Holi 2022: హోలీ ఆడటానికి సిద్దమైతున్నరా..? ఈ బ్యూటీ టిప్స్ మీ కోసమే..
Holi Skin Care tips: హోలీ హోలీల రంగ హోలీ చెమకేలిలహోలీ అంటూ హోలీ పండుగలో రకరకాల రంగుల్లో మునిగిపోవడానికి సిద్దమయ్యారా. అయితే కెమికల్స్ రంగుల వల్ల అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. స్కిన్ అలర్జీ, దురద వంటి సమస్యలు రాకూడదంటే నిపుణులు సూచిస్తున్న ఈ టిప్స్ ను పాటించాల్సిందే..

Holi Skin Care tips: హోలీ పండుగ కోసం చిన్నా పెద్దా.. ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఈ పండుగలో ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా పాల్గొంటుంటారు. అయితే కెమెకల్ రంగులతో హోలీ ఆడటం వల్ల అనేక చర్మసమస్యలు వచ్చే అవకాశం ఉంది.
ఒకప్పుడు అయితే మోదుగ చెట్టు పువ్వులతో హోలీ రంగులను తయారు చేసేవారు. ఇప్పుడు అంత ఓపిక ఎవరికీ ఉండటం లేదు. అందుకే కెమికల్స్ కలిపిన రంగులతో హోలీని ఆడుతున్నారు. వీటిని వినియోగించడం వల్ల అలర్జీలు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అయితే నిపుణులు సూచిస్తున్న ఈ టిప్స్ ను ఫాలో అయితే ఇలాంటి సమస్యలు రావు. అవేంటో తెలుసుకుందాం పదండి..
పసుపు: ఇందులో Anti-inflammatory గుణాలు ఉండటం వల్ల బ్యాక్టీరియాలను, క్రిములను చంపేస్తుంది. అంతేకాదు ఇది స్కిన్ స్మూత్ గా అయ్యేలా చేస్తుంది. అలాగే టాన్ తొలగిపోవడానికి కూడా పసుపు ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం.. నాలుగు భాగాల పెరుగును తీసుకుని అందులో ఒక బాగం తేనె మిక్స్ చేసి చిటికెడు పసుపును వేయాలి. దీన్ని బాగా కలిపి పెట్టుకోవాలి. హోలీ ఆడిన తర్వాత .. కొన్ని రోజుల పాటు ఈ మిశ్రమాన్ని ముఖానికి, కాళ్లు చేతులకు, మెడకు అప్లై చేయాలి. దీన్ని ఒక 20 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల స్కిన్ కాంతివంతంగా మెరవడమే కాదు స్మూత్ గా కూడా అవుతుంది.
వేప: వేప చెట్టు ఎన్నో దివ్య ఔషద గుణాలను కలిగి ఉంటుంది. వేపపుల్లతో దంతాలు తోమితో చిగుళ్ల సమస్యలు ఇట్టే తొలగిపోతాయి. ఈ చెట్టు ఆకులు కూడా ఎన్నో సమస్య నివారణ కోసం ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, మంట, అలర్జీ వంటి సమస్యను నయం చేయడానికి వేపాకు ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం కొన్ని నీళ్లను బాగా మరిగించి.. అందులో వేపాకులను వేయాలి. కానీ వీటిని ఉడకబెట్టకూడదు. కొద్ది సేపటి తర్వాత ఆ నీటిని వడకట్టి హెయిర్ వాష్ కు, చర్మాన్ని శుభ్రపరుచుకోవడాని యూజ్ చేయాలి. వేపాకులను పేస్ట్ లా చేసి దాన్ని జుట్టు, స్కిన్ పై అప్లై చేసినా దురద సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
నువ్వులు: ముందే ఎండాకాలం. ఆపై రాబోతున్నది హోలీ పండుగ. ఇక ఈ పండుగ రోజు ఎక్కువగా ఎండలోనే ఉంటారు. ఆ సమయంలో వడదెబ్బకు గురయ్యే ప్రమాదం పొంచి ఉంది. ఈ సమస్య బారిన పడకుండా చేయడానికి నువ్వులు ఎంతో సహాయపడతాయి. ఇందుకోసం నువ్వులను చూర్ణంగా తయారుచేసి కొన్ని నీటిలో రాత్రంతా నానబెట్టాలి. తెల్లవారే సరికి అది మిల్కీ లిక్విడ్ లా తయారువుతుంది. దీన్ని మెడకు, చేతులకు, ముఖానికి రాస్తే వడదెబ్బ కొట్టే అవకాశమే ఉండదు.