Holi 2022: ఈ హోలీకి నేచురల్ కలర్స్ ను ఇంట్లోనే ఇలా తయారుచేసుకోండి..
Holi 2022: కెమికల్స్ రంగులతో అనేక చర్మ సమస్యలు వచ్చే అవకాశముంది. అలాగే ఈ కెమికల్స్ రంగులు కంట్లో పడితే.. కంటి చూపు దెబ్బతినే ప్రమాదముంది. అందుకే ఈ హోలీకి నేచులర్ కలర్స్ ను వాడండి..

Holi 2022: రంగుల పండుగ అతి తొందరలోనే రాబోతోంది. ఇక మన కోసం రకరకాల రంగులు ఎదురుచూస్తున్నాయి కూడా. కానీ మార్కెట్లో లభించే కెమికల్స్ రంగులను వాడితే ఎన్నో సమస్యలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా చర్మ సమస్యలు, హెయిర్ ఫాల్, కంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి వీటికి బదులుగా ఆరోగ్యకరమైన నాచురల్ రంగులనే ఉపయోగించేలా ప్లాన్ చేసుకోండి. వీటికోసం మీరు ఎక్కడెక్కడో వెతకాల్సిన అవసరం కూడా లేదు. మీ ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంతకి వీటిని ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం పదండి..
శనగపిండి, పసుపుతో కూడా హోలీ రంగును తయారుచేయొచ్చు. శనగపిండిని 80 శాత తీసుకుంటే పసుపు 20 శాతం తీసుకుని మిక్స్ చేసి రంగుగా తయారుచేయొచ్చు. ఈ రంగు వల్ల మీకు ఎలాంటి హానీ జరగదు కూడా.
holi 2022
నిమ్మకాయలను తీసుకుని వాటి నుంచి రసం పిండి పక్కన పెట్టుకోవాలి. ఈ రసంలో కాస్త పసుపు వేస్తే అది రెడ్ కలర్ గా మారుతుంది. దీంతో మీరు రెడ్ నేచురల్ కలర్ ను తయారుచేసినట్టే. అయితే ఈ రంగును కాసేపు ఎండలో ఉంచాలి. అప్పుడే అది పూర్తిగా రెడ్ కలర్ గా మారుతుంది.
holi 2022
నిమ్మరసం తీసుకుని అందులో కొంచెం మొత్తంలో పసుపు వేస్తే .. పింక్ కలర్ వచ్చేస్తుంది. ఇది సేమ్ రెడ్ కలర్ ను తయారుచేసుకునే ప్రాసెస్ యే కానీ.. పసుపును కాస్త తక్కువ మొత్తంలో వేసుకోవాలంతే..
చందనం, ఎర్రచందనాలను నేరుగా హోలీ రంగుగా పూయొచ్చు. నీటిలో కలిపి కూడా ఇతరులపై చల్లొచ్చు. బీట్ రూట్ , దానిమ్మ పండ్లు మీకు నేచురల్ కలర్ గా ఉపయోగపడతాయి. వీటిని గ్రైండ్ చేసుకుంటే తిక్ కలర్ ఏర్పడుతుంది.
మోదుగ పూలను తెచ్చి వాటిని గ్రైండ్ చేసి నీటిలో కలిపితే కూడా నేచురల్ కలర్ తయారైనట్టే.. ఇది మన బాడీకి ఎటువంటి హానీ చేయదు.
ఇక నేచురల్ గ్రీన్ కలర్ ఏర్పడాలంటే.. మైదాపిండిని, గోరింటాకు సమానంగా తీసుకోవాని మిక్స్ చేస్తే ఆకుపచ్చ రంగు ఏర్పడినట్టే. రకరకాల పండ్లు, పూలను మిక్స్ చేసిన తర్వాత వచ్చే రంగులను ఇందులో మిక్స్ చేయొచ్చు. దీనికి కాస్త రోజ్ వాటర్ యాడ్ చేస్తే మంచి వాసన వస్తుంది.
పండ్ల తొక్కలతో కూడా రంగులను తయారుచేస్తారు. వీటిని నీటిలో మరిగించి ఉపయోగించొచ్చు కూడా. శరీరానికి హానీ కలిగించని రకరకాల చెట్ల బెరళ్లు, ఆకులను నానబెట్టి గ్రైండ్ చేసి కూడా రంగులను తయారుచేస్తారు.
నేచురల్ కలర్స్ ను వాడటం వల్ల శరీరంపై రంగుల తాలూకూ ఎటువంటి మచ్చలు ఏర్పడవు. కానీ కెమికల్స్ రంగులను చల్లుకోవడం వల్ల కాలెయ, చర్మ, శ్వాస సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.