ఆలియా భట్ తీసుకునే బీట్ రూట్ సలాడ్ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా..?
బీట్ రూట్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీనిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే బాలీవుడ్ హీరోయిన్ ఆలియా భట్ రోజూ బీట్ రూట్ సలాడ్ ను తీసుకుంటుంది.

బీట్ రూట్ లో విటమిన్ బి, విటమిన్ సి, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి ముఖ్యమైన పోషకాలుంటాయి. ఇవన్నీ రక్తహీనత నుంచి గుండె జబ్బుల వరకు ఎన్నో రోగాలను నయం చేస్తాయి. రెగ్యులర్ గా బీట్ రూట్ జ్యూస్ ను తాగితే.. ఎముకలు బలంగా తయారవుతాయి. ఎనర్జిటిక్ గా మారుతారు. గర్భిణులు దీనిని తీసుకోవడం వల్ల గర్భంలో పిండం ఎదుగుదల బాగుంటుంది. ముఖ్యంగా బీట్ రూట్ జ్యూస్ తాగేవారిలో జ్ఞాపకశక్తి బాగుంటుందని పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. ఇది ఏకాగ్రత్తను కూడా పెంచుతుంది. అందుకే హీరోయిన్ ఆలియా భట్ రెగ్యులర్ గా బీట్ రూట్ సలాడ్ ను తీసుకుంటుంది. దీనివల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
తక్కువ కేలరీలు
బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. బరువు తగ్గాలనుకునేవారికి ఇది చక్కగా ఉపయోగపడుతుంది. 100 గ్రాముల బీట్‌రూట్‌లో 44 కేలరీలు మాత్రమే ఉంటాయి.
రక్తపోటు అదుపులో ఉంచుతుంది
బీట్ రూట్ అధిక రక్తపోటును తగ్గించడంలో దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. దీనిలో ఉండే ఫోలేట్ రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.
వాపును తగ్గిస్తుంది
బీట్‌రూట్‌లో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలున్న బీటాలైన్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తాయిని ఎన్నో పరిశోధనలు స్పష్టం చేశాయి. ఇది మంటను కూడా తగ్గిస్తుంది.
ప్రేగు కదలికను మెరుగుపరుస్తుంది
బీట్‌రూట్‌లో ఎక్కువ మొత్తంలో డైటరీ ఫైబర్‌లు ఉంటాయి. ఇవి పేగు కదలకలను మెరుగుపరుస్తుంది.
మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది
బీట్ రూట్ లో నైట్రేట్ లు ఉంటాయి. ఇవి రక్త నాళాల విస్తరణను ప్రోత్సహిస్తాయని పలు ఆరోగ్య నివేదికలు స్పష్టం చేశాయి. అలాగే ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని కూడా నియంత్రిస్తుంది.
క్యాన్సర్‌తో పోరాడగలదు
బీట్ రూట్ లో క్యాన్సర్ ను నిరోధించే గుణాలున్నాయని పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. బీట్ రూట్ లో ఉండే కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ తో పోరాడగలవని నిరూపించబడింది.
బరువు తగ్గడానికి సహాయపడుతుంది
బీట్ రూట్ లో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫైబర్ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఆరోగ్యకరమైన ఫుడ్ అనే చెప్పాలి.
బీట్ రూట్ సలాడ్ ను ఎలా తయారుచేసుకోవాలి
తాజా బీట్ రూట్లను తీసుకుని వాటిని మెత్తగా తురుముకోవాలి. దీనికి కొద్ది పెరుగు, మిరియాల పొడి, ఉప్పు ను కలపండి. ఆవాలు, ఇంగువ, కరివేపాకులతో పోపును పెట్టండి. ఇంతే కేవలం పది నిమిషాల్లోనే హెల్తీ బీట్ రూట్ సలాడ్ రెడీ అవుతుంది.