ఈ అలవాట్లు మిమ్మల్ని షుగర్ పేషెంట్లను చేస్తాయి జాగ్రత్త..
నిజానికి చాలా మందికి తెలియదు.. మనకున్న అలవాట్లు మంచివా..? కావా అని.. రోగం వచ్చిన తర్వాతే తెలుస్తుంది.. ఇది మంచి హాబిట్ కాదని. అయితే కొన్ని అలవాట్లు మిమ్మల్ని షుగర్ పేషెంట్లను చేసే అవకాశం ఉంది. అవేంటంటే..

మారుతున్న జీవన శైలి కారణంగా ప్రమాదకరమైన రోగాలు కూడా ప్రస్తుతం సర్వ సాధారణ సమస్యలుగా మారిపోయాయి. వీటిలో డయాబెటీస్ కూడా ఒకటి. భారతదేశ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుందని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. మధుమేహం రావడానికి ఎన్నో కారణాలున్నాయి. ముఖ్యంగా కొన్ని అలవాట్ల వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు వెల్లడిస్తున్నారు. షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచే ఆహారాలేంటో తెలుసుకుందాం పండి.
శారీరక శ్రమ లేకపోవడం
కొంతమంది రెస్ట్ లేకుండా పనిచేస్తే.. ఇంకొంత మంది ఎప్పుడూ రెస్ట్ లోనే ఉంటారు. మీకు తెలుసా.. విశ్రాంతి ఎక్కువైనా డయాబెటీస్ వచ్చే ప్రమాదం పెరుగుతుందట. గంటల తరబడి ఒకే దగ్గర కూర్చోవడం లేదా పడుకోవడం వంటివి ఒంటికి అంత మంచివి కావు. శారీరక శ్రమ లేకపోతే గుండె పోటు, గుండె జబ్బుల, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. అన్నల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజంతా ఎక్కువ సేపు కూర్చునే వారికే క్యాన్సర్, గుండె జబ్బులు, డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని తేలింది. అందుకే కూర్చుని పనిచేసే వారు ఇంట్లో ఉండే వారు సీటుపై నుంచి లేచి కాసేపు అటూ ఇటూ నడుస్తూ ఉండండి.
నిద్రలేమి
నిద్రలేమి సర్వరోగాలకు దారితీస్తుంది. కానీ గజిబీజీ లైఫ్ కారణంగా చాలా మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా పడుకోవడం వల్ల డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ప్రతిరోజూ రాత్రి 8 గంటలు నిద్రపోయేలా చూసుకోండి. అప్పుడే ఈ ప్రమాదం నుంచి తప్పించుకుంటారు.
ఒత్తిడి
ప్రస్తుత కాలంలో ఒత్తిడి సర్వసాధారణ సమస్యగా మారిపోయింది. కానీ ఇది ఎన్నో అనారోగ్య సమస్యలకు దారితీస్తుందని పలు అధ్యయనాలు తేల్చి చెప్పాలయి. నిజానికి ఒత్తిడి వల్ల శరీరంలో కార్టిసాల్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఇన్సులిన్ ను బాగా పెంచుతుంది. కార్టిసాల్ ఎక్కువైతే రక్తంలో చక్కెర స్థాయిలు బాగా పెరుగుతాయి. ఇది షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
smoking
ధూమపానం, మద్యపానం
స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ అలవాట్లు ప్రస్తుత కాలంలో చాలా చిన్న వయసు వారికి కూడా ఉన్నాయి. కానీ ఇవి మీ ఆరోగ్యానికి అస్సలు మంచివి కావు. వీటివల్ల గుండె జబ్బులు వస్తాయి. రక్తపోటు కూడా పెరుగుతుంది. అంతెందుకు వీటి వల్ల డయాబెటీస్ ప్రమాదం కూడా ఉందని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఆల్కహాల్ ను మితిమీరి తాగడం వల్ల కాలెయంలో కొవ్వు పేరుకుపోతుంది. ఇది షుగర్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది.
అనారోగ్యకరమైన ఆహారం
అరోగ్యాన్ని పాడు చేసే ఆహారాల వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా జంక్ ఫుడ్ ను తినడం వల్ల ఈ ప్రమాదం మరింత ఎక్కువ అవుతుంది. కానీ ఈ రోజుల్లో జంక్ ఫుడ్ నే ఎక్కువగా తింటున్నారు. అందుకే డయాబెటీస్ పేషెంట్ల సంఖ్య దారుణంగా పెరిగిపోతోంది. అందుకే ఈ అలవాటుకు దూరంగా ఉండండి. అప్పుడే డయాబెటీస్ బారిన ప్రమాదం తప్పుతుంది.