- Home
- Life
- కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవాళ్లు వీటిని అస్సలు తినకూడదు.. లేదంటే గుండెపోటు వస్తుంది జాగ్రత్త..
కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండేవాళ్లు వీటిని అస్సలు తినకూడదు.. లేదంటే గుండెపోటు వస్తుంది జాగ్రత్త..
high cholesterol: శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగినప్పుడు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండటమే బెటర్. లేదంటే గుండెపోటు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

high cholesterol
శరీరంలో కొలెస్ట్రాల్ (cholesterol) ను పెంచడమంటే శరీరంలో సమస్యలను పెంచడమే. మీ శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు (Heart attack)వచ్చే ప్రమాదం పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఈ ప్రమాదం బారిన పడకూడదంటే.. మీ ఆహారం విషయంలో మార్పులు చేయాల్సి ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
High Cholesterol
లేకపోతే భవిష్యత్తులో తప్పక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మన శరీరంలో రెండు రకాల కొలెస్ట్రాల్ ఉంటుంది. ఒకటి మంచిది కొలెస్ట్రాల్ అయితే.. రెండోది చెడు కొలెస్ట్రాల్. మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగితే గుండెపోటు నుంచి హైబీపీ వంటి ఎన్నో ప్రమాదకరమైన జబ్బులు వచ్చే అవకాశం ఉంది.
High Cholesterol
అందులోనూ చెడు కొలెస్ట్రాల్ ను ఎక్కువగా కలిగున్న వారు కొన్ని ఆహారాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకంటే ఈ ఆహారాలు కొలెస్ట్రాల్ ను మరింత పెంచుతాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం పదండి.
మాంసం (Meat).. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వారు మాంసాన్ని ఎక్కువగా తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే మాంసం కొలెస్ట్రాల్ ను మరింత పెంచుతుంది. మాంసాన్ని తరచుగా తినడం వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఒక వేళ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే.. గుండెపోటు వచ్చే అవకాశం ఉందది. అందుకే దీన్ని పరిమితిలోనే తినడం మంచిది.
చికెన్ (Chicken).. మీ శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నట్టైతే చికెన్ తినకపోవడమే మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వాస్తవానికి చికెన్ ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మీకు ఎన్నో రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉంది. అందులో చికెన్ ఎంత ఇష్టమున్నా.. దీనికి దూరంగా ఉండటమే వీరి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఏమవుతుందిలే అని అలాగే తింటే మాత్రం ఈ సమస్య మరింత పెరుగుతుంది.
పాల ఉత్పత్తులు (Dairy products).. పాలు, పాల ఉత్పత్తులు మన ఆరోగ్యానికి మంచి చేసేవే అయినా.. ఇవి కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే వారికి మాత్రం హానికరం. ఇందులో పాలు, జున్నులో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు మరింత బరువు పెరగడమే కాదు.. ఒంట్లో కొలెస్ట్రాల్ కూడా బాగా పెరుగుతుంది. అందుకే వీటిని తీసుకోకపోవడమే మంచిది.