Heart Attack Symptoms in Women : మహిళల్లో గుండెపోటు.. ఈ లక్షణాలను అస్సలు విస్మరించకండి..
Heart Attack Symptoms in Women : ఆడ, మగ ఇద్దరిలో సాధారణంగా గుండెపోటు వచ్చే ముందు ఛాతి నొప్పి, శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది, శరీర నొప్పులు, వికారం, చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆడవారికి గుండెపోటు వచ్చే ముందు కొన్ని ఇతర లక్షణాలు కనిపిస్తాయంటున్నా నిపుణులు. అవేంటంటే..
heart attack
ఒకప్పుడు గుండెపోటు పురుషులకే ఎక్కువగా వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తాగా మారుతున్నాయి. పురుషుల మాదిరిగానే మహిళలలు కూడా గుండె జబ్బుల పాలవుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులు రావడమేనని పలు నివేదికలు చెబుతున్నాయి.
జంక్ ఫుడ్ ను అతిగా తీసుకోవడం, అధిక బరువు, ఊబకాయం, శరీరంలో కొవ్వు నిల్వలు, కొలెస్ట్రాల్ పెరగడం, డయాబెటీస్, స్మోకింగ్ వంటి అలవాట్లు గుండె ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
heart attack
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. గుండెపోటు సాధారణ లక్షణాలతో పాటుగా గుండెపోటు సమయంలో మహిళల్లో ఇతర ఇబ్బందికర లక్షణాలు కూడా కనిపిస్తున్నాయట. గుండెపోటు సాధారణ లక్షణాలు.. ఛాతిలో నొప్పి, శ్వాస తీసుకోవడం ఇబ్బంది, అధికంగా చెమట పట్టడం, వికారం, శరీర నొప్పులు, మైకము వంటివి కనిపిస్తాయి.
ఆడవారు, మగవారికి కూడా గుండెపోటు సమయంలో ఛాతిలో నొప్పి సర్వసాధారణం. ఈ లక్షణాలతో పాటుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, ఛాతి మధ్యలో కాకుండా ఎడమ వైపు ఛాతిలో నొప్పి, చెమటలు అధికంగా పడట్టం వంటి కొన్ని లక్షణాలు మహిళలల్లో కనిపిస్తాయని ముంబైలోని సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ సంజీవ్ కుమార్ చెప్పారు.
నేటి సమాజంలో ఆడవారిపై ఒత్తిడి దారుణంగా పెరిగిపోతుంది. ఒకవైపు ఇంటిపనులు, పిల్లల్ని చూసుకోవడం, ఆఫీసుల్లో పనిచేయడం వంటి పనుల్లో బిజీ బిజీ అవుతున్నారు. ఇన్ని పనులను చేయడంతో వారు శారీరకంగానే కాదు మానసికంగా కూడా ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు.
అందులోనూ రుతుక్రమం ఆగిపోయిన తర్వాత ఆడవారిలో రక్షణాత్మక ఈస్ట్రోజెన్ హార్మోన్ ఉత్తత్తి అవడం ఆగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగానే చాలా మంది మహిళలు గుండె జబ్బుల బారిన పడుతున్నారని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.