఆరోగ్యంగా ఉండాలి.
కానీ ప్రస్తుతం చాలా మంది మూత్రపిండాల సమస్యలతో సతమతమవుతున్నారు. ముఖ్యంగా చాలా మంది కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధడుతున్నారు. ఆడవారిలో ఈ సమస్య ఉండి.. రాళ్లు 5 మిమీ కంటే ఎక్కువగా ఉంటే గర్భాశయానికి అడ్డంకి ఏర్పడుతుంది. అంతేకాదు పొత్తికడుపు దిగువ భాగంలో విపరీతంగా నొప్పి పుడుతుంది. ఈ సమస్యకు ఎంత చికిత్స తీసుకున్నా తగ్గదు. అయితే కొన్ని సింపుల్ టిప్స్ తో కిడ్నీలో రాళ్లను సులువుగా కరిగించొచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
నిమ్మరసం (lemon juice)
సిట్రస్ పండు అయిన నిమ్మలో విటమిన్ సి ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఈ పండులో సహజంగా మూత్రపిండాల్లోని రాళ్లను కరిగించే పదార్థాలు ఉంటాయి. ప్రతి రోజూ రెండు లీటర్ల నీటిలో నాలుగు ఔన్సుల నిమ్మరసం కలుపుకుని తాగితే మంచి ఫలితం ఉంటుంది.
నీళ్లు (water)
ఒకరకంగా నీళ్లను సర్వరోగ నివారిణీగా చెప్పొచ్చు. మన శరీరంలో నీళ్లే ఎక్కువ భాగం ఉంటాయి. నీళ్లతోనే మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. నీళ్ల శాతం తగ్గితేనే ఎన్నో సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాలెయం నుంచి మెదడుతో సహ మన బాడీలోని ప్రతి అవయం పనితీరు బాగుండాలంటే నీరు వీలైనంత ఎక్కువగా తాగాలి. మూత్రపిండాలు మూత్రాన్ని తయారుచేయడానికి కూడా నీళ్లు ఉండాలి. మూత్రం ద్వారానే శరీరంలో ఉండే విషపదార్థాలు, వ్యర్థాలు బయటకు వస్తాయి. నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు సైతం కరగడం మొదలవుతాయి.
దానిమ్మ రసం (Pomegranate juice)
దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఇతర ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఇవి మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. అలాగే మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను సైతం కరిగించేందుకు సహాయపడుతుంది. ఇది కిడ్నీల్లో రాళ్లకు కారణమయ్యే ఆమ్లత్వ స్థాయిని కూడా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ పండును డయేరియా, అల్సర్ వంటి ఎన్నో వ్యాధులను నయం చేయడానికి వాడుతారు.
గ్రీన్ టీ (Green tea)
గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా గ్రీన్ టీ తాగడం వల్ల మూత్రపిండాల్లోని రాళ్లు స్పటికీకరణం చెందవు. అలాగే చిన్న సైజులో ఉండే స్పటికాలు మూత్రం నుంచి సులువుగా బయటకు పోతాయి. పాలు, చక్కెరను మిక్స్ చేసిన టీ కంటే గ్రీన్ టీ ఎంతో మేలు చేస్తుంది. రెగ్యులర్ గా దీన్ని తాగడం వల్ల మూత్రపిండాల్లోనే రాళ్లు కరగడంతో పాటుగా.. ఎన్నో అనారోగ్య సమస్యలు తగ్గి శరీరం ఆరోగ్యంగా ఉంటుంది.
రాజ్మా (Rajma)
రాజ్మా మూత్రపిండాలను శుభ్రంగా చేయడంతో పాటుగా ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాదు మూత్రపిండాల్లో ఏర్పడిన రాళ్లను సైతం సులువుగా కరిగిస్తుంది. రాజ్మాల్లో బరువును తగ్గించే ఖనిజాలు కూడా పుష్కలంగా ఉంటాయి. రాజ్మా లేదా కిడ్నీ బీన్స్ లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిలో కరిగే, కరగని ఫైబర్లు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు సహాయపడతాయి. కిడ్నీ బీన్స్ లో విటమిన్ బి కూడా అధికంగా ఉంటుంది. ఇది కిడ్నీల్లో రాళ్లను తొలగించేందుకు ఎంతో సహాపడుతుంది. ఇందుకోసం కిడ్నీ బీన్స్ పులుసు లేదా రాజ్మాను తీసుకోవచ్చు.
Dandelion Juice
Dandelion లో విటమిన్ ఎ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, జింక్, పొటాషియం, ఐరన్ వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. ఈ జ్యూస్ పిత్త స్రావాన్ని పెంచేందుకు తోడ్పడుతాయి. అలాగే శరీరంలో ఉన్న విషపదార్థాలను కూడా బయటకు తొలగిస్తాయి. కిడ్నీల్లో రాళ్లు కరగాలంటే రోజుకు రెండు సార్లు ఈ డాండెలైన్ టీని తాగాలి. దీన్ని జ్యూస్ గా చేసుకుని తాగినా రాళ్లు కరిగిపోతాయి. ఈ జ్యూస్ కు ఆపిల్స్, నారింజ తొక్కలు, అల్లం వంటివి జోడించొచ్చు. ఈ జ్యూస్ ను రోజులో 3 లేదా 4 కప్పులు తాగాలి