భయపెడుతున్న ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్.. మీ పిల్లల్లో ఈ కోవిడ్ లక్షణాలు కనిపిస్తున్నాయేమో చూడండి..
Coronavirus signs in kids: దేశంలో కరోనా వైరస్ తగ్గినట్టే తగ్గి మళ్లీ దారుణంగా వ్యాపిస్తోంది. దీని దాటికి ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. మాస్క్ ను తప్పనిసరి చేశాయి. అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచిస్తున్నాయి. అయితే ఒమిక్రాన్ ఎక్స్ ఈ వేరియంట్ ప్రమాదం ఎక్కువగా పిల్లలకు, ముసలివాళ్లకు ఉందని నిపుణులు తేల్చి చెబుతున్నారు.
Coronavirus signs in kids: కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయని ఊపిరి పీల్చుకునే లోపే మళ్లీ కొత్త కొత్త వేరియంట్లతో ప్రజల కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది కరోనా మహమ్మారి. ముఖ్యంగా ఒమిక్రాన్ బిఎ1. మరియు ఒమిక్రాన్ బిఎ.2 స్ట్రెయిన్ రీకాంబినేషన్ గా పిలువబడే ఎక్స్ ఈ వేరియంట్ ప్రజలను తీవ్రంగా బయపెడుతోంది.
దీని కేసులు విపరీతంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాలు మాత్రం పెద్దగా లేవు. ఇది కాస్త ఊరట కలిగించే విషయమే. ఈ కొత్త వేరియంట్ ఢిల్లీలో గుర్తించబడింది.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పిల్లలు, వృద్ధులే కోవిడ్ ప్రమాదాలకు ఎక్కువగా గురవుతున్నారు. ఇలాంటి సమయంలో వీరిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది.
పిల్లల్లో కోవిడ్ యొక్క సాధారణ లక్షణాలు..
పిల్లల్లో సాధారణంగా కరోనా వైరస్ లక్షణాలు తేలికపాటివిగానే ఉంటాయి. ఈ సాధారణ లక్షణాలు జ్వరం, ముక్కు కారడం, దగ్గు, శరీర నొప్పులు, వాంతులు, విరేచననాలు, కొంతమంది పిల్లల్లో పొత్తకడుపు నొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలను అంతర్లీన అనారోగ్య సమస్యలున్న వారు తట్టుకోలేరు. అంటే గుండె, ఊపిరితిత్తులు, కాలెయం, మూత్రపిండాల సమస్యలన్నవారు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉందని.. న్యూఢిల్లీలోని ఐబీఎస్ హాస్పటల్ సీనియర్ న్యూరో సర్జన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ చెప్పారు.
పిల్లల్లో కనిపించే కోవిడ్ సాధారణ లక్షణాలు.
జ్వరం.. శరీరం, ముఖ్యంగా ఛాతీ, వీపుపై ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది.
నిరంతర దగ్గు.. గంటల తరబడి మీ పిల్లాడు దగ్గుతూ ఉన్నాడంటే కోవిడ్ సోకిందని అనుమానించాలి.
వాసన లేదా రుచిలో మార్పు.. చాలా మంది పిల్లలు కోవిడ్ బారిన పడ్డ తర్వాత ఆహార పదార్థాల రుచి లేదా వాసనను గుర్తించలేకపోతున్నారు. అయితే ఈ విషయాన్ని పిల్లలు తమకు తాముగా తెలుసుకోలేరు. కాబట్టి మీరే కనుకోవాలి.
ఆకలి లేకపోవడం.. అకస్మత్తుగా మీ పిల్లలు ఆహారం పట్ల ఇంట్రెస్ట్ చూపకపోవడం వ్యాధి సంక్రమణ, జ్వరానికి సంకేతం.
ముక్కు కారడం.. సాధారణంగా ముక్కు కారడం ఎన్ని రోజులు కొనసాగుతుందో ప్రతి తల్లిదండ్రులకు తెలిసే ఉంటుంది. అయితే మీ పిల్లలకు సాధారణం కంటే ఎక్కువ రోజులు ముక్కు కారుతుంటే వారికి కోవిడ్ టెస్ట్ ను తప్పక చేయించాలి.
గొంతు నొప్పి.. గొంతు నొప్పి పెట్టడం, దురదగా అనిపించడం వంటివి కోవిడ్ సంకేతాలే.
విరేచనాలు..మీ పిల్లాడు తరచుగా విరేచనాలకు వెళ్లడం కూడా కోవిడ్ లక్షణమే.
శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం.. మీ పిల్లలు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుంటే వెంటనే వైద్యులకు చూయించడం మంచిది. ఎందుకంటే ఇది కోవిడ్ లక్షణం.
శరీర నొప్పులు.. శరీరం నొప్పులు గా ఉన్నా పిల్లలు ఈ విషయాన్ని చెప్పలేరు. కాబట్టి మీ బిడ్డకు శరీర నొప్పులతో బాధపడుతున్నట్టు అనిపిస్తే వెంటనే వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లండి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. మాస్క్ లు ఖచ్చితంగా పెట్టాలి. ఇతరులకు 1 మీటర్ భౌతిక దూరాన్ని పాటించాలి. చేతులను తరచుగా కడుగుతూ ఉండాలి. ఈ అలవాట్లు మీ పిల్లలు అలవర్చుకునేలా ప్రోత్సహించాలి. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి వారికి అవగాహన కల్పించాలి. జాగ్రత్తగా ఉండమని సూచించాలి. ముఖ్యంగా కరోనా వల్ల కలిగే నష్టాలను వారికి వివరించాలి. వారిలో ఏదైన సమస్య వచ్చినప్పుడు తల్లిదండ్రులకు లేదా స్కూల్లో టీచర్లకు చెప్పమని తెలియజేయాలి.