Hair care tips: వర్షాకాలంలో జుట్టును ఆరోగ్యంగా ఉంచే చిట్కాలివిగో..
Hair care tips: వర్షంలో జుట్టు తడిసిపోవడం, దుమ్మూ, ధూళి అంటుకోవడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు విపరీతంగా రాలడం, చిట్లిపోవడం వంటి ఎన్నో సమస్యలు వస్తాయి.

వర్షాకాలంలో కేవలం చర్మమే కాదు.. జుట్ట దెబ్బతింటుంది. వర్షంలో నెత్తి తడవడం, చెమట, దుమ్మూ, ధూళి వంటివి నెత్తిమీదకు చేరి జుట్టును దెబ్బతీస్తాయి. నెత్తిమీద ఉండే కలుషిత, ధూళి కణాలు జుట్టు అందాన్ని మొత్తం పాడు చేస్తాయి. జుట్టు ఆరోగ్యంగా, ఆకర్షణీయంగా ఉండాలంటే ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..
తడి జుట్టు: వర్షాకాలంలో జుట్ట తడిసి పోవడం సాధారణ విషయం. కానీ జుట్టు తడిగా ఉండే వెంట్రుకలు చిట్లిపోతాయి. మురికిగా కూడా కనిపిస్తాయి. అందుకే ఈ సీజన్ జుట్టును సాధ్యమైనంత వరకు పొడిగా ఉంచాలి. గోరువెచ్చని ఆయిల్ పెట్టి పది ఇరవై నిమిషాల పాటు మసాజ్ చేయాలి. మసాజ్ వల్ల జుట్టుకు రక్తప్రసరణ మెరుగ్గా జరుగుతుంది. ఆ తర్వాత హెడ్ బాత్ చేసి పూర్తిగా ఆరిన తర్వత యాంటీ ఫ్రిజ్ సీరమ్ ను ఉపయోగిస్తే జుట్టు ఆరోగ్యంగా, ఒత్తుగా ఉంటుంది.
చండ్రు: చండ్రు సమస్యతో ప్రస్తుతం చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. నెత్తిపై దుమ్ము, ధూళి, మురికి పేరుకుపోతే చుండ్రు వస్తుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే తరచుగా షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే వారానికి ఒకసారి జింక్ పైరిథియోని ఉన్న మెడికేటెడ్ లేదా సెలీనియం సల్ఫైడ్ ఉన్న షాంపూలను వాడితే కూడా చుండ్రు పోతుంది.
మాడు జిడ్డుగా ఉండటం: వర్షపు నీటిలో తడవడం వల్ల నెత్తిపై ఉండే సహజ స్కాల్స్ ఆయిల్ వర్షపు నీటిలో కలిసిపోయి.. జుట్టు అత్తుకుపోతుంది. దీనివల్ల జుట్టు బలహీనపడుతంది. అందుకే వానలో తడిసిన వారు కెమికల్స్ తక్కువగా ఉండే షాంపూతో స్నానం చేయండి. అయితే కండీషనర్ ను ఉపయోగిస్తున్నట్టైతే కేవలం జట్టు చివర్లకు మాత్రమే ఉపయోగించాలి. కండీషనర్ ను కడిగిన తర్వాత చల్లని నీళ్లను ఉపయోగించండి. కూల్ వాటర్ ఆయిల్ ఉత్పత్తి నెమ్మదిగా అయ్యేలా చేస్తాయి.
నెత్తిమీద ఫంగల్ ఇన్ఫెక్షన్: జుట్టును శుభ్రంగా ఉంచుకుంటే నెత్తిమీద ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్ దాడి చేసే ప్రమాదమే ఉండదు. ముఖ్యంగా ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ వర్షాకాలంలో దాడిచేస్తుంది. వైద్యుడిని సంప్రదించి నెత్తిని శుభ్రం చేసుకోవడానికి యాంటీ ఫంగల్ లోషన్ ను ఉపయోగించడం మంచిది.
జుట్టు చిట్లిపోవడం, పొడిబారడం వంటి వివిధ కారణాల వల్ల జుట్టు సహజ మెరుపును కోల్పోతుంది. తిరిగి జుట్టు ప్రకాశవంతంగా మారాలంటే ఒక కప్పు నీటిలో అరకప్పు ఆపిల్ సైడర్ వెనిగర్ ను వేసి బాగా కలపండి. జుట్టును షాంపూతో క్లీన్ చేసిన తర్వాత జుట్టుకు ఈ నీటిని అప్లై చేయండి. ఇది పెలుసులు బారిన జుట్టును రిపేర్ చేస్తుంది. అలాగే ఎండకు దెబ్బతిన్న జుట్టు కూడా మెరుగుపడుతుంది.
పెళుసైన జుట్టు: సూర్యరశ్మిలో ఎక్కువ సేపు ఉండటం వల్ల జుట్టు పెళుసులుగా తయారవుతుంది. ఇలాంటప్పుడు ప్రోటీన్ ఫుడ్ ను ఎక్కువగా తీసుకోవాలి. బయోటిన్ విటమిన్ కూడా జుట్టుకు మేలు చేస్తుంది. ఇది జట్టును పొడుగ్గా చేస్తుంది. అలాగే హెయిర్ ఫాల్ సమస్య కూడా పోతుంది. బలహీనమైన జుట్టు బలంగా మారుతుంది. వైద్యుడిని సంప్రదించి బయోటిన్ సప్లిమెంట్లను తీసుకోవచ్చు.