మీ జుట్టు సిల్కీగా, స్మూత్ గా ఉండాలంటే ఇలా చేయండి
జుట్టు సమస్యలు రావడం సర్వసాధారణం. ఇక జుట్టు అందంగా కనిపించాలని మార్కెట్ లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ను ట్రై చేస్తుంటాయి. అయినా ఆ సమస్యలు మాత్రం పోవు. పైసా ఖర్చులేకుండా ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలో మీ జుట్టును సిల్కీగా, స్మూత్ గా తయారచేయొచ్చు. అదెలాంటే?
hair care
ప్రస్తుత కాలంలో చాలా మంది హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారు. అయినా ఈ రోజుల్లో హెయిర్ ఫాల్ కామన్ సమస్య అయిపోయింది. జుట్టు రాలడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. సర్వేల ప్రకారం.. ప్రతి ముగ్గురిలో ఒకరు హెయిర్ ఫాల్ తో బాధపడుతున్నారట. అందులో ప్రస్తుత కాలంలో స్టైలింగ్ టూల్స్ ను కూడా ఎక్కువగా వాడేస్తున్నారు. దీనివల్ల జుట్టు పొడిబారి జీవం లేనట్టుగా కనిపిస్తుంది. ఇక సమస్య పోవడానికి మార్కెట్ లో దొరికే ప్రతి ప్రొడక్ట్ ను వాడేస్తుంటారు. అయితే మార్కెట్ లో కొనే షాంపూ కండిషనర్ జుట్టును మరింత అధ్వాన్నంగా మారుస్తుంది. అయితే పైసా ఖర్చులేకుండా ఇంట్లోనే చాలా సులువుగా హెయిర్ కండిషనర్లను తయారుచేయొచ్చు. ఇవి మీ జుట్టును తేమగా, సిల్కీగా, స్మూత్ గా చేస్తాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కొబ్బరి నూనె
అవును కొబ్బరి నూనె మన జుట్టుకు చేసే మేలు అంతా ఇంతా కాదు తెలుసా? ఇది మన జుట్టుకు పోషణను అందిస్తుంది. సిల్కీగా మారుస్తుంది. షైనీగా చేస్తుంది. ఇందుకోసం మీరు తలస్నానం చేసే ముందు కొబ్బరినూనెను తలకు బాగా పట్టించి కొద్దిసేపు మసాజ్ చేయండి. గంటల సేపటి తర్వాత తలస్నానం చేయండి. దీనివల్ల మీ జుట్టు తెగిపోయే.. రెండుగా చీలిపోయే అవకాశం తగ్గుతుంది. అంతేకాదు మీ జుట్టు అందంగా కూడా మెరుస్తుంది.
గుడ్డు
గుడ్డును కూడా మీ జుట్టుకు నేచురల్ కండీషనర్ లా పనిచేస్తుంది. ఇందుకోసం మీరు తలస్నానం చేయడానికి ముందు గుడ్డులోని పసుపు భాగాన్ని జుట్టంతా పట్టించండి. అరగంట తర్వాత షాంపూతో తలస్నానం చేయండి. దీనివల్ల మీ మృదువుగా మారుతుంది. షైనీగా కనిపిస్తుంది.
పెరుగు
పెరుగు మన ఆరోగ్యానికే కాదు జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం తలస్నానం చేయడానికి గంటల ముందు పెరుగును తలకు అప్లై చేయండి. తర్వాత గోరువెచ్చని నీటితో మీ జుట్టును కడగండి. పెరుగు నెత్తిమీదున్న చుండ్రును పూర్తిగా పోగొడుతుంది. దీంతో మీ జుట్టు ఊడే అవకాశం కూడా ఉండదు.
అరటిపండు, తేనె
అరటిపండు, తేనె హెయిర్ ప్యాక్ కూడా జుట్టు ఊడిపోకుండా చేస్తుంది. అలాగే జుట్టుకు మంచి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ప్యాక్ ను తయారు చేయడానికి పండిన అరటిపండును తీసుకుని గుజ్జుగా చేయండి. దానిలో 2 టీస్పూన్ల తేనెను వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి గంట తర్వాత తలస్నానం చేయండి. ఈ హెయిర్ ప్యాక్ మీ జుట్టును సిల్కీగా, స్మూత్ గా చేస్తుంది.