- Home
- Life
- Health Tips: వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాల బారిన పడకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Health Tips: వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ వంటి రోగాల బారిన పడకూడదంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Health Tips: ఇతర కాలాలతో పోల్చితే ఈ వానాకాలంలోనే ఎక్కువగా రోగాలొచ్చే అవకాశం ఉంది. తడి వాతావరణం కారణంగా సూక్ష్మజీవులు, వైరస్ లు, బ్యాక్టిరియాలు, ఈగలు, దోమల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. వీటివల్ల ఎన్నో రోగాలొస్తాయి. వీటి మూలంగా ఒక్కో సారి ప్రాణాల మీదికి కూడా రావొచ్చు.

వాతావరణ మార్పులు ఎన్నో రోగాలకు కారణమవుతుంది. ముఖ్యంగా వానాకాలంలో రోగాల వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. మన ఇంటి చుట్టుపక్కల ఏ మాత్రం అశుభ్రతగా ఉన్నా దోమలు, ఈగలు, సూక్ష్మజీవులు, బ్యాక్టిరియాలు, వైరస్ లు విచ్చలవిడిగా పెరుగుతాయి. వీటివల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, కలరా, కామెర్లు, ఫ్లూ వంటి ఎన్నో రోగాలొచ్చే అవకాశం ఉంది.
ప్రతి ఏడాది ఈ రోగాల వల్ల ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే ఈ సీజన్ లో ఆరోగ్యం పట్ల మరింత జాగ్రత్త అవసరమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వానాకాలంలో సూక్ష్మజీవుల పెరుగుదల, వాతావారణ మార్పు వల్ల మన రోగనిరోధక శక్తి బలహీనపడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు ఈ సీజన్ లో బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది.
<p>rainy season</p>
మీరు రకరకాల జబ్బులతో బాధపడుతున్నా.. ఈ సీజన్ లో ఎలాంటి రోగాలకు గురి కాకూడదన్నా కొన్ని ఆరోగ్య జాగ్రత్తలను తప్పక తీసుకోవాలి. అప్పుడే మీ రోగ నిరోధక శక్తి బలపడుతుంది.
వానాకాలంలో చాలా మందిని వేధించే సమస్యల్లో వాంతాలు, అజీర్థి, విరేచనాలు ఉన్నాయి. మలబద్దకం, తలనొప్పి, ఆకలి లేకపోవడం, కడుపునొప్పి, జ్వరం వంటి సమస్యలు ఈ సీజన్ లోనే తలెత్తుతుంటాయి. ఈ సమస్యల బారిన పడకూడదంటే మీరు నీళ్లను పుష్కలంగా తాగాలి. హైడ్రేటెడ్ గా ఉంటే ఎలాంటి సమస్యలూ రావు.
వాంతులు, వికారం వంటి సమస్యల బారిన పడినట్టైతే.. అల్లం టీని గానీ.. అల్లం ను గానీ తీసుకోండి. అల్లంలో ఉండే ఔషదగుణాలు వాంతులు, వికారం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. నొప్పి నుంచి ఉపశమనం కలిగించడంలో ఇంగువ చక్కటి మెడిసిన్ లా పనిచేస్తుంది. ఇందుకోసం నాభి లోపల, చుట్టపక్కల ఇంగువ పేస్ట్ ను అప్లై చేయండి.
మసాలా ఆహారాలను ఈ కాలంలో అస్సలు తినకూడదు. తిన్నారంటే మలబద్దకం, గ్యాస్ట్రిక్, కడుపు వాపు, అజీర్థి వంటి సమస్య బారిన పడతారు. అందుకే ఈ సీజన్ లో స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ వంటి జోలికి వెల్లకపోవడమే మంచిది. ఈ ఆహారాలు ఎన్నో వ్యాధులకు కారణమవుతాయి.
leafy vegetables
ఇకపోతే ఆకు కూరలు మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. అయినా ఈ సీజన్ లో ఆకు కూరల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఎందుకంటే వీటికి తేమ ఎక్కువగా ఉంటుంది. రకరకాల సూక్ష్మజీవులకు ఆకులే ఆవాసంగా మారతాయి. అందుకే వీటిని ఈ కాలంలో తినకూడదు.
అల్లం ఆహారం తొందరగా జీర్ణం అయ్యేందుకు ఎంతో సహాయపడుతుంది. అందుకే భోజనానికి ముందు తర్వాత సెండా ఉప్పుతో కాస్త అల్లం ముక్కను నమలండి. ముఖ్యంగా ఈ సీజన్ లో పాడైపోయిన ఆహారాలను అసలే తినకూడదు.
ఏ పూటకు ఆపూట వేడిగా వండుకుని తింటే మరీ మంచిది. సలాడ్లను తీసుకోకపోవడమే మంచిది. ఇక ఈ సీజన్ లో ఉదయాన్నే పరిగడుపున గ్లాస్ గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె వేసుకుని తాగడం చాలా మంచిది. ఇది మన శరీరంలో ఉండే మలినాలను తొలగించడంలో సహాయపడుతుంది.
చేదుగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తినండి. కాకరకాయ, మెంతి కూర, పసుపు వంటివి మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోండి. ఈ ఆహారాలు సంక్రమణను దూరంగా ఉంచుతాయి.
ముఖ్యంగా ఈ కాలంలో మీ పరిసరాలను చాలా నీట్ గా ఉంచుకోవాలి. ఏ మాత్రం అశుభ్రతగా ఉన్నా.. క్రిమికీటకాలు చేరిపోతాయి. అలాగే మీ పాదాలు, చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోండి. చర్మవ్యాధులు సోకకూడదంటే మీ పాదాలను నీట్ గా కడిగి.. బాగా ఆరబెట్టి మాయిశ్చరైజర్ ను రాయాలి. అలాగే ప్రతి రోజూ స్నానం చేయాలి. స్నానానికి చల్లనీటిని వాడకూడదు.