Holi 2022: ఈ చిట్కాలతో ముఖానికి, జుట్టుకు పట్టిన రంగులను ఈజీగా తొలగించొచ్చు..
Holi 2022: హోలీ ఆడాక రంగులను ఎలా వదిలించుకోవాలి అని మీరు టెన్షన్ పడిపోవక్కర్లేదు. ఎందుకంటే ముఖానికి, మీ జుట్టుకు పట్టుకు పట్టిన రంగులను చాలా అంటే చాలా సులభంగా వదిలించుకోవచ్చు.

Holi 2022: ఇన్నాళ్లుగా వేచి చూసిన రంగుల పండుగ రానే వచ్చింది. ఇంకేముంది ఈ రోజూ ప్రతిఒక్కరూ రంగుల్లో తడిసి ముద్దైపోతుంటారు. రకరకాల రంగులను ఒకరిపై ఒకరు చల్లుకుంటూ ఈ హోలీ పండుగను ఫుల్ గా ఎంజాయ్ చేస్తుంటారు. హోలీ పండుగ ఎన్నో సంతోషాలను మూటగట్టుకొస్తుంది.
అయితే హోలీ పండుగ రోజు ఎన్నో రంగులు మన శరీరంపై, జుట్టుపై పడటం కామన్. అయితే చాలా మంది హోలీ ఆడిన తర్వాత రంగులను ఎలా వదిలించుకోవాలి అని తెగ టెన్షన్ పడిపోతుంటారు. ఇక మీరు టెన్షన్ పడిపోవక్కర్లేదు. గోర్లపై, ముఖంపై, జుట్టుపై పడిన రంగులను ఈజీగా తొలగించుకోవచ్చు.
ప్రస్తుతం అన్నీ కెమికల్ రంగులను మాత్రమే ఉపయోగిస్తుంటారు. ఈ కెమికల్ రంగులు శరీరానికి, కళ్లకు, స్కిన్ కు ఎంతో హానీ కలిగిస్తుంది. కాగా ఈ రంగులను తొలగించుకోవడానికి రసాయన షాంపూలను ఉపయోగిస్తుంటారు. ఇక ఒంటికి అంటిన రంగులను వదిలించుకోవడానికి స్క్రబ్ చేస్తుంటారు. ఇలా చేయడం మంచిది కాదు. ఎందుకంటే స్క్రబ్ చేస్తే స్కిన్ చెబ్బతినే ప్రమాదముంది.
గోర్లు, ముఖం, జుట్టు, ఒంటికి అంటిన రంగు వదిలించడానికి మీరు ఈ ప్రయోగాలను చేయక్కర్లేదు. ఒంటికి అంటిన రంగులు ఈజీగా వదిలిపోవాలంటే స్కిన్ కు కాస్త కొబ్బరి నూనెను రుద్దండి. ఆ తర్వాత సబ్బును పెట్టండి. దీంతో ఒంటికి అంటుకున్న రంగులు సులభంగా వదిలిపోతాయి.
holi 2022
ఇకపోతే జుట్టుకు పట్టిన రంగులు వదలాలంటే షాంపూను అప్లై చేయండి. కానీ రంగులు వదిలిపోవడం లేదని రెండు కంటే ఎక్కువ షాంపులను ఎట్టి పరిస్థితిలో పెట్టకండి. షాంపూ తర్వాత జుట్టుకు కండీషనర్ పెట్టండి. ఇది మీ జుట్టు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది.
Holi 2022
ఇకగోర్లకు పట్టిన రంగులు వదిలిపోవాలంటే.. మీ నెయిల్స్ కు నెయిల్ పాలిష్ ను పెట్టండి. ఆ తర్వాత నెయిల్ పాలీష్ రిమూవర్ తో గోర్లను క్లీన్ చేయండి. దీంతో హోలీ రంగులు కూడా ఈజీగా తొలగిపోతాయి. అయినా రంగులు వదలకపోతే కొన్ని గోరువెచ్చని నీల్లను తీసుకుని అందులో కాస్త వెనిగర్ ను కలపండి. ఆ నీటిలో మీ గోర్లను కొద్దిసేపు ఉంచండి. ఇలా చేస్తే కూడా గోర్లకు అంటిన రంగులు తొలగిపోతాయి.