MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్తీ ఫుడ్స్ కి దూరంగా ఉండండి..

బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే ఈ హెల్తీ ఫుడ్స్ కి దూరంగా ఉండండి..

కొన్ని పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ బరువు తగ్గాలన్న మీ లక్ష్యాన్ని మాత్రం చేరుకోనివ్వవు.. అవేంటో తెలిస్తే.. వాటిమీద అవగాహన ఉంటే.. బరువుతగ్గాలని డైటింగ్ చేసేవారు కాస్త జాగ్రత్త పడవచ్చు.

2 Min read
Author : Bukka Sumabala
Published : Sep 25 2021, 04:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
110

బరువు తగ్గడం అనేది వయసుతో సంబంధం లేకుండా ఇప్పుడు ప్రతీ ఒక్కరి గోల్ గా మారిపోయింది. కరోనా నేపథ్యంలో ఇది మరింత జాగ్రత్తకు దారి తీసింది.  దీనికోసం డైటింగ్ లు, వ్యామామాలు, ఆరోగ్యకరమైన ఆహారాలు.. తక్కువ క్యాలరీలు ఉన్న ఆహారాన్ని తీసుకోవడం మొదలుపెట్టారు. అయితే మీరు అనుకున్నట్టుగా అన్ని ఆరోగ్యకరమైనవి వెయిట్ లాస్ కు పనికి రావంటున్నారు.. నిపుణులు. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
210

కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి మంచివే. కానీ బరువు తగ్గాలన్న మీ లక్ష్యాన్ని మాత్రం చేరుకోనివ్వవు.. అవేంటో తెలిస్తే.. వాటిమీద అవగాహన ఉంటే.. బరువుతగ్గాలని డైటింగ్ చేసేవారు కాస్త జాగ్రత్త పడవచ్చు.

310

కాజు, పిస్తా, బాదాంలాంటి నట్స్ మంచివే. ఆరోగ్యకరమైన కొవ్వు, పోషకాలు, తక్కువ క్యాలరీలతో ఉండే ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయి. కానీ మంచివి అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగానే ఉంటాయట. 

410

ప్రీ ప్యాక్డ్ పాప్ కార్న్ : ఫైబర్ చాలా ఎక్కువగా ఉండే స్నాక్ ఐటమ్ పాప్ కార్న్. అయితే ప్రీ ప్యాక్డ్ పాప్ కార్న్ లేదా మైక్రోవేవ్ చేసిన పాప్ కార్న్ ఆరోగ్యానికి అంత మంచివి కావు అంటున్నారు ఆరోగ్యనిపుణులు. బరువు తగ్గే క్రమంలో ఇవి తీసుకుంటే మీరు ఇబ్బందులో పడతారని చెబుతున్నారు. 

510

స్మూతీ : తాజపండ్లు, కూరగాయాలతో తయారు చేసే స్మూతీ నిజానికి ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలు అందుతాయి. అయితే దీంట్లో అంతర్లీనంగా కలిసిపోయి ఉండే చక్కెర మీ శరీరంలోకి మీకు తెలియకుండానే ఎక్కువ క్యాలరీను చేరుస్తుంది.

610

గ్రనోలా : ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉండే గ్రనోలా బ్రేక్ ఫాస్ట్ కు సరిగ్గా సరిపోయే ఆరోగ్యకరమైన ఆహారం. అయితే తక్కువతో ఎక్కువ శక్తిని అందించే ఈ ఆహారపదార్థంలో నూనెపదార్థాలు, చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మీ బరువు తగ్గే ఆలోచనను దూరం పెట్టేలా చేస్తాయి. మీ శ్రమ వృధా అవ్వడానికి తోడ్పడ్తాయి.

710

ఫ్లేవర్డ్ యోగార్ట్ : పెరుగు కడుపుకు చాలా మంచిది. ఆరోగ్యానికీ ఎంతో ఉపయోగపడుతుంది. అయితే చాలా ఫ్లేవర్డ్ యోగార్ట్ లలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. ఇది మీ బరువు తగ్గాలనే లక్ష్యాన్ని చేరుకోకుండా చేస్తుంది. దీనికంటే ఇంట్లోని సహజసిద్ధమైన మామూలు పెరుగు తినడం మంచిది. 

810

అగేవ్ సిరప్ : చక్కెర, తేనెలకు ప్రత్యామ్నాయంగా దీన్ని వాడుతుంటారు. అయితే దీంట్లో ఫ్రక్టోస్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకత్వాన్ని తగ్గించి, శరీర మెటబాలిజం దెబ్బతినేలా చేస్తుంది. చివరికి ఇది మీ వెయిట్ లాస్ ప్రక్రియను దెబ్బతీస్తుంది. 

910

రెస్టారెంట్ సలాడ్స్ : తాజా పండ్లు, కూరగాయలు, డ్రైఫ్రూట్స్ తో పుష్కలమైన పోషకాలతో నిండి ఉంటుంది సలాడ్స్. అయితే వీటిని ఇంట్లో చేసుకోవడం కాకుండా రెస్టారెంట్ల నుంచి తెప్పించుకునేటప్పుడు కాస్త ఆలోచించాలి. సలాడ్స్ మీద వేసే ఎక్స్ ట్రా టాపింగ్స్ తో బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. 

1010

అవకడో : శరీరానికి అవకడో చాలా చాలా మంచిది. అయితే వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే మంచిది కదా అని మోతాదు మించి తీసుకుంటే బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

About the Author

BS
Bukka Sumabala
ఆహారం
ఆరోగ్యం
Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hygiene: ఈ వస్తువులు పాడైనా వాడుతున్నారా? ఇది తెలుసుకోండి
Recommended image2
Budget Travel : మీ బడ్జెట్ లోనే ఫారెన్ ట్రిప్.. రూ.20-30 వేల ఖర్చే.!
Recommended image3
Beaded Earrings: పూసల చెవి పోగులతో ట్రెండీ లుక్.. ఇవిగో డిజైన్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved