Recipes: హాట్ గా సూప్ తాగాలనిపిస్తుందా.. హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ ఓట్స్ సూప్ చేద్దాం!
Recipes: వాతావరణం చాలా చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా సూప్ తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అయిన క్యారెట్ ఓట్స్ సూప్ తాగితే నోటికి, ఆరోగ్యానికి రెండిటికీ బాగుంటుంది. ఇప్పుడు దాని తయారీ ఎలాగో చూద్దాం.
వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఏదైనా తినాలనిపిస్తుంది లేదా తాగాలనిపిస్తుంది. అలాంటప్పుడు ఆరోగ్యం వైపే మొగ్గు చూపించి ఈ టేస్టీ ఓట్స్ అండ్ క్యారెట్ సూప్ ప్రిపేర్ చేయండి. ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు ఏమిటో చూద్దాం. పావు కప్పు ఓట్స్, పెద్దవి అయితే రెండు చిన్నవి అయితే నాలుగు క్యారెట్లు.
ఉల్లిపాయలు రెండు, వెన్న రెండు టీ స్పూన్లు, కొత్తిమీర సగం కట్ట, ఉప్పు రుచికి సరిపడా, చిటికెడు మిరియాల పొడి. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. క్యారెట్ తీసుకొని నీటిలో శుభ్రం చేసే తరువాత దాని చుట్టూ ఉండే పొరని తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి.
ఒక బాణలిలో రెండు కప్పుల నీళ్లు పోసి అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు, క్యారెట్ ముక్కలు వేసి ఉడికించాలి. పూర్తిగా మెత్తబడే వరకు ఉడికించి తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. బాగా చల్లారిన తర్వాత వాటిని మిక్సీ జార్ లో వేసి గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.
మరోవైపు పాన్ లో వెన్న వేసి వేడి చేసుకోవాలి. అందులో ఓట్స్ వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని నీళ్లు పోసి కొద్దిసేపటి వరకు మీడియం మంట మీద ఉడికించాలి. ఓట్స్ బాగా ఉడికిన అనంతరం అందులో ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ రసం.
తగినంత ఉప్పు, కొంచెం మిరియాల పొడి వేసి కొంచెం చిక్కగా అయ్యేవరకు ఉంచుకోవాలి. అవసరం అనుకుంటే టమాటా సాస్ కూడా వేసుకోవచ్చు. అంతే ఘాటుగా టేస్టీగా ఉండే క్యారెట్ ఓట్స్ సూప్ రెడీ. దీనిని తాగటం వలన మానసిక ఒత్తిడి దూరమవుటమే కాకుండా నీరసం మొత్తం తొలగిపోతుంది.
ఎందుకంటే ఇందులో ఉండే ఆరోగ్యకరమైన పోషకాలు నీరసాన్ని మన దగ్గరికి రానివ్వవు సరి కదా హృదయాన్ని తేలికగా ఉంచుతుంది. శరీరంలో అక్కర్లేని కొలెస్ట్రాల్ ని తొలగిస్తుంది.