- Home
- Life
- Heart Health Tips: మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Heart Health Tips: మీ ఫ్యామిలీలో ఎవరికైనా హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Heart Health Tips: మారుతున్న జీవనశైలి కారణంగా గుండెపోటు ప్రమాదాలు రోజు రోజుకు పెరిగిపోతూనే ఉన్నాయి. అయితే మీ ఫ్యామిలీలో ఎవరికైనా గుండె జబ్బులు ఉండే కుటుంబ సభ్యులంతా చాలా జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మారుతున్న జీవనశైలి కారణంగా హార్ట్ ఎటాక్ ప్రమాదం పెరగడం ప్రస్తుత కాలంలో సర్వసాధారణం అయిపోయింది. కుటుంబంలో ఎవరికైనా గుండెజబ్బులు ఉంటే.. ఇంట్లో ఉన్నవారంతా తమ ఆరోగ్యం పట్ల తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వాస్తవానికి కుంటుంబంలో గుండె పోటు లేదా స్ట్రోక్ ఉన్న వారుంటే కుటుంబంలోని ఇతర వ్యక్తులకు కూడా గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఇలాంటి పరిస్థితిలో కుంటుంబంలోని ఇతర వ్యక్తులు సైతం తమ ఆరోగ్యంపై పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇతరలకు గుండె సంబంధింత జబ్బులు రాకూడదంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తంలో షుగర్ ను అదుపులో ఉంచండి.. డయాబెటీస్ వచ్చిన వారికి కొన్ని రోజులకు కొంతమందికి గుండె సమస్యలు కూడా వస్తాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురుకాకూడదంటే మీ రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియింత్రణలో ఉంచుకోవాలి. ముఖ్యంగా మీ కుటుంబంలో గుండె జబ్బులున్నవారు ఇప్పుడు లేదా ఇంతకు ముందు ఉన్నట్టైనే మీరు ఎప్పటికప్పుడు వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఎందుకంటే మీకు కూడా వచ్చే అవకాశం ఉంది.
బరువును అదుపులో ఉంచుకోండి.. శరీర బరువు విపరీతంగా పెరిగితే మీకు సర్వ రోగాలు చుట్టుకునే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరికీ తెలుసు. అందుకే ఎలాంటి సమస్యలు రాకూడదన్నా మీ వెయిట్ ను నియంత్రణలో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ముఖ్యంగా వెయిట్ పెరిగితే గుండె జబ్బులు కూడా పెరుగుతాయి.
స్మోకింగ్ చేయొద్దు.. ఇప్పటికే మీ ఇంట్లో హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నట్టైతే మీరు సిగరేట్లకు వీలైనంత దూరంగా ఉండటం ఎంతో అవసరం. ఎందుకంటే స్మోకింగ్ మీ శరీరాన్ని దెబ్బతీస్తుంది. అంతేకాదు దీనివల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలు సోకొచ్చు. అందుకే వీలైనంత వరకు సిగరేట్ కు దూరంగా ఉండండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఆల్కహాల్ మానుకోండి.. ఆల్కహాల్ ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదు. మరీ ముఖ్యంగా మీ ఫ్యామిలీలో గుండె జబ్బుల చరిత్ర ఉన్నట్టైతే అప్పుడు మీరు ఖచ్చితంగా మద్యానికి దూరంగా ఉండాలి. లేదంటే మీకు గుండెపోటు వచ్చే అవకాశం పెరుగుతుంది.