నల్లని పెదాలను ఎర్రగా మార్చే చిట్కాలు
మన దైనందిన అలవాట్ల వల్ల పెదాలు నల్లగా మారుతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలతో నల్లని పెదాలను ఎర్రగా, అందంగా మార్చొచ్చు. అదెలాగంటే..?

పెదాలతో ముఖం అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. పెదాలే ముఖాన్ని అందంగా మారుస్తాయి. కానీ చాలా మంది పెదాలు నల్లగా ఉంటాయి. నల్లని పెదాలు అంతగా అందంగా కనిపించవు. ఇలాంటి వారే పెదాలను ఎర్రగా మార్చేందుకు ఎన్నో చిట్కాలను ఫాలో అవుతుంటారు. సిగరెట్లు కాల్చడం, నిశ్చల జీవనశైలిని గడపడం, నీటిని పుష్కలంగా తాగకపోవడం వంటి కొన్ని కారణాల వల్ల పెదాలు నల్లగా మారుతాయి. నల్లని పెదాలను ఎర్రగా, అందంగా ఎలా మార్చాలో ఇప్పుడు తెలుసుకుందాం..
పంచదార స్క్రబ్
నల్లని పెదాలను ఎర్రగా మార్చడానికి పంచదార స్క్రబ్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇందుకోసం పంచదారలో తేనె మిక్స్ చేసి పేస్ట్ లా తయారుచేయండి. ఈ పేస్ట్ ను కొద్దిగా తీసుకుని పెదవులకు అప్లై చేసి 2 నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఆ తర్వాత నీటితో కడిగేయండి. ఈ షుగర్ స్క్రబ్ పెదవులపై ఉన్న మృతకణాలను తొలగిస్తుంది. తర్వాత మీ పెదవులు గులాబీ రంగులో కనిపిస్తాయి. ఈ స్క్రబ్ ను వారానికి రెండుసార్లు చేయాలి.
నిమ్మరసం
నల్లగా ఉన్న పెదాలను ఎర్రగా మార్చడానికి నిమ్మరసం ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. పెదవులపై నిమ్మరసం నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేసి నలుపుదనాన్ని తొలగిస్తుంది. తేనెలో నిమ్మరసం మిక్స్ చేసి పెదాలకు అప్లై చేసి 20 నిమిషాల తర్వాత కడిగేయాలి. ఇలా వారానికి 3 నుంచి 4 సార్లు చేస్తే పెదవుల రంగు గులాబీ రంగులోకి మారుతుంది.
కీరదోసకాయ రసం
పెదవులు సహజంగా గులాబీ రంగులోకి మారడానికి, శెనగపిండిలో తేనె కలిపిన కీరదోసకాయ రసాన్ని అప్లై చేయండి. ఈ పేస్ట్ ను పెదవులపై 20 నిమిషాల పాటు ఉంచి ఈ తర్వాత మసాజ్ చేసి శుభ్రం చేసుకోండి.