MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • High Cholesterol: కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరగాలంటే.. అల్లాన్ని ఇలా తీసుకోవాల్సిందే..!

High Cholesterol: కొలెస్ట్రాల్ ఫాస్ట్ గా కరగాలంటే.. అల్లాన్ని ఇలా తీసుకోవాల్సిందే..!

High Cholesterol: కొన్ని రకాల మసాలా దినుసులు, ఆహారాల ద్వారా కూడా చెడు కొలెస్ట్రాల్ కు చెక్ పెట్టొచ్చు. ముఖ్యంగా అల్లాన్ని ఈ విధంగా ఉపయోగిస్తే.. చెడు కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా కరిగిపోతుంది..  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 04 2022, 12:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
High Cholesterol

High Cholesterol

ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతున్న కొద్దీ మీకు కొత్త కొత్త రోగాలొచ్చే అవకాశం కూడా పెరుగుతున్నట్టే. ముఖ్యంగా శరీరంలో కొలెస్ట్రాల్ మరీ ఎక్కువైతే గుండెపోటు, అధిక రక్తపోటు, కొరోనరీ ఆర్టరీ, డయాబెటీస్ వంటి ప్రాణాంతక రోగాలొచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

ఒంట్లో పెరిగే కొలెస్ట్రాల్ శరీర అవయవాలపై చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే దీన్ని తొందరగా తగ్గించుకోవాలి. కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవాలనుకునే వారు ఆయిలీ ఫుడ్ ను, ఫ్రైడ్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోకూడదు. తీపి పదార్థాలను కూడా తీసుకోకూడదు.  అయితే కొలెస్ట్రాల్ ను కరిగించుకోవాలనుకునే వారు అల్లాన్ని రోజూ తీసుకోవాలని నిపుణులు సలహానిస్తున్నారు. 
 

38

అల్లం మన శరీరానికి ఎన్నో విధాలా మేలు చేస్తుంది. దీనిలో లిపోప్రోటీన్లను, ట్రైగ్లిజరైడ్లను తగ్గించే గుణాలుంటాయి. ఈ అల్లాన్ని ఏ విధంగా తీసుకుంటే కొలెస్ట్రాల్ కరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 
 

48

పచ్చి అల్లం

పచ్చి అల్లాన్ని అలాగే తీసుకుంటే ఆరోగ్యం ఎంతో బాగుంటుంది. ఇది ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది. ఆయిలీ ఫుడ్ ను తిన్న వారు కొంచెం పచ్చి అల్లాన్ని తినాలి. ఎందుకంటే ఇది మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది. 
 

58

అల్లం పొడి

అల్లం పొడికోసం అల్లాన్ని కొన్ని రోజుల పాటు ఎండలో బాగా ఎండబెట్టీ.. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ప్రతిరోజూ ఉదయం పూట నీళ్లలో కలుపుకుని పరిగడుపున తాగాలి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి సహాయపడతుంది. 

68
<p>ginger teA</p>

<p>ginger teA</p>

అల్లం నీళ్లు

శరీరంలో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ నిల్వలను తగ్గించడంలో అల్లం నీరు ఎఫెక్టీవ్ గా పని చేస్తుంది. దీనికోసం ఒక గ్లాస్ వాటర్ తీసుకుని అందులో అంగుళం సైజున్న అల్లం ముక్కను వేసి మంటపై బాగా మరిగించండి. 15 నిమిషాల తర్వాత దీన్ని వడకట్టి గోరువెచ్చగా అయిన తర్వాత తాగితే మంచి ఫలితం ఉంటుంది.
 

78

అల్లం, లెమన్ టీ

పాలు, పంచదార, టీ ఆకులతో కూడిన టీ ఆరోగ్యానికి ఎంతమాత్రం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. దీనికి బదులుగా నిమ్మకాయ, అల్లం టీ తాగండి. ఇవి మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడంతో పాటుగా కొలెస్ట్రాల్ పెరిగే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. 
 

88

ఆయిలీ ఫుడ్స్, మసాలా ఫుడ్స్ తీసుకున్నప్పుడు అల్లం, లెమన్ టీ ని పక్కాగా తాగండి. ఇది చెడు కొలెస్ట్రాల్ వల్ల కలిగే నష్టాలను, ప్రమాదాలను తగ్గిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోకుండా మిమ్మల్ని కాపాడుతుంది. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Ragi Idli: మెత్తటి రాగి ఇడ్లీలు కావాలంటే ఇలా చేయండి, వెరీ సింపుల్ చిట్కా ఇదిగో
Recommended image2
Light Weight Gold Rings: తక్కువ బరువులో వావ్ అనిపించే గోల్డ్ రింగ్స్
Recommended image3
Coffee Grounds In Toilet: టాయిలెట్ కమోడ్ లో కాఫీ పొడి వేస్తే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved