నిద్రలేవగానే కళ్లు ఎందుకు ఉబ్బుతాయో తెలుసా?
ఉదయం లేవగానే చాలా మంది కళ్లు ఉబ్బుతాయి. ఇది ఏదో అనారోగ్య సమస్యగా కనిపిస్తుంది. దీనివల్ల చాలా మంది బయటకు కూడా వెళ్లరు. మీ కళ్లు వాపు వస్తే వెంటనే ఈ చిట్కాలను పాటించండి. మళ్లీ నార్మల్ అవుతాయి.
ఉదయం లేవగానే చాలా సార్లు మన ముఖం, కళ్లలో వాపు వస్తుంది. దీనికి ఎన్నో కారణాలు ఉండొచ్చు. రాత్రిపూట మధ్యం లేదా నీళ్లను ఎక్కువగా తాగడం, కొన్ని రకాల అలర్జీలు, తినే ఆహారాల వల్ల కూడా ముఖం ఉబ్బినట్టు కనిపిస్తుంది. అలాగే కళ్ల చుట్టూ ఉన్న కణజాలాలు, ముఖ్యంగా కనురెప్పలకు మద్దతునిచ్చే కండరాలు వృద్ధాప్యంలో వాటి స్థితిస్థాపకతను కోల్పోతుంటాయి. కంటి మంట, కొన్ని కారణాల వల్ల అలసట, ఎక్కువ ఒత్తిడి, నీటి నిలుపుదల వల్ల కూడా కళ్లు ఉబ్బుతాయి. మరి ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం..
వేడి నీళ్లు, ఉప్పు
వేడినీళ్లు, ఉప్పు సహాయంతో కూడా కళ్ల వాపును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇందుకోసం వేడినీటిని తీసుకుని అందులో ఉప్పు వేయండి. దీనిలో దూదిని ముంచి 3 నుంచి 4 నిమిషాల పాటు కళ్లలో పెట్టుకోండి. ఇది కళ్ల వాపును తగ్గిస్తుంది.
చల్లని టీస్పూన్
అవును టీ స్సూన్ కూడా కళ్ల వాపును తగ్గిస్తుంది. ఇందుకోసం ఒక స్టీల్ స్పూన్ ను తీసుకుని కాసేపు ఫ్రీజర్ లో ఉంచండి. ఆ తర్వాత చెంచా వెనుక భాగాన్ని కళ్లపై ఉంచితే వాపు తగ్గిపోతుంది.
eyes
కోల్డ్ కంప్రెస్
కళ్ల వాపును తగ్గించుకోవాలంటే కాటన్ క్లాత్ లో ఐస్ క్యూబ్స్ ను చుట్టి కళ్ల కింది భాగంలో అప్లై చేయండి. అలాగే కాటన్ ను చల్లటి నీటిలో నానబెట్టి కళ్లపై పెట్టుకోవచ్చు.
కీరదోసకాయ
కళ్ల వాపును తగ్గించడానికి కీరదోసకాయను సన్నని ముక్కలుగా కట్ చేయండి. ఈ ముక్కలను కళ్లపై కాసేపటి వరకు ఉంచండి. కీరదోసకాయ మరీ చల్లగా ఉండకూడదు. వీటిని కళ్లపై సుమారుగా 25-30 నిమిషాల పాటు ఉంచండి. దీంతో కళ్ల వాపు పోతుంది.
టీ బ్యాగులు
గ్రీన్ టీ బ్యాగులతో కూడా కంటి వాపును సులభంగా తగ్గించుకోవచ్చు. ఇవి చాలా ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయి. నిజానికి ఈ టీ బ్యాగుల్లో కెఫిన్ కంటెంట్ ఉంటుంది. ఇది కంటి వాపును తగ్గించడానికి ఎంతో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. వేడి టీ బ్యాగులను కళ్లపై ఉంచి కాసేపు అలాగే ఉంచి తీసేయండి. తేడాను మీరే గమనిస్తారు.