- Home
- Life
- Healthy Tips for Skin: ప్రతి రోజూ స్నానం చేస్తున్నారా? అయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Healthy Tips for Skin: ప్రతి రోజూ స్నానం చేస్తున్నారా? అయితే ఈ విషయాలను ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే..
Healthy Tips for Skin: చలికాలంలో ప్రతి రోజూ స్నానం చేయడమంటే సాహసంతో కూడుకున్నదే. అందుకే కొంతమంది ఈ చలికాలంలో రోజూ స్నానం చేయడం అవసరమా? రెండు రోజుల కొకసారి చేస్తే సరిపోతుందిలే అంటూ స్నానాన్ని నెగ్లెట్ చేస్తుంటారు. కానీ ఇలా చేయడం అస్సలు మంచి పద్దతి కాదని నిపుణులు అంటున్నారు. ఈ స్నానం కేవలం పరిశుభ్రత కోసమే కాదు..

Healthy Tips for Skin: ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉండటానికి బలమైన ఆహారం ఎంత అవసరమో.. పరిశుభ్రత కూడా అంతే అవసరం. అందుకే వైద్యులు పరిశుభ్రతను ఖచ్చితంగా పాటించాలని సలహాలనిస్తుంటారు. ఇకపోతే వేసవి కాలమైతే.. ఎండలు మండిపోతుండటంతో రోజుకు రెండు మూడు సార్లైనా స్నానం చేసేస్తుంటారు. అదే చలికాలమైతే.. రోజుకు ఒక సారి స్నానం చేస్తేనే మహా ఎక్కువ అని భావించేవాల్లు చాలా మందే ఉంటారు. అంతేకాదు చలికాలం రోజుకు కనీసం ఒకసారి కూడా స్నానం చేయని వారు చాలా మందే ఉంటారు. ఎందుకంటే విపరీతమైన చలికి స్నానం ఎలా చేయాలి? ఈ ఒక్కరోజు స్నానం చేయకుంటే వచ్చే నష్టమేమీ లేదని భావిస్తుంటారు. ఈ కారణంగానే చాలా మంది ప్రతి రోజూ స్నానం చేయరు.
కానీ ప్రతిదినం స్నానం చేయకపోవడం వల్ల ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ స్నానం కేవలం పరిశుభ్రత కోసమే కాదంటున్నారు ఆరోగ్య నిపుణులు. మరి ఎందుకోసమో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రతిరోజూ స్నానం చేయకపోవడం వల్ల విపరీతమైన చెమట వస్తుంది. ఆ చెమట మూలంగా శరీరంపై ఉండే మలినాలు స్వేద రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. అందుకే ఈ మలినాలు తొలగించేందుకు మనం క్రమం తప్పకుండా స్నానం చేయాలని నిపుణులు చెబుతున్నారు.
స్నానం చేయడం వల్ల శరీరంపై ఉండే మలినాలు తొలగిపోయి.. స్వేద రంధ్రాలు తెరచుకుని చెమట బయటకు పంపబడుతుంది. తద్వారా మన శరీర ఉష్ట్రోగ్రత నియంత్రణలో ఉంటుంది.
మన శరీర ఉష్ణ్రోగ్రతను, వెదర్ ను బట్టి స్నానం చన్నీళ్లతో చేయాలా? లేకపోతే వేడి నీళ్లతో చేయాలా ? అనేది మనమే నిర్ణయించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వేడినీళ్లతో స్నానం చేస్తే మన శరీరంలో Blood circulation మెరుగ్గా జరుగుతుంది. దీనివల్ల శరీరంలోని మలినాలన్నీ తొందరగా బయటకు వెళ్లిపోతాయి.
ఉదయం వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల బాడీ రిలాక్స్ అవుతుంది. దీనివల్ల నిద్రమత్తు ఆవహించే అవకాశం ఉంది. దీంతో మీరు మీ పనిపట్ల శ్రద్ద, ఏకాగ్రత చూపలేరు. కాబట్టి ఉదయం పూట చన్నీటి స్నానం చేయడమే బెటర్. పూర్తిగా చన్నీళ్లతో స్నానం చేయడం కష్టమనిపిస్తే గోరువెచ్చని నీళ్లతో చేసినా ఏమీ కాదు.
పొగలు కక్కే వేడినీళ్లతో స్నానం చేయడం వల్ల మన స్కిన్ పై ఉండే రక్షణ పొర దెబ్బతింటుంది. దీంతో చర్మం పొడిబారడం, జీవం కోల్పోయినట్టుగా మారుతుంది. అంతేకాదు దద్దుర్లు, దురద వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా ప్రతిరోజూ స్నానం చేస్తే మన బాడీలో Endorphins అనే పదార్థం రిలీజ్ అవుతుందట. దీనివల్ల మనం ఆనందంగా ఉంటామని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి క్రమం తప్పకుండా స్నానం చేసి.. ఆరోగ్యాన్ని కాపాడుకోండని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.