ఇవి ముఖాన్ని పాడుచేస్తాయి.. చర్మంపై నేరుగా అప్లై చేయకండి..
అందరిలో అందంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. ఇందుకోసం ఖరీదైన Cosmetics ను కూడా ఉపయోగిస్తుంటారు. వీటితో పాటుగా చిట్కాలను కూడా ట్రై చేస్తుంటారు. కానీ కొన్నింటిని నేరుగా చర్మానికి అప్లై చేయకూడదు. అలా చేస్తే ముఖ అందం పాడవుతుంది. అవేంటంటే..

నిమ్మకాయ (Lemon).. నిమ్మకాయను ముఖానికి నేరుగా ఎప్పుడూ అప్లై చేయకూడదు. ఎందుకంటే దీనిలో అధిక మొత్తంలో ఆమ్లం ఉంటుంది. ఇది చికాకు కలిగిస్తుంది. ఇక సున్నిత చర్మం ఉన్నవారు నిమ్మకాయను అస్సలు ఉపయోగించకూడదు.
ఆవనూనె (Castor oil).. శీతాకాలంలో చాలా మంది తరచుగా ఆవనూనెతో మసాజ్ చేసుకుంటూ ఉంటారు. కానీ గట్టిగా ఉండే ఆవనూనెను ముఖానికి అప్లై చేస్తే.. మీ ముఖం క్రమంగా నల్లగా మారుతుంది.
బేకింగ్ సోడా (Baking soda)..ముఖాన్ని లోతుగా శుభ్రపరచడానికి, మొటిమలను వదిలించుకోవడానికి చాలా మంది తరచుగా బేకింగ్ సోడాను ముఖానికి అప్లై చేస్తుంటారు. కానీ దానిని ముఖానికి నేరుగా అప్లైం చేయకూడదు. ఇలా చేస్తే మొటిమలు, మొటిమల సమస్య మరింత ఎక్కువ అవుతుంది.
టూత్ పేస్ట్ (Toothpaste).. టూత్ పేస్ట్ బ్లాక్ హెడ్స్ ను, మొటిమలను తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. కానీ టూత్ పేస్ట్ ను ముఖానికి నేరుగా అప్లై చేయకూడదు. ఇలా చేస్తే చికాకు, సంక్రమణకు కూడా దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకు ముందు మీరు మొటిమలపై టూత్ పేస్ట్ ను ఉపయోగించినట్లయితే.. ఉపయోగించిన తరువాత అవి ఎర్రగా మారడాన్ని మీరు గమనించి ఉండవచ్చు. టూత్ పేస్ట్ లో మీ చర్మాన్ని దెబ్బతీసే లక్షణాలే దీనికి కారణం.
వాక్సింగ్ (Waxing).. ముఖ చర్మం శరీరంలోని మిగిలిన భాగాల కంటే చాలా మృదువుగా, సున్నితంగా ఉంటుంది. శరీరంపై ఉండే చిన్న చిన్న వెంట్రుకలను తొలగించడానికి వాక్సింగ్ మంచి మార్గం. కానీ ఇది ముఖంపై ఉండే వెంట్రుకలకు సంబంధించినది కాదు. ఫేస్ వాక్స్ పొందడం వల్ల మీ చర్మంపై ఎర్రటి దద్దుర్లు వస్తాయి.
ఉప్పు, చక్కెర (Salt, sugar).. చాలా మంది ఇంట్లో స్క్రబ్ లను తయారు చేయడానికి ఉప్పు, చక్కెరను ఉపయోగిస్తుంటారు. కానీ ఉప్పు లేదా చక్కెరను ఉపయోగించడం ద్వారా మీ ముఖ చర్మం మరింత పొడిగా మరియు నిస్తేజంగా మారుతుంది. ఇది అంటువ్యాధులకు కూడా కారణమవుతుంది. ఉప్పు, చక్కెరను ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే.. మీ చర్మం దెబ్బతింటుంది.
వెల్లుల్లి (Garlic).. మొటిమలను తగ్గించడానికి చాలా మంది వెల్లుల్లిని నేరుగా ముఖానికి అప్లై చేస్తుంటారు. కానీ వెల్లుల్లిలో చాలా ఎక్కువ మొత్తంలో ఆమ్లం ఉంటుంది. దీనిని వాడటం వల్ల ముఖంపై దద్దుర్లు మరియు చికాకు ఏర్పడుతుంది.
వేడినీళ్లు.. వేడినీళ్లను జుట్టును కడగడానికి ఉపయోగించకూడదని చాలా మంది చెబుతుంటారు. అదే విధంగా ఈ వేడినీళ్లను ముఖం కడగడానికి కూడా ఉపయోగించకూడదు. వేడి నీటిని నేరుగా ముఖానికి వాడటం వల్ల మీ చర్మంలో తేమ తగ్గి పొడిగా మరియు నిర్జీవంగా మారుతుంది. ఇది చికాకును కూడా కలిగిస్తుంది.