Beard Growth Tips: గడ్డం పెరగడం లేదా..? ఈ టిప్స్ ను పాటించండి..
Beard Growth Tips: ప్రస్తుతం నిండైనా గడ్డం ఫ్యాషన్ గా మారింది. అయితే కొంతమందికి మాత్రం గడ్డం తొందరగా పెరగదు. మరికొంతమందికేమో.. గడ్డం నిండుగా అసలుకే పెరగదు. అలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఒత్తైన గడ్డం మీ సొంతం అవుతుంది.

Beard Growth Tips:ప్రస్తుత ఫ్యాషన్ యుగంలో..ఏది ఎప్పుడు ట్రెండింగ్ గా మారుతుందో చెప్పలేము. ఇకపోతే ప్రస్తుతం నిండైన గడ్డం ( Beard) ఫ్యాషన్ గా మారింది. అందుకే ఇప్పుడు క్లీన్ షేవ్ కు బదులుగా గడ్డాన్ని పెంచుకుంటూ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు.
అయితే కొంతమంది అబ్బాయిలకు తొందరగా గడ్డం పెరగదు. మరికొంతమందికేమో.. గడ్డం వచ్చినా.. నిండుగా ఉండదు. దాంతో వారు గడ్డం పెరిగేందుకు ఎన్నో ఎన్నెన్నో ప్రయోగాలను చేస్తుంటారు. అందులో భాగంగానే టీనేజన్లు తరచుగా షేవ్ చేస్తుంటారు. అలాగైనా గడ్డం తొందరగా వస్తుందని. అలాంటి వారు కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే ఒత్తైన గడ్డం మీ సొంతం అవుతుంది. ఇందుకోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పదండి..
చాలా మంది టీనేజర్లు.. ముఖంపై వెంట్రుకలు సరిగ్గా రాకముందే ట్రిమ్మింగ్, షేవింగ్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల గడ్డం వస్తుందని. వాస్తవానికి అది నిజం కాదు. వెంట్రుకలు రాకముందే షేవింగ్ చేయడం వల్ల వెంట్రుకలు రావు సరికదా.. ముఖం గరుకుగా తయారవుతుంది.
కొకనట్ ఆయిల్లో రోజ్ బేరి నూనెను మిక్స్ చేసి పడుకునే ముందు రాయాలి. దీనివల్ల గడ్డం పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే నువ్వుల నూనెలో లేదా ఆలివ్ ఆయిల్ లో Eucalyptus oil ను వేసి బాగా మిక్స్ చేసి.. దాన్ని గడ్డంపై అప్లై చేయాలి. దీన్ని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని గోరు వెచ్చని లేదా..చల్లని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల చక్కటి ఫలితం ఉంటుంది.
గడ్డాన్ని పెంచడంలో నిమ్మరసం ఎంతో సహాయపడుతుంది. ఇందుకోసం.. రెండు టీ స్పూన్ల నిమ్మరసం తీసుకుని అందులో ఒక టీస్పూన్ దాల్చీన చెక్క పొడిని వెయ్యాలి. ఆ మిశ్రమాన్ని బాగా కలిపి గడ్డానికి చెంపలపై అప్లై చేయాలి. దాన్ని బాగా ఆరనిచ్చి ఆ తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. క్రమం తప్పకుండా ఇలా చేస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
టీనేజర్లకు పోషకాహారం ఎంతో అవసరం. విటమిన్లు, ప్రోటీన్లు ఎక్కువగా లభించే బలమైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా కంటినిండా నిద్రపోవాలి. ఒత్తిడికి గురికాకూడదు. ఇలా ఉంటేనే గడ్డం తొందరగా వస్తుందట.
గడ్డం రావడానికి నీరు ప్రముఖ పాత్ర వహిస్తుంది. అందుకే టీనేజర్లు ఖచ్చితంగా రోజుకు ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. అప్పుడే నిండైన గడ్డం మీ సొంతం అవుతుంది.
ఆవాల ఆకులు కూడా గడ్డం రావాడానికి సహాయపడతాయి.. ఆవల ఆకులను కొన్నింటిని తీసుకుని వాటిని పేస్ట్ లా తయారుచేసుకోవాలి. ఆ పేస్ట్ లో కొద్దిగా ఉసిరి నూనెను కలపాలి. దాన్ని గడ్డంపై రాయండి. అది ఆరినాకా.. నీట్ గా కడిగేయండి. ఇలా చేస్తే కూడా గడ్డం తొందరగా పెరుగుతుంది.