డార్క్ సర్కిల్స్ ఉంటే అందం తగ్గుతుంది.. కాబట్టి ఈ చిట్కాలను ట్రై చేయండి
మారుతున్న జీవినశైలి, చెడు ఆహారపు అలవాట్లు, నిద్రలేమి వంటి కొన్ని కారణాల వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇది మీ చర్మాన్ని కూడా ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది. ప్రస్తుత కాలంలో కళ్ల కింద నల్లటి వలయాల సమస్య సర్వసాధారణమైపోయింది. కానీ ఇది మీ అందాన్ని తగ్గిస్తుంది. అందుకే..
ఎవ్వరైనా సరే ముందుగా మన ముఖాన్నే చూస్తారు. మీకు తెలుసా? మన ముఖమే మన ఆరోగ్యం ఎలా ఉంది.. మనమెంత అందంగా ఉన్నామో తెలియజేస్తుంది. అందుకే ముఖ సంరక్షణ విషయంలో చాలా మంది ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. కానీ చాలా మందికి మొటిమల మచ్చలు, నల్ల మచ్చలు, తెల్ల మచ్చలు ఉంటాయి. అంతేకాదు కళ్ల చుట్టూ నల్లగా కూడా ఉంటుంది. ఈ డార్క్ సర్కిల్స్ రావడానికి ఎన్నో కారణాలున్నాయి. కానీ దీనివల్ల ముఖం అందం తగ్గుతుంది. ఇక ఈ సమస్యలను పోగొట్టడానికి రకరకాల క్రీములు, ఫేస్ ప్యాక్స్ ను వాడుతుంటారు. అయినా సమస్య తగ్గని వారు చాలా మందే ఉంటారు. మరి వీటిని సులువుగా ఎలా తగ్గించుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం..
బాదం నూనె
బాదం నూనె కూడా డార్క్ సర్కిల్స్ ను సులువుగా తొలగించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇందుకోసం రాత్రిపూట పడుకునే ముందు 2-3 చుక్కల బాదం నూనెను చేతివేళ్లకు అద్దుకుని కళ్ల చుట్టూ అప్లై చేయండి. అలాగే నెమ్మదిగా కొద్దిసేపు మసాజ్ చేయండి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే తేడాను గమనిస్తారు.
dark circles
టమాటా, నిమ్మరసం
టమాటా, నిమ్మరసాన్ని ఉపయోగించడం వల్ల కూడా డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా వదిలించుకోవచ్చు. ఇందుకోసం ఒక టీస్పూన్ టమాటా రసాన్ని తీసుకుని అందులో 4 నుంచి 5 చుక్కల నిమ్మరసాన్ని కలపండి. కాటన్ సహాయంతో కళ్ల కింద దీన్ని అప్లై చేయండి. దీన్ని 10-15 నిమిషాల పాటు అలాగే ఉంచి తర్వాత కడిగేయండి.
కీరదోసకాయ
డార్క్ సర్కిల్స్ ను పూర్తిగా వదిలించుకోవడానికి కీరదోసకాయను కూడా ఉపయోగించొచ్చు. ఇందుకోసం కీరదోసకాయను ముక్కలుగా కట్ చేసి కళ్లపై పెట్టుకోండి. ఇలా ప్రతిరోజూ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ పూర్తిగా తగ్గుతాయి.
పైనాపిల్, పసుపు
పైనాపిల్, పసుపు కూడా డార్క్ సర్కిల్స్ ను పోగొట్టడానికి సహాయపడతాయి. ఇందుకోసం 2 టీస్పూన్ల పైనాపిల్ జ్యూస్ ను తీసుకుని అందులో చిటికెడు పసుపును వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని కళ్ల కింద అప్లై చేయండి. 10-15 నిమిషాల తర్వాత నీటితో కడిగేయండి.
కలబంద జెల్
కలబంద జెల్ లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇది మన జుట్టుకే కాదు చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది డార్క్ సర్కిల్స్ ను తొలగించడానికి కూడా ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం అలోవెరా జెల్ ను తీసుకుని కళ్ల కింద అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నీటితో కడగండి. ఇలా రోజూ చేయడం వల్ల డార్క్ సర్కిల్స్ తగ్గిపోతాయి.