Telugu

Kitchen Hygiene: ఈ వస్తువులు పాడైనా వాడుతున్నారా? ఇది తెలుసుకోండి

Telugu

స్పాంజ్

ముఖ్యంగా గిన్నెలు తోమే స్పాంజ్‍లు. వాటిని మూడు వారాల కంటే ఎక్కువ వాడకూడదు. కొంతమంది నెలల తరబడి యూజ్ చేస్తారు. ఇందులో మురికి, తేమ చేరి బ్యాక్టీరియా పెరుగుతుంది. కొత్తది కొనడం బెటర్.

Image credits: Getty
Telugu

స్క్రబ్బర్లు

గిన్నెలు తోమే వాడే స్క్రబ్బర్లను కూడా ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండాలి. ఎక్కువ కాలం ఒకే స్క్రబ్బర్ వాడటం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. మళ్లీ ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరుతుంది. 

Image credits: our own
Telugu

నాన్‌స్టిక్ పాత్రలు

నాన్‌స్టిక్ పాన్‌లు, ఇతర వంట పాత్రలను ఏళ్ల తరబడి వాడే అలవాటు మానుకోవాలి. పాతబడే కొద్దీ వాటిపై ఉండే కోటింగ్ పాడయ్యే ప్రమాదం ఉంది.
Image credits: Getty
Telugu

కటింగ్ బోర్డ్

ప్లాస్టిక్ కటింగ్ బోర్డును ప్రతి రెండు నెలలకు ఒకసారి మార్చాలి. దీనిపై ఆహార పదార్థాల మరకలు పట్టి, క్రిములు చేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
Image credits: Getty
Telugu

ప్లాస్టిక్ డబ్బాలు

ప్లాస్టిక్ డబ్బాలను ఎక్కువ కాలం వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. వాటిపై మరకలు పడినా, దుర్వాసన వచ్చినా వెంటనే మార్చేయాలి.
Image credits: Getty
Telugu

కిచెన్ టవల్

వంటగదిలో వాడే టవల్‌లో మురికి, తేమ చేరి బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం చాలా ఎక్కువ. ఏడాదికి మించి వీటిని అస్సలు వాడొద్దు.
Image credits: pexels
Telugu

చెక్కతో చేసిన వస్తువులు

చెక్కతో చేసిన కటింగ్ బోర్డులు, స్పూన్లు, ఇతర పాత్రలలో తేమ చేరి బ్యాక్టీరియా పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది. వీటిని కూడా ఎప్పటికప్పుడు మార్చడం మర్చిపోవద్దు.
Image credits: Getty

Budget Travel : మీ బడ్జెట్ లోనే ఫారెన్ ట్రిప్.. రూ.20-30 వేల ఖర్చే.!

Beaded Earrings: పూసల చెవి పోగులతో ట్రెండీ లుక్.. ఇవిగో డిజైన్లు

Curly Hair: ఉంగరాల జుట్టు ఉన్నవారికి సూటయ్యే బెస్ట్ హెయిర్ స్టైల్స్

Salwar suits: పార్టీవేర్ సల్వార్ సూట్స్.. వేసకుంటే అదిరిపోతాయి