చలికాలంలో కంటి ఆరోగ్యం బాగుండాలంటే ఈ ఆహారాలను తప్పకుండా తినండి
చలికాలంలో కంటి ఆరోగ్యం పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. చల్లని గాలుల వల్ల కళ్లు పొడిబారడం, దురద పెట్టడం, చికాకు, కంటి నొప్పి వంటి సమస్యలు వస్తుంటాయి. అయితే ఈ సీజన్ లో కొన్ని ఆహారాలను తింటే కంటి చూపు బాగుంటుంది. కళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.
eye health
మిగతా సీజన్ల మాదిరిగానే చలికాలంలో కూడా అంటువ్యాధులు, మరెన్నో ఆరోగ్య సమస్యలు వస్తుంటాయి. ముఖ్యంగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, జ్వరం వంటి మరెన్నో సమస్యలు వస్తుంటాయి. అయితే చలికాలంలో కంటికి సంబంధించిన సమస్యలు కూడా ఎక్కువగా వస్తుంటాయి. చలికాలంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోకపోవడం వల్ల కళ్ళు పొడిబారడం, చికాకు, దురద, కళ్లలో మంట, కంటి నొప్పి లేదా తలనొప్పి వంటి సమస్యలు తరచుగా వస్తుంటాయి. శీతాకాలంలో తక్కువ ఉష్ణోగ్రతలు, తేమ వంటివి సమస్యలను మరింత పెద్దవి చేస్తాయి. అందుకే ఈ సీజన్ లో కళ్ళ పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. అయితే ఈ సీజన్ లో దొరికే కొన్ని రకాల పండ్లు, కూరగాయలను తింటే కంటి ఆరోగ్యం బాగుంటుంది. అవేంటంటే...
క్యారెట్లు
క్యారెట్లు మన కళ్లకు చేసే మేలు అంతా ఇంతా కాదు. క్యారెట్లను కళ్ళను బలోపేతం చేయడానికి పురాతన కాలం నుంచి వాడుతున్నారు. వీటిలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. దీన్ని మన శరీరం విటమిన్ ఎ గా తయారుచేస్తుంది. దీనిలో కంటి ఆరోగ్యాన్ని కాపాడే యాంటీ ఆక్సిడెంట్ అయిన లుటిన్ కూడా మంచి పరిమాణంలో ఉంటుంది. క్యారెట్లతో వంటలు తయారుచేసుకుని తింటే కంటికి మంచిది.
చిలగడదుంపలు
తీపి బంగాళాదుంప లేదా చిలగడదుంపలో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపును మెరుగుపరచడానికి సహాయపడుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. చిలగడదుంపలలోని ఇతర కెరోటినాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని మరింత పెంచుతాయి. వీటిని పచ్చిగా లేదా ఉడికించి లేదా కొన్ని వంటల్లో వేసుకుని తినొచ్చు.
guava
జామకాయ
జామకాయల్లో విటమిన్ ఎ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు దీనిలో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇవి కంటిని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. ఈ సీజన్ లో జామకాయలు పుష్కలంగా లభిస్తాయి. దీనిలోని విటమిన్ సి కంటిశుక్లం అవకాశాలను తగ్గిస్తుంది. మాక్యులర్ క్షీణత కారణంగా వచ్చే దృష్టి నష్టాన్ని నివారిస్తుంది.
ఉసిరి
ఉసిరి లేదా ఇండియన్ గూస్ బెర్రీ శీతాకాలంలో బాగా పండుతాయి. శీతాకాలపు బెస్ట్ ఆహారాలలో ఇదీ ఒకటి. కంటి ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాల్లో ఉసిరికాయ ఒకటి. ఉసిరిలో విటమిన్ సి కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది మన కళ్లను బలోపేతం చేస్తుంది. అలాగే కార్నియాలోని కొల్లాజెన్ ను నిర్వహించడానికి కూడా సహాయపడుతుంది. మీ వంటకాల్లో లేదా మీ రోజు వారి ఆహారంలో ఉసిరికాయను తప్పక చేర్చండి.
Leafy Vegetables
ఆకుకూరలు
చలికాలంలో కాలే, బచ్చలికూర, సాగ్ వంటి ఆకుకూరలు పుష్కలంగా లభిస్తాయి. చలికాలంలో లభించే ఆకుకూరల్లో లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి.
beet root
బీట్ రూట్
ముదురు రంగు బీట్ రూట్ కంటి ఆరోగ్యానికి చాలా మంచిది. బీట్ రూట్ వంటి కూరగాయల్లో నైట్రేట్లు, లుటిన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ళలో మాక్యులర్ క్షీణతను తగ్గిస్తాయి. దీంతో దృష్టి నష్టం ప్రమాదం తగ్గుతుంది. ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. కళ్లను ఆరోగ్యంగా ఉంచుతుంది.
బ్రోకలీ
బ్రోకలీ కూడా విటమిన్ సి కి అద్భుతమైన మూలమని చాలా మందికి తెలియదు. అయితే బ్రోకలీ కూడా దృష్టిని మెరుగుపరుస్తుంది. బ్రోకలీలో కనిపించే యాంటీఆక్సిడెంట్లు రెటీనాకు నష్టం జరగకుండా సహాయపడతాయి. మొత్తంగా బ్రోకలీ కళ్లను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి.