ఎలాంటి రోగాలు, నొప్పులు లేకుండా బతకాలనుకుంటున్నారా..? అయితే ఈ జ్యూస్ లను తాగండి
ఆరోగ్యం బాగుండాలంటే.. జీవన శైలి బాగుండాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాలను తీసుకోవాలి. అయితే కొన్ని రకాల జ్యూస్ లను క్రమం తప్పకుండా తాగడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. శరీరం కూడా హెల్తీగా ఉంటుంది.

ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే.. ప్రతిరోజూ కూరగాయలు, పండ్ల రసాలను తప్పకుండా తాగాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆరోగ్యంగా ఉండాలంటే వేయించిన ఆహారాలను తినకూడదు. అలాగే ఉప్పు, చక్కెర వాడకాన్ని తగ్గించాలి. అయితే కొన్ని రకాల జ్యూస్ లను తాగితే మీరు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా లైఫ్ ను లీడ్ చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి.
ఆరెంజ్ జ్యూస్
సిట్రస్ ఫ్రూట్స్ అయిన ఆరెంజెస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఇమ్యూనిటీ పవర్ ను పెంచుతుంది. అందుకే సిట్రస్ పండ్లను ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతుంటారు. ప్రతిరోజూ ఆరెంజ్ జ్యూస్ ను తాగితే.. మీ శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. ఇది మిమ్మల్ని ఎన్నో రోగాల నుంచి దూరంగా ఉంచుతుంది. అయితే ఈ జ్యూస్ లో తేనె, నిమ్మరసం కలుపుకుని తాగితే టేస్టీగా ఉంటుంది.
తులసి రసం
తులసి రసాన్ని క్రమం తప్పకుండా తాగితే.. మీ ఆరోగ్యానికి ఏ డోకా ఉండదని నిపుణులు చెబుతున్నారు. తులసి రసం దగ్గు, జలుబు, ఆస్తమా, సైనస్, బ్రాంకైటిస్, ఎసిడిటీ, జ్వరం వంటి వివిధ రుగ్మతలకు తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుంది. అందుకే దీనిని క్రమం తప్పకుండా తీసుకోవడం మర్చిపోకూడదు. ఆకుపచ్చ తులసి కంటే నల్ల తులసి ఆకుల్లోనే ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిని మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. దగ్గు, జలుబు సమస్యలు ఉంటే నల్ల తులసి ఆకు రసంలో, అల్లం రసం కలిపి తాగితే దీని నుంచి త్వరగా ఉపశమనం పొందుతారు.
పైనాపిల్ జ్యూస్
పైనాపిల్ లో ఐరన్ కంటెంట్ లో తో పాటుగా విటమిన్ సి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే రోగ నిరోధక వ్యవస్థను బలంగా చేస్తుంది. చర్మాన్ని కూడా కాంతివంతంగా చేస్తుంది. ఈ జ్యూస్ లో కొద్దిగా తేనెను కలుపుకుని తాగితే బాగుంటుంది.
పుచ్చకాయ రసం
పుచ్చకాయ జ్యూస్ లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీనిలో ఉండే వాటర్ కంటెంట్ శరీరాన్ని డీహైడ్రేషన్ నుంచి బయటపడేస్తుంది. అలాగే కడుపును చల్లగా ఉంచుతుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. అలాగే అధిక రక్తపోటును కూడా నియంత్రించడానికి సహాయపడుతుంది. డీహైడ్రేషన్ సమస్య ఉంటే ఉప్పు, పంచదార, మైదా పిండిని తీసుకోవడం తగ్గించాలి. ఎందుకంటే ఈ ఆహారాలు శరీరంలో నీటి శాతాన్ని తగ్గిస్తాయి. వీటికి బదులుగా పుచ్చకాయ రసాన్ని తాగితే.. మీ శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.
బెర్రీ జ్యూస్
బెర్రీలల్లో ఎన్నో రకాల పోషకాలుంటాయి. వీటిలో విటమిన్ సి తో పాటుగా..ఎన్నో రకాల విటమిన్లు, ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. రెగ్యులర్ గా బెర్రీల జ్యూస్ లను తాగితే.. మీ శరీరంలో పోషకాల లోపమనేదే ఉండదు. మీకు తెలుసా..? పోషకాల లోపంతోనే ఎన్నో రకాల రోగాలొస్తాయి.
క్యారెట్ జ్యూస్
క్యారెట్ జ్యూస్ లో క్యాల్షియం, విటమిన్ ఎ, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటాయి. క్యారెట్ జ్యూస్ ను ఉదయం పరిగడుపున తీసుకుంటే ఎంతో మంచిది. క్యారెట్ జ్యూస్ తో మన శరీరానికి కావాల్సిన ఎన్నో పోషకాలు అందుతాయి. క్యారెట్ జ్యూస్ కళ్లను కూడా ఆరోగ్యంగా ఉంచుతాయి. చర్మం, జుట్టు, రక్త ప్రసరణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. అలాగే ఆకలిని పెంచడానికి కూడా సహాయపడుతుంది.