pumpkin seeds: గుమ్మడి గింజలను ఇలా తింటే గుండెపోటే కాదు.. ఈ సమస్యలు కూడా రావు..
pumpkin seeds: గుమ్మడి గింజలను తింటే హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అంతేకాదు గుమ్మడి గింజలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి.

గుమ్మడి గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఇవి గుండె పోటు ప్రమాదాన్ని తగ్గిస్తాయి. అలాగే గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతాయి. గుమ్మడి గింజలను మీ రోజు వారి ఆహారంలో చేర్చుకుంటే మరెన్నో అనారోగ్య సమస్యలను తరిమేయవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఈ గుమ్మడి గింజలు డయాబెటీస్ పేషెంట్లకు కూడా ఎంతో సహాయపడతాయి. అయితే ఈ గుమ్మడి గింజలు తినడం వల్ల ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయో ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం పదండి.
ప్రతిరోజూ తినాలి.. గుమ్మడి గింజల్ని క్రమం తప్పకుండా తిన్నట్టైతే మీ శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగే అవకాశమే ఉండదు. అంతేకాదు గుమ్మడి గింజలు మన శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్, మంచి కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యం చేయడానికి ఎంతో తోడ్పడుతుంది. అంతేకాదు హార్ట్ ఎటాక్ రిస్క్ ను కూడా తగ్గిస్తుంది.
రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచుతాయి.. మధుమేహులకు గుమ్మడి గింజలు ఎంతో సహాయపడతాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల వీరి రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రణలో ఉంటాయి. వాస్తవానికి గుమ్మడి గింజలు యాంటీ డయాబెటిక్ గుణాలను కలిగి ఉంటాయి. ఇవే రక్తంలో షుగర్ లెవెల్స్ ను నియంత్రణలో ఉంచడానికి సహాయపడతాయి.
స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.. గుమ్మడి గింజలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికి కూడా ఎంతో సహాయపడతాయి. స్మెర్మ్ కౌంట్, నాణ్యత తక్కువగా ఉన్న పురుషులు వీటిని తరచుగా తినడం వల్ల స్పెర్మ్ కౌంట్ బాగా పెరుగుతుంది.
జుట్టు పెరుగుదలకు.. గుమ్మడి విత్తనాల్లో ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు వీటిలో జింక్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. ఇవి హెయిర్ ఫాల్ సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే జుట్టు పొడుగ్గా పరడానికి, బట్టతల నుంచి విముక్తి కల్పించేందుకు కూడా సహాయపడుతాయి.
obesity
ఊబకాయం తగ్గేందుకు.. ఈ గింజల్లో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్మాలు, మంచి కొవ్వు, విటమిన్ ఈ, కెరోటిన్, ఫైబర్, ఫైటోస్టెరాల్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఇవన్నీ కొలెస్ట్రాల్ ను కరిగించడానికి సహయపడతాయి. దీంతో ఊబకాయం పెరిగే ఛాన్సెస్ ఉండదు.