పాదాల నొప్పులా? ఈ చిట్కాలను ట్రై చేయండి..
మడమల నొప్పి, పాదాల నొప్పులు అంత తొందరగా వదిలిపెట్టవు. రోజుల తరబది ఈ సమస్యలు మనల్ని వెంటాడుతూనే ఉంటాయి. విపరీతమైన శారీరక శ్రమ, హై హీల్స్ వేసుకోవడం, ఊబకాయం, ఆర్థరైటిస్ వంటి కారణాల వల్ల వస్తూ ఉంటుంది.

চালের গুঁড়োর প্যাক
పాదాల నొప్పులు, మడమల నొప్పులు అంత తొందరగా నయం అవ్వవు. ఈ సమస్యలతో ఇంటి పనులను కూడా చేయలేకపోతుంటారు. ఈ నొప్పి వివిధ కారణాల వల్ల వస్తుంది. ఊబకాయం, విపరీతమైన శారీరక శ్రమ, నరాలు దెబ్బతినడం, ఆర్థరైటిస్, కాల్లస్, మొటిమలు, పాదాల పుండ్లు వంటి సమస్యలతో ఈ సమస్య తలెత్తుతుంది. ఈ సమస్య ఉపశమనం కలిగించడంలో ఇంటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
పసుపు: పసుపు యాంటీ బయోటిక్ గా పనిచేస్తుందని మనకు తెలిసిందే. ఈ పసుపు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు ఎముకలకు సంబంధించిన సమస్యకు కూడా ఇది చక్కటి ఔషదంలా పనిచేస్తుంది. నొప్పిని, వాపును తగ్గించే గుణాలను ఈ పసుపు కలిగి ఉంటుంది. తీవ్రమైన పాదాల నొప్పి ఉంటే మీ రోజు వారి ఆహారంలో 8 గ్రాముల పసుపును చేర్చండి.
అల్లం: పాదాల నొప్పులను తగ్గించడానికి అల్లం ఎంతో సహాయపడుతుంది. చిన్న అల్లం ముక్కను తీసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అందులో రెండు టీస్పూన్ల నీళ్లను కలిపి కొద్ది సేపు పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కాటన్ క్లాత్ ను తీసుకుని ఆ మిశ్రమంలో ముంచి దాన్ని పాదాలకు పట్టించాలి. ఒక 15 అలాగే ఉంచండి. రోజుకు మూడ సార్లు ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
ఆపిల్ సైడర్ వెనిగర్: పాదాల నొప్పులను నివారించడంలో ఆపిల్ సైడర్ వెనిగర్ బాగా పనిచేస్తుంది. ఇందుకోసం.. ఒక టీ స్పూన్ ఆపిల్ సైడర్ వెనిగర్ ను తీసుకుని అందులో ఒక గ్లాస్ వేడినీటిని, కొంచెం తేనె మిక్స్ చేసి తాగితే మంచి ఫలితం ఉంటుంది. అలాగే ఒక బకెట్ వేడి వాటర్ తీసుకుని అందులో 1/4 కప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేయాలి. అందులో 15 నిమిషాల పాటు పాదాలను ఉంచాలి. ఇలా చేసినా పాదాల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చు.
ఆవాలు: ఆవపిండిని ఎన్నో సమస్యల నివారణ కోసం ఉపయోగిస్తుంటారు. ఒక బకెట్ గోరు వెచ్చని నీళ్లను తీసుకుని అందులో అరకప్పు ఆవపిండిని వేయండి. అందులో మీ పాదాలను ఒక అరగంట పాటు పెట్టండి. ఇలా చేస్తే పాదాల నొప్పులు మటుమాయం అవుతాయి.
వెల్లుల్లి: వెల్లుల్లి పాదాల నొప్పులు, వాపును తగ్గిస్తుందని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. 4 గ్రాముల వెల్లుల్లిని తీసుకుని వాటిని ఆవ నూనెలో ఉడకబెట్టాలి. దాంతో పాదాలకు మర్దన చేయాలి. ఇలా చేస్తే పాదాల నొప్పులు తగ్గుతాయి. అంతేకాదు దీనితో రాత్రుళ్లు పాదాలకు మర్దన చేయడం వల్ల బాగా నిద్రపడుతుంది.