high bp control tips: హైబీపీ పేషెంట్లు తప్పక తినాల్సిన ఆహారాలు ఇవే..!
high bp control tips: బీపీ మరీ ఎక్కువైతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడమే కాదు శరీరంలోని ఇతర అవయవాలపై చెడు ప్రభావం కూడా పడుతుంది. అందుకే వీలైనంత తొందరగా బీపీని నియంత్రించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ రోజుల్లో సర్వసాధారణ సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. చెడు ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవన శైలి, ఒత్తిడి వంటి కారణాల వల్ల అధిక రక్తపోటు సమస్య తలెత్తుతుంది. 1440/90 కు మించి Blood pressure దానిని హైబీపీ అంటారు. రక్తపోటు విపరీతంగా పెరిగిపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ రావడంతో పాటుగా శరీరంలోని ఇతర శరీర భాగాలు కూడా దెబ్బతినే ప్రమాదముందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ సమస్యను పూర్తిగా తగ్గించలేము. కానీ మీ లైఫ్ స్టైల్ లో కొన్ని మార్పులు చేసుకుంటే మాత్రం అధిక రక్తపోటును నియంత్రించొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. ముఖ్యంగా అధిక రక్తపోటు సమస్య ఉన్న కొన్ని రకాల ఆహారాలను తీసుకుంటే బీపీ కంట్రోల్ అవుతుంది. అవేంటో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
సిట్రస్ ఫ్రూట్స్.. అధిక రక్తపోటు బాధితులకు సిట్రస్ పండ్లు ఎంతో మేలు చేస్తాయి. ఈ సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అంతేకాదు ఈ పండ్లు మీ శరీరానికి కావాల్సిన ఖనిజాలను, పోషకాలను అందిస్తాయి. హైబీపీతో బాధపడుతున్నట్టైతే మీరు ప్రతిరోజూ మధ్యాహ్నం పూట నిమ్మ లేదా ఆరెంజ్ వంటి పుల్లని పండ్లను ఒకటి తినండి. కివీ పండు తిన్నా బీపీ తగ్గడంతో పాటుగా పొట్ట కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
కొత్తిమీర ఆకులు.. కొత్తిమీర ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. వీటిని తరచుగా తీసుకుంటే అధిక రక్తపోటు నియంత్రణలో ఉంటుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. వారానికి ఒకసారి ఈ ఆకులను మీ వంటల్లో చేర్చుంటే అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది.
అవిసె గింజలు.. అవిసె గింజలు కూడా హైబీపీని తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. ఈ గింజల్లో మెగ్నీషియం, ఫైబర్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి టైప్ 2 మధుమేహం రాకుండా కూడా మనల్ని కాపాడుతాయి. ఈ గింజలను తినడం వల్ల కండరాలు ద్రుఢంగా తయారువుతాయి. ఇవ వీటిలో ఉండే ఫైబర్ కంటెంట్ ఆకలిని కంట్రోల్ లో ఉంచుతాయి.