ట్రైలర్ లాంఛ్ లో అలాంటి చెప్పులు.. విజయ్ దేవరకొండ ఎందుకు వేసుకున్నాడో తెలుసా..?
ఆయన అంత సింపుల్ గా ఉండటం నచ్చని బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్.. వెంటనే తన డ్రెస్ విజయ్ కి ఇవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.

విజయ్ దేవర కొండ.. ఈ పేరుకు అసలు పరిచయమే అక్కర్లేదు. ఈ పేరు ఒక సెన్సేషన్. అర్జున్ రెడ్డి సినిమాతో.. అందరి దృష్టి ఆకర్షించాడు. తన స్టైల్, యాటిట్యూడ్ తో... పాపులారిటీ సంపాదించుకున్నాడు. ప్రస్తుతం పూరీజగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్నాడు.
ఈ సినిమా లో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ధర్మ ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమాలో భాగమైంది. ఈ సినిమాను కేవలం తెలుగులోనే కాకుండా.. విజయ్ క్రేజ్ ని దృష్టిలో పెట్టుకొని అన్ని భాషల్లోనూ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ కూడా విడుదల చేశారు.
ఈ సినిమా ట్రైలర్ లాంఛ్ ని ఇటీవల ముంబయిలో నిర్వహించారు. ఈ ఈవెంట్ కి విజయ్ చాలా సింపుల్ గా వెళ్లడం గమనార్హం. డ్రెస్సింగ్ మాత్రమే కాదు.. కాళ్లకు కేవలం రూ.199 విలువ చేసే చెప్పులు ధరించడం అందరి దృష్టి ఆకర్షించింది. ఆయన అంత సింపుల్ గా ఉండటం నచ్చని బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్.. వెంటనే తన డ్రెస్ విజయ్ కి ఇవ్వడం గమనార్హం. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా నెట్టింట వైరల్ గా మారాయి.
విజయ్ లాంటి క్రేజ్ ఉన్న హీరో.. కాస్ట్ లీ చెప్పులు, డ్రెస్ లు ధరించవచ్చు. కానీ.. ఆయన అంత సింపుల్ గా వెళ్లడానికి కారణం ఉందట. ఈ విషయాన్ని దక్షిణాసియా సినీ తార స్టైలిస్ట్ హర్మాన్ కౌర్ వివరించారు.
విజయ్ దేవరకొండ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమంలో భాగంగా చప్పల్స్ ధరించాలని అనుకున్నాడట. ఎందుకంటే.. సినిమాలో తన క్యారెక్టర్ ఎలా ఉంటుంతో తన లుక్ తో చెప్పే ప్రయత్నం చేయాలని అనుకున్నాడట. అందుకే.. అంత తక్కువ ధర వి ధరించడం గమనార్హం.
విజయ్ లుక్ గురించి హర్మాన్ మాట్లాడుతూ, విజయ్ డ్రెస్సింగ్ కోసం చాలా బ్రాండ్లు, డిజైనర్లు తనతో నిరంతరం టచ్ లో ఉన్నారని చెప్పారు. అయితే.. విజయ్ మాత్రం తనకు ఫోన్ చేసి.. సినిమాలోని పాత్రకు తగినట్లుగా డ్రెస్ డిజైన్ చేయమని అడిగారని .. ముఖ్యంగా చెప్పుల గురించే స్పెషల్ గా అడిగాడని ఆమె వివరించారు.
తాను అనుకున్నట్లే.. విజయ్ తాను ధరించిన డ్రెస్, చెప్పులతో సినిమా కి ఉన్న బజ్ ని మరింత పెంచడం గమనార్హం. ముంబయిలో జరిగినప్పటికీ కార్యక్రమం... అతను ధైర్యంగా ఆ చెప్పులతో వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేశాడని ఆమె చెప్పారు.